దక్షిన తెలంగాణ

పల్లవి (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సుధీర్ లే, లేరా! ఏమిట్రా ఈ మొద్దు నిద్ర.. లే..’
పెళ్లి చూపులకు వెళ్లాలని చెప్పాను కదా!
‘అమ్మా నేను రాను. మీరు అక్కడికి

తీసుకువెళ్తారా? తీరా అక్కడికి వెళ్లాక, అక్కడ

చూస్తే ఆ అమ్మాయిలు మోడ్రన్

అమ్మాయిలుంటారు. మీకు చెప్పాను కదా, నాకు

సంప్రదాయబద్ధమైన తెలుగుదనం ఉట్టిపడేలా

ఉండే అమ్మాయి కావాలని’
అలాంటి అమ్మాయిలు ఈ రోజుల్లో ఎక్కడ

దొరుకుతారురా అంటుండగానే,
‘సుధీర్ సుధీర్!’ అంటూ శ్రీ్ధర్ వస్తాడు.
‘ఆంటీ బాగున్నారా’
‘ఏం బాగుండటమో ఏమో’
‘ఏమైంది ఆంటీ అలా అంటారు’
‘చూడు శ్రీ్ధర్ వీడి పెండ్లి చెయ్యకుండానే నేను

పోతానేమో’
‘అదేంటి ఆంటీ’
‘లేకపోతే, ఏంటి ఈ రోజుల్లో సంప్రదాయాలు,

తెలుగుదనం కలబోసుకున్న అమ్మాయిలు

ఎక్కడుంటారు చెప్పు?
అలాంటి పిల్ల అయితే పెళ్లి చేసుకుంటాను

అంటాడు. ఆడపిల్ల తల్లిదండ్రులకు కూడా ఇంత

బాధ లేదనుకుంట. ఆడపిల్లల పెళ్లి చెయ్యడానికి

ఈ రోజుల్లో కాని వీడి పెళ్లి చెయ్యాలి అంటేనే నా

తలప్రాణం తోకకి వస్తుంది. అసలు నా వల్ల

అవుతుందా, సంప్రదాయాలు కలబోసుకున్న

పిల్ల ఈ యుగాంతం వరకైనా దొరుకుతుందా

అనిపిస్తుంది శ్రీ్ధర్.’
‘సరే ఆంటీ మీరు అనవసరంగా కంగారుపడకండి.

నేను వాడికి నచ్చజెబుతాను. మీరు మాకు కాఫీ

తీసుకురండి.’
‘అమ్మాయి ఎలా ఉండాలిరా సుధీర్..’
చేతినిండా గాజులు, కాలికి మువ్వలు, చారెడి

కళ్లకు కాటుక, నుదుట దోసగింజలాంటి బొట్టు,

అదీ కాకుండా రెండు కనుబొమ్మల మధ్య

కుంకుమబొట్టు పెట్టుకుని నా ముందు అలా

కదలాడుతుండాలి. ఇంకో విషయం..

తాచుపాములాంటి జడ, ఆ జడలో మల్లెలు, నా

మనసంతా పరిమళాలతో నిండిపోవాలి. ఆ

గాజుల సవ్వడి నా హృదయాంతరాగాలను

స్పృశించాలి.
ఆ మువ్వల చప్పుడు నన్ను మురిపించాలి.

ఇంకా ఇవేకాకుండా సంప్రదాయమైన

‘ఎం.ఎ.తెలుగు’ చదివిన అమ్మాయి అయి

ఉండాలి. ఇవి నాకు కాబోయే భార్యలో

ఉండాల్సిన లక్షణాలు. ఈ విధంగా ఉంటేనే పెళ్లి

చేసుకుంటాను. అమ్మనేమో అర్థం చేసుకోదు.

ఎక్కడ దొరుకుతుందిరా అంటుంది.’
‘శ్రీ్ధర్ నీకు ఒక్క విషయం చెబుతాను..

పురాణానికి సంబంధించినది.
సత్యభామ సరసం ఆడే సమయంలో శ్రీకృష్ణుని

తన జడతోనే కొట్టిందట. అంత పొడుగాటి జడనట

సత్యభామది.
సుధీర్ నాకు తెలిసిన విషయం చెబుతాను విను.

