మెయిన్ ఫీచర్

మద్యం సామ్రాజ్యంలో మహిళా విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళా వ్యాపారవేత్తలుగా బయటకు రావాలనుకుంటున్నారా! పాత చింతకాయ పచ్చడిలాంటి ఆలోచనలను వదలండి.. వాటికే అంటిపెట్టుకుని ఉండకండి. కొత్త పంథాలో ఆలోచించండి అని ప్రోత్సహిస్తున్నారు ‘ఐ బ్రాండ్స్ బేరేజెస్ లిమిటెడ్’ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ లిసా శ్రావ్.
ఎందుకంటే ఎవరూ ఊహించని లిక్కర్ రంగంలో ఆమె నభూతో నభవిష్యతి అనే రీతిలో వెలిగిపోతున్నారు. పురుషాధిక్యం ఎక్కువగా ఉండే మద్యం రంగాన్ని ఎంచుకోవడంలోనే ఆమెకు ఉన్న అభిరుచి, నూతనత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 2010 ఆగస్టులో ఐ బ్రాండ్స్ బేవరేజెస్‌ను ఆమె నెలకొల్పింది. అంతర్జాతీయ ప్రమాణాలకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో మన దేశ ప్రజలకూ లిక్కర్ అందించాలన్న లక్ష్యంతో ఈ సంస్థలను ఆమె స్థాపించారు. బ్లెండ్, డిజైన్, వినియోగదారులు చెల్లించే ధరలకు సరిపడా క్వాలిటీ ఉండే సరుకును అందించడమే ఆమె లక్ష్యం. ఆ కంపెనీ ప్రారంభించాలి అని అనుకున్నపుడు వద్దన్నవారు, నవ్వుకున్నవారు, ఈ రంగంలో బతికి కట్టలేరు అనే వారే ఎక్కువ శాతం ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐ బ్రాండ్స్ ఏర్పాటు వెనుక కష్టం, ఆలోచన మొదలైన విషయాల గురించి లిసా చెప్పిన ఆసక్తికర విషయాలు ఆమె మాటల్లోనే..
‘‘నా తల్లిదండ్రులు పంజాబ్ వాళ్లు. నేను పుట్టి పెరిగింది యూకెలో. నివాసం లండన్‌లో. మెరైన్ బయాలజిస్ట్ అవ్వాలన్నది నా చిన్ననాటి కల. కానీ షార్కులు గుర్తుకువచ్చి దానికి ఫుల్‌స్టాప్ పెట్టాను. అసలు బయాలజీ సబ్జెక్టునే పక్కన పెట్టాను. వేరే మార్గంలో వెళ్లాను. ఇంటర్నేషనల్ మార్కెటింగ్, కన్స్యూమర్ బిహేవియర్ ప్రత్యేకాంశాలుగా మేనేజీరియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్టడీస్‌లో బిఎస్సీ (ఆనర్స్) డిగ్రీని బర్మింగ్‌హామ్‌లోని ఆస్టస్ యూనివర్సిటీ నుంచి పూర్తిచేశాను. నిత్యనూతనమైన మీడియా రంగంలో ప్రవేశించాను. యూకెలోని పెద్ద పెద్ద మీడియా సంస్థల్లో పనిచేశాను. వయాకామ్, వివేంది యూనివర్సల్, న్యూస్ కార్పొరేషన్ వంటి మొదలైన సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించాను.
భారత్‌కు తరచుగా వస్తుండేదానిని. 2003లో నాకు పెళ్లయింది. మాకు సంతానం ఇద్దరు. ఇసాబెల్లా, మార్కస్. సంతానానికి ముందే నాకు ఈ లిక్కర్ వ్యాపారం చేయాలన్న కొత్త ఆలోచన వచ్చింది. మన దేశంలో ప్రిమియం లిక్కర్ సెగ్మెంట్‌కు ఉన్న మార్కెట్ చాలా తక్కువ. దీనిని దృష్టిలో పెట్టుకునే ఈ రంగంలోకి దిగాను. 15 ఏళ్ళ క్రితం యూకెలో డబుల్ డచ్ బీర్ బ్రాండ్ ఉండేది. అది మా నాన్న స్థాపించిన సంస్థ ఉత్పత్తే. బేవరేజెస్ గురించి కొంత అవగాహన నాకూ అప్పటినుంచే కొద్దో గొప్పో ఉండేది. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా భారత్‌లో మద్యం ఉత్పత్తుల్లో పలు రకాలు అందుబాటులో లేవు. ఈ లోటును భర్తీ చేయాలన్న లక్ష్యమే ఐబ్రాండ్ బేవరేజెస్‌ది. రెండేళ్ల శ్రమ అనంతరం భారత్‌లో మా ఉత్పత్తులు ప్రారంభించాము. మా మొట్టమొదటి ఉత్పత్తి గ్రాంటన్ విస్కీ.
చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న కొత్త బేవరేజెస్‌లో మాది కూడా ఉంది. అంతేకాదు అవార్డులు సొంతం చేసుకున్న కంపెనీ కూడా ఇది. మేము అద్భుతమైన నాలుగు ప్రొడక్టులను ఉత్పత్తి చేస్తున్నాము. ప్రీమియం విస్కీ బ్రాండ్, త్రీ రాయల్స్, డీలక్స్ విస్కీ, గ్రాంటన్ విస్కీ, గ్రాంటన్ ప్యాకేజ్‌కుగాను 2014 ఐఎన్‌డి స్పిరిట్ అవార్డు లభించింది. జమైకన్ ప్లేవర్డ్ డార్క్ రమ్, రమ్ 99, అరుదైన ఫ్రెంచ్ బ్రాందీ, గ్రాంట్ ఎక్స్‌ఓ బ్రాందీలు కూడా మా ఉత్పత్తలే అని చెప్పడానికి గర్వంగా ఉంది.
లిక్కర్ ఉత్పత్తి రంగంలో పూర్తిగా మునిగిపోవాలనుకోవడంలేదు. లిక్కర్ రంగంలో వ్యాపారమనేది కత్తిమీద సాములాంటిది. అదీకాక పురుషుల డామినేషన్ ఎక్కువగా ఉండే ఈ వ్యాపారంలో ఒక మహిళగా నిలదొక్కుకుని, ఎదగడాన్ని సవాల్‌గా తీసుకుంటాను. బేవరేజెస్‌కు సంబంధించిన అన్ని పనులను దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తుంటాను. మాన్యుఫ్యాక్చరింగ్, సేల్స్, బ్రాండింగ్, మార్కెటింగ్, ప్రొడక్ట్ డిజైన్, ప్యాకేజింగ్ ఇలా ప్రతీదానిపైనే నాకు అవగాహన ఉంది. జాతీయ, అంతర్జాతీయ సలహాదారుల బోర్డు ఒకటి నాకు ఉంది. మేలిరకపు ఉత్పత్తులకు వీరి సలహాలు చాలా దోహదపడతాయి. మా ఉత్పత్తుల ధరకు తగ్గట్టుగానే వాటి నాణ్యత ఉంటుంది అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. మాది చిన్న కంపెనీయే. కానీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఐ బ్రాండ్ ఉత్పత్తులు నార్త్‌లో పంజాబ్, హర్యానా, చండీగడ్, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, సౌత్‌లో గోవా, పాండిచ్చేరిలో మొత్తం కలిపి 5000 చోట్ల మా ఉత్పత్తులు లభ్యమవుతున్నాయి. మొట్టమొదటిసారిగా పారామిలటరీ ఆర్డర్లుకూడా మాకు దక్కాయి. మా ఉత్పత్తులకు ముఖ్యంగా గ్రాంటన్ విస్కీకి విపరీతమైన మార్కెట్ ఉంది. ఢిల్లీ, రాజస్థాన్,త్రిపుర, మేఘాలయతోపాటు నార్తర్న్ ఇండియాలో ఐబ్రాండ్ ఉత్పత్తులను క్రమంగా ప్రవేశపెడతాము. వచ్చే రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, పశ్చిమ బెంగాల్, అండమాన్, నికోబార్‌లోనూ మా ఉత్పత్తులు లభిస్తాయి.
