విశాఖపట్నం

వీరాంజనేయుడి విశిష్టత పలికే ‘సుందరకాండము’ (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవజాతి మనుగడకు వాల్మీకి మహర్షి అందించిన అపురూపమైన ఆదికావ్యం రామాయణం. లోకంలో దాదాపు అందరికీ ఈ కావ్యం పరిచయమే. అయితే, రామయణంలో నాయకుడు శ్రీరాముడైతే, అంతటి ప్రాధాన్యం గలవాడు ఆంజనేయుడు! రామాయణంలోని బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండలలో హనుమాన్ సంగతి కనిపించదు. మొదటిగా కిష్కంధకాండలో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి యుద్ధకాండ ముగిసి, శ్రీరాముడు పట్ట్భాషేకం అయ్యే వరకూ రామాయణం కథ హనుమంతుడి చుట్టూ తిరుగుతుంది.
అంజనానందనం వీరం జానకీ శోకనాశకం
కపీశం అక్ష హంతారం వందే లంకాభయంకరమ్
అని వాల్మీకి మహర్షి హనుమాన్‌ను వర్ణించాడు. అంటే, ‘అంజనాదేవి పుత్రుడైన ఆంజనేయుడు సీతమ్మ తల్లి శోకాన్ని తొలగించాడు. వానరులకు నాయకుడు. అక్షకుమారుణ్ణి సంహరించి, లంకను గడగడలాడించాడు’ అని వాల్మీకి హనుమంతుడిని గొప్ప కర్మయోగిగా, కార్యసాధకుడిగా, గొప్ప గుణవంతుడిగా, మహావీరుగా పరిచయం చేశాడు. అంతటి వీరుడిని మరోసారి జ్ఞప్తికి తెచ్చుకుని, విశేష పూజలు చేసి, హనుమాన్‌పై ఉన్న భక్తిని నిరూపించుకునేందుకు అవకాశం కల్పించారు విశాఖపట్నం, విశాలాక్షినగర్‌లో ఉన్న రచయిత చావలి ఆంజనేయమూర్తి. నిత్యం అధ్యాత్మిక ప్రసంగాలు చేస్తున్న మూర్తి, తీరిక సమయాల్లో హనుమత్తత్త్వము, మణిద్వీప వర్ణన, కృష్ణతత్త్వము, లక్ష్మీస్కృతి, కనకమహాలక్ష్మీ స్తోత్రము తదితర గ్రంథాలు రచించారు. ఈ అనుభవంతోనే శ్రీ ప్రభాసాంబ సాహితీ పీఠం సాయంతో ‘సుందరకాండము’ అనే ఏడు రోజుల పారాయణ గ్రంథాన్ని వెలువరించారు. ఈ గ్రంథం ఏడు విభాగాలుగా అంటే, ఏడు రోజుల్లో పారాయణ పూర్తయినట్టు తీర్చిదిద్దారు. పారాయణ విధాన వివరణలో పారాయణ సమాపన శ్లోకాలనూ పేర్కొన్నారు. ఆధునిక కాలం విలువ తెలుసుకుని ప్రాధాన్యమైన విషయాలు ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకుని రాశారు. వ్యావహారిక భాషలో పారాయణ దోషం కాదని ఇందులో రచయిత వివరణ ఇచ్చారు. భక్త్భివం పెంపొందించేలా ముఖచిత్ర కూర్పుతో వెలువరించిన 84 పేజీల ఈ గ్రంథంలో పారాయణ విధానం, హనుమత్పూజావిధానం, హనుమ సముద్ర లంఘనము, లంకా ప్రవేశం-సీతానే్వషనము తదితర విషయాలు చదువురులకు ఆసక్తి కలిగిస్తాయనడంలో సందేహం లేదు.

ప్రతులకు
చావలి ఆంజనేయమూర్తి,
సూర్య ఎన్‌క్లేవ్, రామాలయం ఎదుట,
విశాలాక్షినగర్, విశాఖపట్నం-530 043.
ఫోన్ - 0891 2795930.
సెల్ : 9441170455. వెల: రూ. 60

- జి.కృష్ణమూర్తి 9493802010.