వెనకటికి నీలాంటి వాడొకడు పొడుగాటి జడ ఉంది

గదా అని పెళ్లి చేసుకు

న్నాడట.
ఒక రోజు సరసం కోసం జడబట్టి లాగాడంట, ఆ

జడకాస్త చేతి
లోకి వచ్చిందంట.
నీకు అలాంటిదే జరుగుతుందో ఏమో ఆలోచించు.
‘వాడికి అసలు సిసలు జడకు తేడా

తెలియదనుకుంట. అసలు జడ నడుస్తుంటే

తాచుపాము లాగా నాట్యమాడినట్లు ఉంటుంది.

విరబోసుకుంటే నల్లని మేఘాలు

కదులుతున్నట్టు ఉంటుంది.
శ్రీ్ధర్ కాఫీ తీసుకో, ఇది వీడి వరస.. ఏం

చెయ్యాలి చెప్పు.’
‘ఆంటీ మీరు ఆందోళన పడకండి. మన

విశ్వవిద్యాలయంలో ఎం.ఎ తెలుగు,

సంప్రదాయమైన కోర్సు నిర్వహిస్తున్నారు.

అక్కడ నా స్నేహితుడు సారథి ఉపకులపతిగా

పనిచేస్తున్నాడు. అతనికి ఈ విషయం చెప్పి

ఇలాంటి లక్షణాలు గల అమ్మాయి ఉందేమో అని

అడుగుతా. ఉంటే గనక మనకు వెంటనే

తెలియజేయమని చెబుతా.’
శ్రీ్ధర్ తన స్నేహితుడైన సారథికి ఫోన్ చేసి

అన్ని విషయాలు చెబుతాడు. అది విని సారధి,

శ్రీ్ధర్ అన్ని వివరాలతో కూడిన క్లుప్త

సమాచారం గంటలో అందిస్తాను అని ఫోన్

పెట్టేస్తాడు.
ఒక గంట తర్వాత శ్రీ్ధర్‌కు సారథి ఫోన్ చేసి

ఎం.ఏ తెలుగు ద్వితీయ సంవత్సరంలో మీకు

కావాల్సిన లక్షణాలు ఉన్న అమ్మాయి ఉంది. ఆ

అమ్మాయికి ఎవరు లేరు అనాథ. అమ్మాయి

పేరు ‘పల్లవి’, మీకు నచ్చితే మా

విశ్వవిద్యాలయంలో పెళ్లి మేమందరము

దగ్గరుండి చేస్తాము’ అంటాడు.
సుధీర్ వాళ్ల అమ్మకు అన్ని విషయాలు

చెబుతాడు శ్రీ్ధర్, అమ్మాయి పేరు పల్లవి.
అప్పుడే టి.విలో పాట వస్తుంటుంది.
‘పల్లవించవా నా గొంతులో పల్లవి కావా

నాపాటలో ప్రణయ సుధారాణి, నా బ్రతుకు నీది

కాదా!’
ఆ పాట వింటూ పరవశించి పోతుంటాడు సుధీర్.

మంచిరోజు చూసుకుని విశ్వవిద్యాలయానికి

బయల్దేరుతారు.
ఆ అమ్మాయి నచ్చుతుంది సుధీర్‌కు.
మంచిరోజు చూసి ముహూర్తం

పెట్టుకోవాలనుకుంటుంది సుధీర్ వాళ్ల అమ్మ.
ఆంటీ మంచిరోజు దగ్గర్లోనే ఉంది. వసంత పంచమి

అంతకంటే మంచి ముహూర్తం ఉండదుకదా!
అందరికి ఆమోదం అయ్యింది. ఆ ముహూర్తం

విశ్వవిద్యాలయంలోనే. పల్లవికి అన్నలుగా

అక్కడున్న అధ్యాపకులలో మూర్తిగారు,

వేదమంత్రాలు చదివి పెళ్లి కార్యక్రమం పూర్తి

చేశారు.
కాళిదాసుగారు కట్నకానుకలు కానుకలుగా

అందించాడు.
అక్కగా లలితగారు ఆడపడుచు లాంఛనాలు

అందించారు.
వాణీగారు విందు భోజనాల కార్యక్రమం యొక్క

బాధ్యతలు స్వీకరించారు. సారథి గారు పెండ్లి

బాధ్యతను పూర్తిగావించారు. రిజిస్ట్రార్ ఈశ్వర్

కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. పసందైన

వంటకాలను తిని అక్కడున్న విద్యార్థులు,

అతిథులు, దంపతులను ఆశీర్వదించి వెళ్లారు.

పల్లవిని పరవశంతో చూసి మురిసిపోసాగాడు

సుధీర్!

- డాక్టర్ గంధం విజయలక్ష్మి నిజామాబాద్, సెల్.నం.9948181458