నెల్లూరు

మాతృభాషాభివృద్ధికి ‘వేదిక’ (సాహితీవేదిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాఠశాల స్థాయిలో మాతృభాష పటిష్టంగా

అమలు అయితే ఆ భాష జీవభాషగా మిగిలి

ఉంటుందనడానికి ఎన్నైనా ఉదాహరణలు

చెప్పొచ్చు. మన పాలకుల విధానాలో, లేక ప్రజల

పరభాషా వ్యామోహమో తెలియదు కాని తెలుగు

గడ్డమీద మాతృభాషను రూపుమాపడానికి

రోజుకో నిర్ణయంతో పిడుగులాంటి వార్తలు వినాల్సి

వస్తోంది. గతంలో ప్రతి స్కూలులోనూ సంస్కృతం

కూడా చక్కగా వచ్చే తెలుగుపండితులతో చక్కని

రాగాలాపనతో పద్యాలు, వాటి తాత్పర్యాలు

విడమర్చి చెపుతుంటే ఒళ్లు మరిచి వినేవాళ్లం.

నేడు ఏ స్కూలులోనూ తెలుగు పండితులే లేరు.

ముఖ్యంగా తెలుగు మీడియం విభాగమే లేదు.

అంతా ఆంగ్లమే. తెలుగులో మాట్లాడితే జరిమాన

విధించే రోజులు వస్తున్నాయి.
నాలుగు పాఠాలు వల్లెవేసి బిఇడి పూర్తిచేసుకుని

తెలుగుపండిట్లు జీతాలకోసం వస్తున్నారే తప్ప

చిత్తశుద్ధితో మమేకమై పాఠాలు చెప్పే

పండితులు కాగడా పెట్టి వెదికినా కన్పించడం

లేదు. దీనికి కారణం పాలకుల విధానాలే అని

తెలుగుభాషాభిమానులు గొంతెత్తి ఘోషిస్తున్నా

ప్రభుత్వం చెవికెక్కడం లేదు. ఊరూరా ఉన్న

కొంతమంది తెలుగుభాషాభిమానులు ఒక చోట

చేరి మాతృ భాషా ఉద్దరణకు తమ వంతు

ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా

కావలిలో కొంతమంది యువకులు మహా కవి

విశ్వనాథ సత్యనారాయణ గారి జయంతి రోజున

2014 సెప్టెంబర్ 12న తెలుగు సాహితీ వేదిక

అంటూ ఒక సంస్థను ఏర్పాటుచేశారు. ముఖ్యంగా

పాఠశాల, కళాశాల స్థాయిలో మాతృభాషలో

కవితలు, కథల ద్వారా వారిలో

మాతృభాషాభిమానం పెంపొందింపచేయడం,

నాటికలు, రచయితలను ప్రోత్సహించడమే

లక్ష్యంగా ఈ సంస్థ ముందుకు పోతోంది.

భావితరాలకు తెలుగు సాహిత్యాన్ని పదిలంగా

అందించాలనే సంకల్పంతో ఈ సంస్థ ప్రణాళికలు

రచిస్తోంది.
ప్రముఖ రచయిత సినీ గేయరచయిత

భువనచంద్రగారి ఆశీస్సులతో సాహితీ మూర్తుల

జయంతోత్సవం పేరిట ప్రముఖ కవులు

విశ్వనాథ, జాషువాలను స్మరించుకుంటూ 2014

సెప్టెంబర్‌లో తొలుత ‘అమ్మ కథలు’

పుస్తకావిష్కరణ చేశారు. ఉచితంగా పాఠకులకు

పుస్తకాలు అందజేశారు. రచయిత్రి సమ్మెట

ఉమాదేవిని ‘సాహితీ వారధి’ బిరుదుతో

సత్కరించారు.
కథాకచ్చేరి- పుస్తకావిష్కరణలు
సాహిత్యాభిమానులైన పాఠకులను,

రచయితలను ఒక వేదిక మీదకు తీసుకువచ్చి

వివిధ రచనా ప్రక్రియలపై చర్చల ద్వారా

అభిప్రాయాలుపంచుకోవాలనే లక్ష్యంతో

కథాకచ్చేరి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించారు.

