Others

నీ సుఖమే నే కోరుతున్నా.. (నాకు నచ్చిన పాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మురళీకృష్ణ’ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు పాడిన ‘ఎక్కడున్నా.. నీ సుఖమే నే కోరుతున్నా’ అంటూ విషాదాన్ని ఒలికించి మనస్సులను కలచివేసిన పాట. సాహిత్య సంగీతాల అద్భుతమైన మేళవింపు ఈ పాటలో పడుగుపేకల్లా అల్లుకున్నాయి. కృష్ణ మురళిని ప్రేమంచాడు. మురళి కూడా కృష్ణను గాఢంగానే ప్రేమించింది. కాని ఒక స్నేహితురాలి కోసం ప్రేమలేఖ వ్రాసి అనుమాన పిశాచానికి బలి అవుతుంది. మురళి మరో వ్యక్తిని ప్రేమిస్తున్నదని, ఆమె కోసం తన ప్రేమను త్యాగం చేసి కృష్ణ దూరంగావెళ్లిపోతాడు. ఒక గొప్ప డాక్టరుగా ప్రజలకు సేవ చేయటానికి ఈ విరహం ఒక చక్కని అవకాశం అయనా, కృష్ణ జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుంది. ప్రేమించగల హృదయమే త్యాగ జీవితానికి కావలసిన బలిదానం అన్న సత్యాన్ని మురళీకృష్ణ చిత్రం ద్వారా చూపించి ప్రతిభావంతులైన పి పుల్లయ్య ప్రేక్షకుల హృదయాలలో ఉత్తమ దర్శకుడిగా చెరగని ముద్ర వేసుకున్నారు.
నీ సుఖం కోరుకున్నాను కాబట్టే నిన్ను విడిచిపెట్టి పోతున్నాను. కనుపాపలా, చంటిపాపలా నిన్ను చూచుకున్నాను, గుండె గుడిలో ఒక దేవతగా ప్రతిష్ఠించుకున్నాను. అయినా నువ్వు వుండలేనని వెళ్లిపోయావు అంటూ వాపోవటం ఎవరికైనా కన్నీళ్లు తెప్పించగలదు.
ప్రేమకు మరో పేరు త్యాగం అంటారు. ఈ నిజాన్ని కవి తనదైన బాణీలో పామరులు మెచ్చగల కోమల భాషలో చెప్పటం అతడి ప్రతిభకు పతాకం. వలపు తెలిసిన నాకు మరపు కూడా తెలుసు. నా ప్రేమ నిజమైతే దానికి రుజువు మన్నింపు అవుతుందిగాని సాధింపు కాదు. ఇదీ నిజమే! ఈ కాలంలో ప్రేమ ప్రేమ అంటూ వెంటబడతారు. అది కేవలం కామాంధకారం అని వాళ్లకు తెలియదు. తిరస్కరించగానే ఆ ప్రేయసి ఒక రాక్షసిగా మారిపోతుంది. ప్రేమికుడు అందుకు తగినవిధంగా రాక్షసుడై పోతాడు. ఒంటరిగా పట్టుకుని ఆమె మొహాన యాసిడ్ పోస్తాడు. లేకపోతే కత్తితో గాట్లు వేస్తాడు. ఇలాంటి అమానుషత్వం పెచ్చుమీరుతున్న ఈ ఆధునిక యుగంలో ప్రేమ పవిత్రమైనదని, అది ఎన్నటికీచెరగని ధనమని, ప్రేమికుడు ఎక్కడవున్నా ప్రేయసి కాకుండాపోయినా, ఆమె క్షేమాన్ని ఆకాంక్షించాలని, అది ద్వేషంగా మార్చుకోరాదని మురళీకృష్ణల ప్రేమగాథ ఒక గొప్ప సందేశాన్ని ఈ పాట ద్వారా లోకానికి అందించగలిగింది. ఆ పాటను వ్రాసిన కవి ఆత్రేయ, పాడిన ఘంటసాల, సంగీతం అందించిన మాస్టర్ వేణులు చిరకాలం గుర్తుండిపోతారు.

-వి.ఆర్.రావు, సైదాబాద్