రాజమండ్రి

సహచరీ.. నీకిది న్యాయమా! (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలగ్లాసుతో పడక గదికి నీవొస్తే
నిన్నంటి వచ్చిన మొగలిపూల పరిమళం
నాకింకా గుర్తుంది
ఎక్కడో ఉన్న స్వర్గసోయగాలను
పట్టెమంచం మీద పరచిన నీ జాణతనం
నాకింకా గుర్తుంది
ఆషాడం వెళ్లాక వచ్చినపుడు
నీవు వండిన గుత్తివంకాయ ఘుమఘుమ
నాకింకా గుర్తుంది
ఆఫీసుకు వెళ్తుంటే ఒయ్యారం వొలికిస్తు
మల్లెలు మరవకండని కన్నుగీటిన
నీ చిలిపితనం నాకింకా గుర్తుంది
తలంటుపోస్తూ కావాలని తడిసి
చలివేస్తుందంటూ సందిట్లో వొదిగిన
నెరజాణతనం
నాకింకా గుర్తుంది
అలసటలోను ఆనందంగా
పురిటి మంచంలోని బాబుని చూపించి
నను పరవశింప చేయటం
నాకింకా గుర్తుంది
నీ నా సహచరీ, ఇన్ని తీపిగురుతులు మిగిల్చి
నను ఏకాకినిజేసి దైవం దరిజేరటానికి
ఎందుకు ఆరాటపడ్డావ్
- హైమవతీ సత్య
వేల్పూరు, తణుకు మండలం, ప.గో.జిల్లా
సెల్: 9100735905

వేదన

అండమై వచ్చాను తల్లి గర్భానికి..!
గాలినై పోతాను గగన గర్భానికి..!
సుఖ లోగిలి దరిచేరనే లేదు..!
కష్టాల కౌగిలితో కన్నీరే కరువైనది..!

ఊపిరే మోయలేకున్నది అంతరేంద్రియ

మందిరం...
ఎద చీకటిలో కొట్టిమిట్టాడుతున్నది అంతరంగ

తరంగం
భవ బాధలను భరించలేకున్నది దేహం
పుట్టినిల్లు చేర్చేవా ఓ అఖిలం

నయనాలు అన్యాయాలు చూడలేకున్నాయి
కరములు కయ్యములు చేయలేకున్నాయి
నరములలో రుధిరము కుళ్లినది
అంగకములోని జీవమును చితి చేర్చుము-ఓ
అఖిలం
- జాని తక్కెడశిల, సెల్: 9491977190

చదువులకీ, మోస్తున్న బరువులకీ సంబంధం

తెగాక కలల్ని కూల్చుకుని వయస్సుకి మించిన
భారపు
బరువుల్ని భుజానికెత్తుకుని
యుద్ధయాత్రని
ప్రారంభించి కదుల్తున్నారు..
అవును నిజంగానే పిల్లలు
బళ్లకు ప్రయాణమయ్యారు
బతుకుల్ని దున్నడం తప్పనిసరయింది
బాల్యం అందరిముందూ తగలబడ్తున్నా
రోజూ తల్లిదండ్రులు అనాలోచితంగానే
మళ్లీమళ్లీ బరువుల్ని భుజానికెత్తుతున్నారు
వయసుతోపాటు
బరువు పెరుగుతూ పోతోంది
చూడండి... చూడండి.. జైళ్లు తెరిచారు
సత్యమేదో తెల్సుకునేలోపు
చిన్న జైల్లోంచి పెద్దజైల్లోకి అడుగుపెడ్తారు
బాల్యపు గంటలు నిశ్శబ్ధమై
ప్రవాహగానంలో కల్సిపోతున్నాయి
ప్రేమలు కరువయిన గుండెలు
సాయంత్రానికి అలసి సొలసి
ఇంటికి చేరుతున్నాయి
మమకారంలేని క్యారేజీలు రోజూ
వెక్కిరిస్తూనే ఉన్నాయి
బుద్ధిగా బడికెళ్లాలి
బ్రతుకుల్ని అక్కడే దిద్దుకుని దిద్దుకుని
జీవితాన్ని అరగదీసుకోవాలి
సరిగ్గా చూడండి పిల్లలు జైళ్లకెళ్తున్నారు..
ఎవరికయినా ప్రేమలు కరువయిన
కొన్ని కఠోర సత్యాలు నలిగిపోయిన
జీవన సన్నివేశాలూ కళ్లకి కన్పించాయా
లేదు.. లేదు.. సత్యాన్నీ అసత్యాన్నీ
ధైర్యంతో తూచేశక్తి ఎవరికీ లేదు
ప్రేమల్ని కొలవడానికి గుండెలు కావాలి
బరువుల్ని దించడానికి గుండెలున్న
తల్లిదండ్రులు కావాలి
జీవితం సాక్షిగా
భుజాలమీది బరువులు
కొండలవుతున్నాయి
ఏదీ స్పష్టంగా చెప్పలేంగానీ
చదువు ఎక్కడయినా దొరుకుతుంది
మట్టికీ మనసుకీ సంబంధం గురించి
మనిషికి తెలియజెప్పే ప్రేమ
ఎక్కడ దొరుకుతుందో
ఇనుప చువ్వల్లోంచి
బ్రతుకుని వీక్షిస్తూపోయే
ఆ బాల్యపు కన్నీటి చుక్కల ప్రవాహానికి
ఎప్పుడు తెరపడనుందో చెప్పలేంగానీ
అదిగో ఎప్పటికిమల్లే
మరలా జైళ్లు తెరిచారు
అన్ని బాల్యాలు అక్కడే బందీలు కావాలని
ఎవరో ప్రేమగా ఫత్వా విధించారు..!
- జన్నతుల్ ఫిరదౌజ్ బేగం, సోమశిల.
9505961150