దక్షిన తెలంగాణ

స్ర్తీవాద రచనల అవసరం ఇప్పటికీ ఉంది (అంతరంగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్ననాటి నుంచే కబీరు కవిత్వమంటే

అమితంగా ఇష్టపడతాను అని సవినయంగా

ప్రకటించుకునే సీనియర్ కవయిత్రి, ప్రముఖ

పత్రికా రచయిత్రి, పరిశోధకురాలు,

అనువాదకురాలు.. డాక్టర్ జ్యోతిరాణి స్ర్తిలను

ద్వితీయశ్రేణి పౌరురాలిగా చూడటం

ఆగేంతవరకు.. పురుషాధిక్యతా ధోరణి

సమసిపోయే వరకు స్ర్తివాద రచనలు

రావలసిందేనని అంటారు. కొత్త కవులు,

రచయితలు అధ్యయనంపై దృష్టి సారించాలని

కోరే ఆమె మూడు కవితా సంపుటాలను

వెలువరించారు. రెండు అనువాద నవలలను,

డెబ్బదికి పైగా హిందీ నుండి తెలుగులోకి

అధ్యాత్మిక గ్రంథాలను అనువదించారు. ఈనాడు,

చతుర, విపుల పత్రికల్లో రెండు దశాబ్దాలకుపైగా

సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. వేమన, కబీరు

కవిత్వం.. తులనాత్మక పరిశీలన అంశంపై

పరిశోధన చేసి పిహెచ్‌డి పట్టా పొందిన ఆమెతో

‘మెరుపు’ ముచ్చటించింది. ముఖా ముఖీ

వివరాలు ఆమె మాటల్లోనే..

ఆ మీరు ఎన్నో ఏట రచనా వ్యాసంగాన్ని

ప్రారంభించారు?
పదమూడో ఏట సరదాగా ఓ సినిమా పాటకు

పేరడీ రాసినా. బిఎస్సీ విద్యార్థినిగా ఉన్నప్పుడు

కవితలు రాయడం ప్రారంభించాను.

ఆ మీరు రచనల పట్ల ఆసక్తి చూపడానికి ప్రేరణ

ఇచ్చింది ఎవరు?
మా తాతయ్య.. ఐదేళ్లలోపు పిల్లలకు భగవద్గీత

శ్లోక పఠన పోటీ నిర్వహిస్తున్నారని విని.. నాకు

ముందుగా ఐదు శ్లోకాలు నేర్పించి.. పోటీకి

పంపారు. ఆ తర్వాత మిగతావీ ముకుందమాల

నలభై శ్లోకాలు, కంఠోపాఠం చేయించారు.

తత్వాలు, కీర్తనలు, దాశరథి శతకంలోనివీ, పోతన

పద్యాలు నేర్పించారు.

ఆ మీ దృష్టిలో వచన కవిత్వం అంటే ఏమిటి?
ఛందస్సునే చట్రంలో ఒదిగి కూర్చునే బదులుగా..

పదాలను స్వేచ్ఛగా రెక్కలు విప్పుకోనిచ్చి..

భావప్రకటనకు మార్గం సుగమం చేసిన ప్రక్రియ!

ఆ మీ ముద్రిత గ్రంథాలు?
‘మధుజ్వాల’, ‘్భక్తిమీరా’, ‘మంచుపందిరి’,

కవితా సంపుటాలు.. అనువాద నవలలు రెండు..

ఒకటి.. కె.ఎల్.గాంధీ నవలకు ‘సమాంతర రేఖలు’,

అనువాద నవల-1997 మే ‘చతుర’లో

ప్రచురింపబడింది. రెండోది..‘శీలభద్ర-గోధూళి’

నవలకు ‘సంధ్యవేళలో’ అనువాదం.. 2002లో

ఎన్.బి.టి.వారిచే ప్రచురితం.. ఇవేకాక.. డెబ్బయి

ఆధ్యాత్మిక గ్రంథాలను హిందీ నుండి తెలుగులోకి

అనువదించాను.

ఆ మీకు నచ్చిన కవి, రచయిత?
చాలామంది ఉన్నారు. మహాకవి దాశరథి, డాక్టర్

సి.నారాయణ రెడ్డి, కరుణశ్రీ, శ్రీశ్రీ, ఆచార్య

తిరుమల, డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్, డాక్టర్

తిరునగరి, కమలేకర్ డాగోజీ రావు తదితరులు.
ఆ మీకు నచ్చిన గ్రంథం?
అనేక గ్రంథాలు నాకు నచ్చినవి ఉన్నాయి.