విశాఖపట్నంకు చెందిన ‘మొజాయిక్’ సంస్థ

నిర్వాహకులు,రచయితలు జగద్ధాత్రి, రామతీర్థ

సహకారంతో వేంపల్లి షరీష్ గారి ‘బొమ్మ’కథల

సంపుటి, బత్తుల ప్రసాదరావుగారి ‘గంజిబువ్వ’,

‘వెనె్నలగువ్వ’ పుస్తకాలు, ప్రముఖ సినీ,

సీరియల్ కథా రచయిత్రి పొత్తూరి

విజయలక్ష్మిగారి ‘పూర్వి’కథల సంపుటి ,

ప్రొఫెసర్ ఆదినారాయణగారి ‘తెలుగువారి

ప్రయాణాలు’
, కె వి సత్యనారాయణ రచించిన ‘నెల్లూరుజిల్లా

జానపద కథలు’ కస్తూరి మురళీకృష్ణగారి ఫిక్షన్

కథలు వంటి ఎన్నో పుస్తకాలను ఆవిష్కరించి

పాఠకులకు అందుబాటులోకి తెచ్చారు.
కావలి మండలంలోని పలు పాఠశాలల్లో
విద్యార్థులకు పద్యాలాపన, పద్యరచన
కథల రచన పోటీల నిర్వహించి విజేతలకు

బహుమతులు అందజేశారు. గ్రంథాలయాలకు

పుస్తకాల పంపిణీ చేశారు. గత ఏడాది
‘జమిలి గానం’ పేరిట పాటలు, కవితల ఆలాపన,

కావలి పట్టణంలో సాహితీ సేవలతోపాటు వివిధ

రంగాల్లో లబ్ధప్రతిష్టులకు ఉగాది పురస్కారాలు

అందిస్తూ సంస్థ ముందుకు సాగుతోంది. ఈ

ఏడాది కవితోత్సవం -2017 పేరిట కళాశాల

విద్యార్థులకు కవితల పోటీ నిర్వహించి రెండు

సంపుటాలను పాఠకులకు అందుబాటులోకి

తెచ్చారు.
అలాగే ‘కళాశాలలో కథాపఠనం’ పేరిట కావలి

చుట్టుపక్కల ఇంటర్, డిగ్రీ కళాశాల విద్యార్థులకు

కథలు పట్ల ఆసక్తి పెంచేందుకు స్వీయ

రచనలను ప్రోత్సహించేందుకు వారితో కథలు

చదివించి సమీక్షలు రాయించి ప్రతిభ

చూపినవారికి ప్రోత్సాహకాలు అందిస్తోంది ఈ

సంస్థ ప్రతి నెలా ఒక కార్యక్రమం ద్వారా ప్రముఖ

రచయిత వేదగిరి రాంబాబుతో ‘తెలుగు

కథానికాముచ్చట్లు’ చర్చా కార్యక్రమం

నిర్వహించి మాతృభాష పట్ల తమకున్న

మమకారాన్ని చాటుకున్నారు. ఇంతటి

ఉదాత్తమైన సాహితీ సేవ చేస్తున్న తెలుగు

సాహితీ వేదికకు బివి లక్ష్మీనారాయణ

అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. జి

మారుతీరామ్, కాళిదాసు

విజయచంద్రి,చాకలికొండ శారద, వి

నారాయణభట్ మిగతా బాధ్యతలు

నిర్వహిస్తుండగా వీరికి పులి రజని చక్రపాణి,

నందనవనం శ్రీహరిరావు,యాసం వెంకట

కృష్ణమూర్తి,డి.రవి ప్రకాష్, డి.వి. నాగరాజశర్మ

వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.

- గౌతమి 9347109377