ఉత్తర తెలంగాణ

దర్వాజా (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాస్తవాల కోట తలుపులు
మూతపడగానే
స్వప్న సౌధల దర్వాజా
ముంగిట వాలిపోతాను
నాకే తెలియని నా ఆలోచనలు
మెదడు మూలలు పెకిలించుకుని
బయటపడటం మొదలెడతాయ్
ఏవేవో రూపాలు సంతరించుకుంటూ
నాముందవి తిరుగాడుతుంటే
సంభ్రమంగా చూస్తూ ఉంటాను
ఆ పాత్రలు కొన్ని చిరపరిచితాలు
మరికొన్ని అపరిచితులు
ఎప్పుడు రూపుదిద్దుకున్నాయో
రెప్పల వాకిలి మూయగనే
కళ్లముందు సాక్షాత్కరిస్తాయి
ఎప్పుడు నా మనసులోకి దూరి
తిష్ట వేసుక్కూచున్నాయో
ఏవేవో పొంతన లేని కలలు
నన్ను మురిపిస్తాయి
మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తాయ్
వాటికోసం ఎదురు చూస్తాను
తలచుకుని ఆనందవిహారం చేస్తాను
ఇంకొన్ని భయపెడతాయి
ముచ్చెమటలు పట్టిస్తాయ్
మరచిపోలేని జ్ఞాపకమై
వెంటాడి వేధిస్తాయ్
భయపడుతూనే తొంగిచూస్తాను
సహాయం కోసం దిక్కులు చూస్తాను
అదొక ఎన్నటికీ నిజం కాని నిజం
నాతో పుట్టి నాలోనే దాక్కుని
నాక్కనపడక నాతోనే మమేకమైన
నా స్వప్నలోకం కడదాకా నా నీడవుతుంది
నిరూపించలేని నిజమై నిలబడుతుంది
అందమైన అబద్ధమై ఆడిస్తుంది
స్వాప్నిక జగత్తు ఎప్పుడూ అబ్బురమే
అందీ అందని దొరికీ దొరకని వరమే!
- జి.వి.ఎస్.అనంతలక్ష్మి
హైదరాబాద్
సెల్.నం.9866954194

కొత్త వసంతం కోసం..

స్వాభిమానాన్ని ఉట్టిమీది కెక్కించి
సవాళ్ల విన్యాసాల నెదిరించలేక
క్షోభానలంలో కొట్టుమిట్టాడుతుంది సహనం
నిర్వచనాన్ని కందనన్న అసహనం
తమాషాల చేతుల్లో
తపంచాగా అవతరించింది
సంఘటనా చాతుర్యాన్ని
తలపుల తలుపుల్లో బంధించి
కోదండానికి ఊగుతున్న కాలం విలువను
కొరడా కయ్యాలను భరించుమంటోంది
సత్యానే్వషణను మలిచి
పంతం గూటిలో పదిలం చేసి
ఇజాలతో మజా చేసుకొమ్మంటుంది
సత్యం వధ-్ధర్మంచెరను పుక్కిలించి ఉమ్మేసి
భావదాస్యానికి
జోహార్లు అలంకరిస్తోంది
దేశం ఏమైతేనేమి
తన వేషం నిత్యనూతనమంటోంది
చరిత్ర వక్రీకరణకు
స్వార్థ చైతన్యం ఊపిరిలూదుతుంది
దగాకోరులకు దిష్టిదీసి
మంగళహారతులు పడుతోంది
దేశభక్తి నూతన వ్యాఖ్యానం పులిమి
మతం ఊబిలో పాతరేస్తోంది
పల్లకిలో ఊరేగాలనే పట్టుదల జీర్ణించుకుని
పగటి కలల అలలపై అలరారుతుంది
ఊహల ఉయ్యాలలో ఊరేగుతూ
సింహాలతో ఛాలెంజి చేస్తోంది
సహనం మాత్రం కొత్త వసంతం కోసం
ఎదురుచూపులు పరుస్తోంది
- ఐతా చంద్రయ్య
సిద్ధిపేట
సెల్.నం.9391205299

