కృష్ణ

జిల్లాలో జోరున వాన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూలై 17: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఆదివారం రాత్రి నుండి సోమవారం రాత్రి వరకు జోరువాన కురిసింది. వర్షం కారణంగా జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. అల్పపీడనం కారణంగా మంగళ, బుధవారాల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖాధికారుల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అల్పపీడన ద్రోణి వాయుగుండంగా మారే ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంతవాసులను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వాతావరణ శాఖాధికారుల హెచ్చరికలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఆదివారం ఉదయం నుండి సోమవారం ఉదయం వరకు 14.0మి.మీ సరాసరి వర్షపాతం నమోదైంది. అత్యధికంగా విస్సన్నపేట మండలంలో 41.2మి.మీ, అత్యల్పంగా బంటుమిల్లి మండలంలో 2.0మి.మీ నమోదైంది. మండలాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. జగ్గయ్యపేటలో 13.2, వత్సవాయిలో 17.8, పెనుగంచిప్రోలులో 16.8, నందిగామలో 13.8, చందర్లపాడులో 6.2, కంచికచర్లలో 8.6, వీరుళ్లపాడులో 14.2, ఇబ్రహీంపట్నంలో 4.4, జి.కొండూరులో 14.6, మైలవరంలో 32.4, ఎ.కొండూరులో 26.0, గంపలగూడెంలో 22.8, తిరువూరులో 31.8, రెడ్డిగూడెంలో 24.8, విజయవాడ రూరల్, అర్బన్ మండలాల్లో 9.2, పెనమలూరులో 7.2, తోట్లవల్లూరులో 6.2, కంకిపాడులో 8.0, గన్నవరంలో 28.8, ఆగిరిపల్లిలో 26.2, నూజివీడులో 26.4, చాట్రాయిలో 25.6, ముసునూరులో 20.4, బాపులపాడులో 8.0, ఉంగుటూరులో 18.2, ఉయ్యూరులో 9.8, పమిడిముక్కలలో 5.6, మొవ్వలో 9.6, ఘంటసాలలో 9.6, చల్లపల్లిలో 7.4, మోపిదేవిలో 9.6, అవనిగడ్డలో 21.0, నాగాయలంకలో 11.4, కోడూరులో 18.6, మచిలీపట్నంలో 9.4, గూడూరులో 4.2, గుడివాడలో 18.6, గుడ్లవల్లేరులో 8.2, పెడనలో 5.0, ముదినేపల్లిలో 7.2, మండవల్లిలో 8.6, కైకలూరులో 7.8, కలిదిండిలో 5.2, కృత్తివెన్నులో 6.2మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.
ముమ్మరంగా వరి నాట్లు
తోట్లవల్లూరు, జూలై 17: మండలంలో సార్వాసాగు పనులు ఊపందుకున్నాయి. కాలువల్లో సమృద్ధిగా సాగునీరు, మరోపక్క చిరుజల్లులు కురుస్తుండడంతో వ్యవసాయ పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. మండలంలో సుమారు 8వేల ఎకరాలలో సార్వాసాగు చేపట్టారు. ఒక పక్క పొలం దమ్ము పనులు చేస్తుండగా, మరోపక్క వరినాట్లు వేస్తూ రైతులు హడావుడిగా ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా వలస కూలీలు రావడంతో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సుమారు 30శాతం వరినాట్లు పూర్తయ్యాయని మండల వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. మండలంలోని రొయ్యూరు, వల్లూరుపాలెం, తోట్లవల్లూరు, కుమ్మమూరు గ్రామాల్లో వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కొంత మంది రైతులు ఆలస్యంగా నారుమడులు పోయడటంతో అక్కడ వరినాట్లు కొద్దిగా ఆలస్యమయ్యాయి. ఈ విధంగా రైతు, కూలీల్లో ఉత్సాహం వెల్లువిరుస్తోంది.
నూజివీడు ప్రాంతంలో భారీ వర్షం
నూజివీడు, జూలై 17: బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నూజివీడు ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయం నుండి వర్షం కురుస్తూనే ఉంది. ఆదివారం రాత్రి కూడా భారీ వర్షం కురిసింది. సుమారు పది దుక్కులకు పైగా వర్షం పడినట్లు రైతులు చెబుతున్నారు. భారీ వర్షంతో వ్యవసాయ పనులు ముమ్మరం కానున్నాయి. మెట్టప్రాంతమైన నూజివీడులో ఎక్కువ శాతం వ్యవసాయం చెరువులు, బోరులపై ఆధారపడి ఉంది. వర్షం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. మూడు రోజుల నుండి వర్షం కురుస్తుండటంతో చెరువుల్లోకి కూడా నీరు చేరింది. దీంతో వ్యవసాయ పనులు ఊపందుకునే అవకాశం ఉంది. డివిజన్ పరిధిలోని విస్సన్నపేట మండలంలో 41.2 మిమీ అత్యధిక వర్షపాతం నమోదు కాగా పమిడిముక్కల మండలంలో 5.6 మిమి తక్కువ వర్షపాతం నమోదు అయింది. నూజివీడు మండలంలో 26.4, ఎ.కొండూరు మండలంలో 26, గంపలగూడెం మండలంలో 22.8, రెడ్డిగూడెం మండలంలో 24.8, చాట్రాయి మండలంలో 25.6, తిరువూరు మండలంలో 31.8, ముసునూరు మండలంలో 20.4, ఆగిరిపల్లి మండలంలో 26.2, గన్నవరం మండలంలో 28.2, బాపులపాడు మండలంలో 8.0, ఉంగుటూరు మండలంలో 18.2, ఉయ్యూరు మండలంలో 9.8 మిమి వర్షపాతం నమోదు అయినట్లు రెవిన్యూ అధికారులు తెలిపారు.