సాహితి

తల్లిగారి ఊరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేరు గుర్తొచ్చినప్పుడల్లా
ఈ చిన్ని గుండె
పెద్ద గుండై ఉప్పొంగుతుంది
ఊరు విడిచాననో, నగరీకరణలో తడిచాననో
ముఖం విప్పార్చి, ముఖస్తుతికై
అక్షరసత్యమని వక్కాణించడంలేదు

ఇవ్వాళ్ళ అక్షరం రాసినానంటే
అక్కడ నేలమీద కూచుని
పగిలిన పలకమీద
పితుకంత బలపంతో దిద్దుకున్నదే
తొడపాశం పెట్టిన పున్నయ్య సారే
పద్యామృతం తాపిచ్చిండు
మాతృదేవోభవ, పితృదేవోభవ,
ఆచార్యదేవోభవ సంస్కృతార్థాలు తెలియకున్నా
గురువు మాట లక్ష్మణరేఖనే అయ్యేది

అట్ఠపుట్టలు ఊడినప్పుడల్లా
చారి సోపతి తోడయ్యేది
ఇసుక కుప్పలో కుస్తీ పోటీకై
బాలభీములమయ్యేవాళ్ళం
ఇప్పటి బతుకుకా కుస్తీ మార్గదర్శే మరి

నాన్న లేడని, పక్కింటి పాలి అన్నయ్య
బడిలో చేర్పించడం
ఏ విలువకు పరాకాష్ఠ..!
మనిషిని ప్రేమించడం ఆయన ద్వారా ఆవహించుకున్నా

అమ్మకు నేనొక్కడినే
నా హఠాన్ని దాచిన గరళకంఠురాలు
ఓపిక అనే దీపిక
ఆమె వెలిగించిందే నాలో

వాడకట్టు జనం
‘చిన్న పంతులు, చిన్న పంతులు’
అని పిలుస్తుంటే
జ్ఞానపీఠం మీద కూర్చుండబెట్టినట్లే ఉండేది
వాడకట్లన్నీ తిరుగుబోతై తిరుగుతుంటే
పండుగలన్నీ చుట్టూ మూగేవి
నామం దిద్దుకున్నానో మలిపేశానో
తీర్థం పుచ్చుకున్నానో జార విడిచానో
గాయత్రీ పఠించానో మరచిపోయానో
సంప్రదాయంకన్నా అలాయి బలాయ
నా బడాయిగ ఉండేది

పనాదిల నడిచేటప్పుడు
కాళ్లకు ముళ్లు గుచ్చినా
పాము బుసలు భయం పుట్టించినా
మడికట్టు నాగలి దున్నుతూ
ఎద్దు కాలికి కర్రు తగిలించినా
తేనెటీగలు ముసిరి
ఒరాలమీద పరుగు తీసినా
దురస్తుకై ఇల్లు విప్పి
అర్ధరాత్రి జడివానకు
పులుగు పులుగోలే గోడవారగా
అమ్మా నేను గడిపినా
బోధిసత్వుని జ్ఞానోదయం లాంటిదేదో
బతుకుకు సంబంధించి
వినిపిస్తూ వుండేది అంతర్లీనంగా-

స్వేచ్ఛకు రెక్కలు తొడిగిన ఊరు
ఇచ్ఛకు ప్రయోజనం తెలిసిన ఊరు
కని పెంచిన ఊరు
కడుపుల పెట్టుకున్న ఊరు
కీర్తిశిఖరాలకు ఎగబాకించిన ఊరు
అంతకన్నా ముఖ్యంగా
నన్ను కవిని చేసిన ఊరు

నేలపై పారాడిన
మట్టిలో పొర్లాడిన
నా ఊరికి నేనేమివ్వగలను?
ఒక అక్షరం తప్ప
ఆ అక్షరంతో ఒక మంచి సమాజం
నిర్మించి ఇవ్వడం తప్ప..!

- దాసరాజు రామారావు