శూద్రకుని ముచ్ఛకటికమ్, దాశరథి గారి

గ్రంథాలతో పాటు ఆరుద్ర కూనలమ్మ పదాలు,

శ్రీశ్రీ మహాప్రస్థానం, మల్లాది వసుంధర గారి

రామప్పగుడి, శరత్ సాహిత్యం, రవీంద్రుని

గీతాంజలి, శ్రీనివాసపురం సోదరులు రాసిన

విజయనగర సామ్రాజ్యేతిహాస చారిత్రక నవలలు

దాదాపు ఇరవై వరకు..

ఆ మీ పరిశోధన గ్రంథం, వేమన, కబీరుల

కవిత్వం తులనాత్మక పరిశీలన గురించి

తెలుపుతారా?
జీవనకాలాలు, ప్రాంతాలు, భాషలు వేరైనా..

భారతీయ సాహిత్యాత్మ ఒక్కటేనని చెప్పడానికి

వేమన. కబీరుల కవిత్వమే ఉదాహరణ.. సత్య

సంధతను ఉపదేశించి.. ప్రాపంచిక నశ్వరత్యాన్ని

వివరించి, మానవాళిని ఆధ్యాత్మికతవైపు

నడిపించడమే గాక.. అంధ విశ్వాసాలను

మోసాలను కుహనా భేషజాలను,

మూఢాచారాలను నిర్భయంగా వ్యతిరేకించిన

మహోన్నతులు వేమన కబీరులు..!

ఆ మీరు కబీరు కవిత్వాన్ని బాగా ఇష్టపడటానికి

కారణం?
మా తాతయ్య అపర వైష్ణవుడే అయినా.. తన

మిత్రుడైన దయాల్ ఆనంద్ రావు మహారాజ్

ప్రేరణతో.. రాధాస్వామి మత దీక్ష తీసుకున్నారు.

ఆ పరంపరలోని.. సద్గురువుల సత్సంగాలను

మా అమ్మమ్మ, అమ్మ, ఇతర కుటుంబసభ్యుల్ని

తీసుకువెళ్లేవారు.. నేను ఐదునెలల పసిపాపగా

ఉన్నప్పుడే.. నన్నూ తీసుకెళ్లేవారట! క్రమంగా

అలా పెద్దయ్యాక కూడా.. అక్కడి సత్సంగ్

గురువులు తమ బోధనల్లో.. కబీరు సాబ్ చెప్పిన

దోహాలు చెప్పేవారు.. అవి నాకెంతో నచ్చేవి! అలా

సద్గురువులపైనా కబీరు కవిత్వంపైనా ఆసక్తి

పెరిగింది.

ఆ ఈనాడు, విపుల, చతుర పత్రికలతో మీకున్న

అనుబంధం?
ఇరవై ఒక్క సంవత్సరాల అనుబంధం.. సీనియర్

సబ్ ఎడిటర్‌గా విపుల, చతురల్లో.. ఈనాడు

ఆదివారం అనుబంధంలో అనేక రచనలు చేశాను.

పాఠకులకు చేరువైనాను.

ఆ మారుతున్న సమాజంలో ఇంకా స్ర్తివాద

రచనలు
అవసరమని భావిస్తున్నారా?
స్ర్తిలను ద్వితీయశ్రేణి పౌరురాలిగా చూడటం

ఆగేంతవరకు, పురుషాధిక్యతా ధోరణి

సమసిపోయేంతవరకు అది నిరంతర

ప్రక్రియకావాలి.

ఆ కొత్త కవులు, రచయితలకు మీరిచ్చే

సలహాలు, సూచనలు?
నిరంతర అధ్యయనం కొనసాగించాలి. సాధించింది

కొంత.. సాధించాల్సింది కొండంత వుందనే

ఆలోచనతో ముందుకు సాగాలి. మంచి

సాహిత్యాన్ని చదివి. మనో మాలిన్యాలను

తొలగించుకోవాలి. ఆచరించని జ్ఞానం వృథా అని

గ్రహించాలి. భాషపై పట్టు, ప్రావీణ్యతను

సాధించాలి.

డాక్టర్ జ్యోతిరాణి
ఇం.నం.11-6-254
పోచమ్మ బాగ్
సరూర్‌నగర్
హైదరాబాద్-35
సెల్.నం.9951035235

- దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544