Others

అక్బర్ సలీం అనార్కలి (నాకు నచ్చిన చిత్రం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామకృష్ణ స్టూడియోస్ పతాకంపై ఎన్టీ రామారావు నటించి దర్శకత్వం వహించిన చిత్రం అక్చర్ సలీం అనార్కలి. ఈ చిత్రానికి మూలం హిందీలో కె.అసిస్ నిర్మించిన ‘మొఘల్ -ఎ -ఆజం’. అక్బర్‌గా ఎన్టీఆర్, జోధాబాయిగా జమున, సలీంగా బాలకృష్ణ, అనార్కలిగా దీప, తాన్‌సేన్‌గా గుమ్మడి నటించారు. ఈ చిత్రానికి మాటలు, పాటలు సి నారాయణరెడ్డి సమకూర్చారు. సంగీతం బొంబాయికి చెందిన సి రామచంద్ర అందించారు.
కథ అందరూ విన్నదే అయినా ఈ చిత్రంలోని పాటవన్నీ వినసొంపుగా ఉంటాయి. మొదటి పాట రఫీ పాడినది ‘తారలెంతగా వేచెనో’, తర్వాత పి.సుశీల పాడిన గోకులాష్టమి రోజు ‘మదన మోహనుడే మదిలో’, రఫీ- సుశీల పాడిన ‘తానే మేలిముసుగు తీసి ఒక జవ్వని’, రఫీ- సుశీల పాడిన ‘సిపాయి ఓ సిపాయి’, ‘తలచుకున్నా గుబులాయే’, అక్బర్ ఎదుట పి.సుశీల పాడిన ‘ప్రేమిస్తే తప్పంటారా’ (హిందీలో ప్యార్‌కియా డర్‌నా), రఫీ- సుశీల పాడిన సూపర్‌హిట్ పాట ‘రేయి ఆగిపోనీ రేపు ఆగిపోనీ’, చివరగా తాన్‌సేన్ పాడిన పాట ‘ఎందులకెందులకీ ధర్మం’ ఎస్పీ బాలు పాడినది... అన్నీ అద్భుతాలే. ఈ పాటలన్నీ బొంబాయిలో రికార్డు చేయబడ్డాయ. ఇన్ని హంగులున్నా ఈ చిత్రం ఆడలేదు, ఎందుకో? కానీ, సినిమా చూస్తున్నంత సేపూ హాయగా అనిపిస్తుంది. చూడదగ్గ చిత్రం, ఇష్టమైన చిత్రం.

-విఠల్‌రావ్ జుజారె, హైదరాబాద్