కృష్ణ

తస్మాత్ జాగ్రత..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూలై 17: వివిధ దిన పత్రికల్లో వచ్చే విమర్శనాత్మక కథనాలపై కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణ ఉంటుందని కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వ శాఖ మీద విమర్శనాత్మక కథనాలు వస్తే ఆ శాఖ తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపి రిజాయిండర్లు పంపాలన్నారు. సిపిఓ, డిడిఓలను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించామన్నారు. వీరు కమాండ్ కంట్రోల్ ద్వారా యాడ్వర్స్ ట్రాకింగ్ సిస్టం ద్వారా రెగ్యులర్‌గా మానిటర్ చేస్తారన్నారు. 48 గంటల్లో రిజాయిండర్లు ఇచ్చి తనకు నివేదిక ఇవ్వాలన్నారు. జిల్లా అధికారులపై విమర్శలు వస్తే స్వయంగా తానే విచారిస్తానన్నారు. డివిజన్, మండల స్థాయి అధికారులపై విమర్శలు వస్తే జిల్లా అధికారులతో విచారణ జరిపిస్తామన్నారు. విమర్శనాత్మక కథనాలపై ప్రతి వారం సమీక్షిస్తామన్నారు. స్పందించని అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
రైతుల సేవలో..
మచిలీపట్నం, జూలై 17: జిల్లాలో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనకు కలెక్టర్ బి లక్ష్మీకాంతం చర్యలు చేపట్టారు. తప్పుల తడకగా ఉన్న రైతులకు సంబంధించిన భూముల రికార్డులను సరిచేసేందుకు ‘రైతు సేవలో రెవెన్యూ’ కార్యక్రమానికి తెరలేపారు. అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో సత్ఫలితాలను అందుకున్న ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ హోదాలో కృష్ణాజిల్లాలో నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. ఆగస్టు 1వతేదీ నుండి 15వతేదీ వరకు పక్షం రోజుల పాటు గ్రామాల వారీగా గ్రామసభలు నిర్వహించి రెవెన్యూ రికార్డుల్లో దొర్లిన తప్పులను సరి చేయనున్నట్లు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో కలెక్టర్ తెలిపారు. గ్రామసభల నిర్వహణకు షెడ్యూలు తయారు చేయాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. 1బి సమాచారంతో పాటు గ్రామ రెవెన్యూ కార్యదర్శులు గ్రామాల్లో అందరి నివేశన గృహాలకు వెళ్లి సక్రమంగా ఉన్న వాటిని రైతులకు తెలియజేసి సంతకం తీసుకోవటంతో పాటు అర్జీలు స్వీకరించనున్నారు. ఈ చర్యల ద్వారా రెవెన్యూ రికార్డులు పూర్తి స్థాయిలో ప్రక్షాళన కానున్నాయి. పరిష్కార చర్యలు చేపట్టిన తర్వాత ‘మీరు మా సేవలు వినియోగించుకున్నందుకు ధన్యవాదాలు’ అని తెలుపుతూ రైతులకు పరిష్కార పత్రాలు అందించనున్నారు. అంతేకాకుండా రుణ అర్హత కార్డులను గ్రామసభల ద్వారా పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నివేశన స్థలాలకు సంబంధించిన పొజిషన్ సర్ట్ఫికేట్స్‌ను కూడా అక్కడిక్కడే అందించనున్నారు.
అనంతపురం స్ఫూర్తితోనే : కలెక్టర్ లక్ష్మీకాంతం
అనంతపురం జిల్లాలో జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో రైతు సేవలో రెవెన్యూ శాఖ కార్యక్రమాన్ని నిర్వహించాం. పెద్ద ఎత్తున రైతులకు సంబంధించిన భూముల రికార్డుల్లో తప్పులను సరిచేశాం. అదే స్ఫూర్తితోనే కృష్ణాజిల్లాలో కలెక్టర్ హోదాలో ఈ కార్యక్రమాన్ని ఆగస్టు నుండి నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. పక్షం రోజుల పాటు జరిగే గ్రామసభలను రైతులు సద్వినియోగం చేసుకుని తమ భూములకు సంబంధించిన పత్రాలను సరి చేయించుకోవాలని ఆయన కోరారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖకు సంబంధించిన భూములకు సంబంధిత దేవుడి పేరు మీదనే పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు. వక్ఫ్ భూములకు కూడా సంస్థ పేరుతోనే పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.