అవార్డుతో గర్వంగా లిసా
కాలం చెల్లిన సంప్రదాయాలకు లోబడి ఉండద్దు, మీ వ్యాపారంపై పూర్తి శ్రద్ధ పెట్టండి, మీలో దాగి వున్న శక్తి ఏంటో తెలుసుకోండి, దృఢమైన భావాలతో ధైర్యంగా జీవించండి- అని మహిళా వ్యాపారవేత్తలకు ఆమె సూచిస్తారు. స్పష్టమైన ఆలోచనా విధానం, లక్ష్యాలను ఏర్పరచుకోవడం, తమపై తమకు విశ్వాసం పెంపొందించుకోవడం ద్వారా ప్రతి మహిళ తాను అనుకున్నది సాధించవచ్చని లిసా ఘంటాపథంగా చెప్పారు. ఈ సందర్భంగా ప్రముఖ శాస్తవ్రేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ సూక్తిని ఆమె ప్రస్తావించారు. ఒక గుంపును అనుసరించే మహిళ ఆ గుంపులో చేరుతుంది లేదా దానికి కొంత దూరంలోనైనా ఉంటుంది. అదే తనంత తానుగా వెళ్లే మహిళ ఇంతకుముందు ఎవ్వరూ చూడని కొత్త చోటును తనంత తానుగా వెతుక్కుంటుంది అన్నది ఆ సూక్తి సారాంశం. కొనేళ్లుగా ఈ సూక్తి నా నరనరాన జీర్ణించుకుపోయిందని లీసా ఆనందంగా చెప్పారు.

వచ్చే మూడేళ్లలో రూ.100 కోట్ల మార్కెట్ చేయాలన్నది లక్ష్యం. దేశంలోని 5 అత్యుత్తమ లిక్కర్ కంపెనీలలో ఐ బ్రాండ్స్‌కు స్థానం దక్కేందుకు అహర్నిశలు కృషి చేస్తాం. మరో ముఖ్య విషయం గురించి చెప్పాలి. ఐబ్రాండ్స్ స్థాపనకు, ఎదుగుదలకు ఎంతో శ్రమపడాల్సి వచ్చింది. ఈ విషయంలో నాకు స్ఫూర్తిగా నిలిచి నా వెన్నంటే నా తండ్రి, భర్త స్టీవ్ జాబ్స్‌ను మర్చిపోలేను. మా ఇంట్లో మగ పిల్లలు లేరు. మేమిద్దరం ఆడపిల్లలమే. అందుకని నన్ను ఒక మగ పిల్లవాడిని పెంచినట్లు పెంచారు. అవి ఇంటి పనులు లేదా బయటి పనులు కావచ్చు. వాటి బాధ్యత నాపై ఉండేది. ఆ విధంగా నేను పెరిగాను. నాకున్న శక్తి మా నానే్న. ఐ బ్రాండ్స్ మీటింగ్‌లకు, డిస్ట్రిబ్టూర్లను కలిసేటప్పుడు నాకు తోడుగా, రక్షణగా నా భర్త ప్రతిసారీ వచ్చేవారు. మేము పడ్డ శ్రమకు ఫలితం దక్కింది. కేవలం మూడేళ్లలో రెట్టింపు టర్నోవర్‌కు చేరుకున్నాము. మా కంపెనీ ప్రారంభించిన నాలుగేళ్లకు ప్రిస్టేజియస్ లిక్కర్ అవార్డు ఫర్ ది బెస్ట్ స్టార్టప్ కంపెనీ అవార్డ్స్, స్పిరిట్ 2014 అవార్డు, ది ఇండ్ స్పిరిట్ 2014 ఎక్స్‌లెన్స్ ఇన్ ప్యాకేజింగ్ అవార్డు, ఫ్రాంచైజ్ ఇండియా 2014 వంటి నాలుగు అవార్డులు సొంతం చేసుకున్నాము. మా టీమ్, నేను పడ్డ కష్టానికి, అంకితభావానికి ఫలితం ఈ అవార్డులు. ఐ బ్రాండ్ ఉత్పత్తులు కావాలంటూ డిస్ట్రిబ్యూటర్లు క్యూ కడుతున్నారు. మొదట్లో నన్ను ఎవ్వరూ పట్టించుకునే వారు కాదు. డిస్ట్రిబ్యూటర్లతో మీటింగులు జరిగేటప్పుడు యువకుడైన నా మేనేజరుతో మాట్లాడేవారే తప్ప నాతో మాట్లాడేవారు కాదు. ఆ పద్ధతి క్రమంగా మారింది అని లిసా ఇప్పుడు గర్వంగా చెప్తారు. ఒక మహిళగా మీ జీవితం కష్టమైందా, సుఖమైందా అని అడిగితే.. ఆ కోణంలో నా జీవితాన్ని చూడట్లేదు. 21వ శతాబ్దపు మహిళగా నా అవకాశాలకు హద్దులేదని ఆమె సమాధానం చెప్పారు. రోజంతా కష్టపడ్డా నా కుటుంబంతో ఉదయం పూట గడిపే సమయం చాలా ఆనందాన్ని ఇస్తుందని లిసా అంటారు.