అమ్మా-నాన్న

అనుబంధానికి
ప్రతిరూపం అమ్మ!
బాధ్యత అనే బంధంతో
పెనవేసుకుంటాడు నాన్న!
పసిబుగ్గల వయసులో..
జ్ఞానం తెలియజెప్పేది అమ్మ!
చిటికెన వేలు పట్టి
నడిపించేది నాన్న!
మమతానురాగాలు పంచి
పెంచేది అమ్మ!
నడకనూ
నడతనూ నేర్పి
ప్రయోజకుల్ని జేసేది నాన్న!
అమ్మా నాన్నలు..
ఇద్దరు రెండు కళ్లలాంటివారు
వెలుగుతో బాటు
జీవిత జిలుగులు ప్రసాదించేవారు!
- బెజ్జంకి జ్యోతి
మారుతీనగర్, కరీంనగర్
సెల్.నం.9949457100

కవితా గానం చేస్తా!

అలలు విరిగిపోయి
వలలు తెగిపోయి
కలలు తేలిపోయి
కలవరంతోని
కన్నీరు తోసి
పుడమి తల్లిని అభిషేకిస్తూ
నిరీక్షిస్తున్నాను
కొత్త దారికోసం
కోటి ఆశలతో
వసంత రుతువొస్తుంది
కోయిల ననుపిలుస్తోంది
కవిగా నేనే చేస్తాలే
కవిత గానం
కవిత నా ప్రియతమ!
- కూర్మాచలం వెంకటేశ్వర్లు
కరీంనగర్
సెల్.నం.7702261031

ఏమై పాయెనో!

ఏమై పాయెనో ఊర్లు
ఊరెన్క చెరువులు
ఎక్కడ పోయినయి బడులు
బడెన్కపాత గుడులు
ఏమాయెనో మనుషులు
ఆ మందారాల మట్టి గోడలు
ఏమైపాయెనో చెత్త
చెతైన్క చేదెబాయి
ఏమయెనో బోరింగు
ఆ బోరెన్క బొందలు
ఏమైపాయెనో శేన్లు
చేన్ల ఆడె చిలుకలు
తుమ్మలు తుమ్మల్ల తిరిగె
తూనీగలు బర్లు ఉండె
బంజరదొడ్లు! ఏమైపాయెనో!
- గుడికందుల అరుణ్
ఇందుర్తి
సెల్.నం.7093791674

తొలి పఠన

పలుకు పలుకున దాగిన
ముత్యాల జడిలోన
అక్షరమాలలు నేర్చుటకై చేయాలి పఠన
అది లేనిదే చేరలేదు జీవితపు ఉన్నతి శిఖరాన
అందుకే గుండె రాయి చేసుకొనే చేర్చాను బడిన
పసిబుగ్గల పాలనవ్వుల నడుమ
తడబడు అడుగుల నడతల జడిన
అందని చందమామకై
అలకబూనిన నా చిన్నితండ్రి
అందిన ఈ అమ్మ అపురూప ప్రేమని చూడరా!
దూరమవుతున్న మన ప్రేమబంధాలు మాయవురా
నిను వీడిన క్షణాన నా హృదయభారం కానరా
తెల్లని మనసుని రంగరించి పోసాడు నీలో బ్రహ్మ
అందుకే నీవే నాకు వరమై నిలిచింది ఈ జన్మ!
నీ కంట తడిచూస్తే తాళలేను నాయన
అలకవీడి చేరరా అమ్మ ఒడిన!
- సంకెపల్లి కీర్తనా రెడ్డి
మహబూబాబాద్
సెల్.నం.9912134309

తేడా..

సమయవస్కులు సహవాసులు
సహోద్యోగులైన ఇరువురు
బజారు దారిన వెళ్తుండగా
ఎదురుపడిన అపరిచితులు
ఒకరిని బాపూ అని
మరొకరిని భయ్యా అని సంబోధిస్తుంటే
ఆశ్చర్యపడడం ఒకరి వంతయితే
ఆనందపడడం మరొకరి వంతయింది
ఒకరిలో అతిసామాన్యత ప్రస్ఫుటవౌతుంటే
మరొకరిలో ఆడంబరత ప్రతిబింబిస్తున్నది
నెరిసిన తల ఒకరిదైతే
నల్లరంగు పులుముకున్న జుట్టు మరొకరిది!
- రాకుమార
గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా
సెల్.నం.9550184758