Others

ఆనంద సాగరంలో... (శరత్కాలం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా ఏ దంపతులకైనా ప్రథమ సంతానం కలుగగానే అమితానందంగా వేడుక చేసుకోవడం సహజం. పై ఫొటోలో దంపతులను గుర్తుపట్టే వుంటారు. అయినా వారిని గుర్తించనివారు ఎవరుంటారు చెప్పండి. మీరు ఊహిచినట్లే అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ దంపతులు. 1953లో ప్రథమ పుత్రిక సత్యవతి నామకరణం రోజున తీసుకొన్న అరుదైన ఫొటో. 1953 సంవత్సరం అక్కినేని నాగేశ్వరరావుకు కలిసి వచ్చిన, ఆనందకరంగా సాగిన సంవత్సరం. దేవదాసు చిత్రం తెలుగుతోపాటు తమిళంలోనూ అఖండ విజయాన్ని తెచ్చిన సంవత్సరమే కాదు, ప్రథమ సంతానం సత్యవతి జన్మించిన రోజులు. రెండు విధాలుగా ఆనందం. అక్కినేని తాను సాధించలేని విద్యార్హతలు సంతానానికి అందించాలనుకున్నారు. సత్యవతిని చదువుల విషయంలో అశ్రద్ధ చేయలేదు. పైచదువులకై అమెరికాకు పంపించారు. తర్వాత కారంచేడుకు చెందిన యార్లగడ్డ సురేంద్రనిచ్చి వివాహం జరిపించారు. సురేంద్ర కూడా నిర్మాతగామారి విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు. వీరి సంతానంలో ప్రథమ పుత్రిక సుప్రియ. పవన్ కళ్యాణ్ సరసన నాయికగా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంలో నటించింది. ఆ చిత్రం అపజయం పొందంతో రెండవ ప్రయత్నం చేయకుండా, సినిమా రంగానికి దూరంకాకుండా తాతగారికి అండగా వుంటూ అన్నపూర్ణ స్టూడియో డైరెక్టర్ బాధ్యతలను నిర్వహించింది. ఇక సుప్రియ సోదరుడు సుమంత్. హీరోగా కొన్ని విజయవంతమైన చిత్రాలను తన ఖాతాలో చేర్చుకొని కొనసాగుతున్నాడు. అక్కినేని రెండవ కుమార్తె నాగసుశీల, కుమారుడు నాగార్జున సంతానం కూడా హీరోలుగా కొనసాగుతున్నారు. తాతగారి పేరు ప్రఖ్యాతులు నిలబెట్టే క్రమంలో విజయాలను అందుకోవాలని ఆశిద్దాం.

-పర్చా శరత్‌కుమార్ 9849601717