హైదరాబాద్

అమ్మ ఆశీస్సులతో అంతా క్షేమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, జూలై 17: బోనాల ఉత్సవాల పురస్కరించుకుని సోమవారం రంగం, బలిగంప, తొట్టెల ఊరేగింపులో భాగంగా చారిత్రాత్మకమైన కార్వాన్ దర్బార్ మైసమ్మ మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మవారికి పూజలు ఘనంగా జరిగాయి. కాగా, మధ్యాహ్నం రంగం, బలిగంప, రాత్రి భారీ తొట్టెల ఊరేగింపు కొనసాగించారు. మాజీ ఎంపి అంజన్‌కుమార్ యాదవ్ అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్ధన్‌రెడ్డితో పాటు బిజెపి నగర అధ్యక్షుడు రాంచందర్ రావుతదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా లంగర్‌హౌస్‌లోని శ్రీ బుజీలీ మహాంకాళీ దేవాలయం కూడా రంగం, బలిగంప, తొట్టెల ఊరేగింపు అంగరంగా వైభవంగా కొనసాగింది. ఈ సందర్భంగా అమ్మవారికి మాజీ కార్పొరేటర్ ఉదయ్‌కుమార్‌తో పాటు నియోజకవర్గ బిజెపి కన్వీనర్ ఆకుల గోవర్ధన్‌రావు అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా గోవర్ధన్‌రావును ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు.
భవిష్యవాణిలో...
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. రైతులు పంటలు బాగా పండిస్తారని పచ్చికుండపై సుశీల భవిష్యవాణిలో భక్తులకు వినిపించారు. కార్వాన్‌లో చారిత్రాత్మకమైన దర్బార్ మైసమ్మ దేవాలయంలో సోమవారం భవిష్యవాణిలో భక్తులకు వినిపించారు. అమ్మవారికి ప్రతి మంగళ, గురువారాల్లో పూజలు నిర్వహించి, మారుబోనం కూడా చేయాలని పేర్కొన్నారు. లంగర్‌హౌస్‌లో శ్రీ బుజిలీ మహంకాళీ దేవాలయంలో కూడా భవిష్యవాణి నిర్వహించారు.
ఫలహార బండ్లు ఊరేగింపు...
బోనాల ఉత్సవాలు పురస్కరించుకొని అమ్మవారికి ఫలహార బండ్లను భారీగా ఊరేగింపుగా కొనసాగించారు. సోమవారం రాత్రి లంగర్‌హౌస్ భక్తులు ఏర్పాటుచేసిన అమ్మవారి ఫలహార బండ్లు కూడా వైభవంగా కొనసాగాయి. ఈ ఫలహార బండిలో అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భారీగా డప్పు వాయిద్యాలతో, పోతరాజుల నృత్యాలతో ఈ ఊరేగింపు కొనసాగింది. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షంలో కూడా భక్తులు దేవాలయాలకు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే, నగరంలోని చారిత్రాత్మక కార్వాన్ దర్బార్ మైసమ్మ దేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే నగరంలోని అతిపెద్ద తొట్టెలను ఏర్పాటు చేశారు. అమ్మవారికి సమర్పించిన భారీ తొట్టెల ఊరేగింపును అంగరంగ వైభవంగా డప్పు వాయిద్యాలతో... పోతరాజుల నృత్యాలతో... తొట్టెలను నిమజ్ఞనానికి తరలించారు. లంగర్‌హౌస్‌లోని శ్రీ బుజిలీ మహాంకాళీ అమ్మవారి దేవాలయంలో కూడా భారీ తొట్టెల ఊరేగింపు సంఘం మూసీనది వరకు కొనసాగించారు. సంఘంలో ఈ భారీ తొట్టెలను ఊరేగింపుగా తీసుకుని నిమజ్జనం చేశారు.
భారీ పోలీస్ బందోబస్తు
కార్వాన్ దర్బార్ మైసమ్మ దేవాలయంతో పాటు పలు ప్రాంతాలలో నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాలకు భారీ పోలీస్ బందోబస్తును పశ్చిమ మండల డిసిపి వెంకటేశ్వర్ రావు ఏర్పాటు చేశారు. కార్వాన్ దర్బార్ మైసమ్మ దేవాలయంతో పాటు లంగర్‌హౌస్ శ్రీ బుజీలీ మహాంకాళీ దేవాలయం వద్ద కూడా భారీ పోలీస్ బందోబస్తును నిర్వహించారు. రంగం, బలిగంప, తొట్టెల ఊరేగింపులో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.
బాలాపూర్: జిల్లెలగూడ మున్సిపాలిటి పరిధిలోని బిజెపి కాలనీలో నిర్వహించిన బోనాల ఉత్సవాల సందర్భం బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.ఆచారి స్థానిక నాయకులతో కలిసి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆచారి మాట్లాడుతూ తెలంగాణలో ఆషాడ మాసంలో బోనాల పండుగను అత్యంత ఘనంగా నిర్వహించుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లెలగూడ బిజెపి అధ్యక్షుడు బి.నర్సింహ యాదవ్, ప్రధాన కార్యదర్శి గాజుల మధు, బిజెవైఎం జిల్లెలగూడ అధ్యక్షుడు తుమ్మల రమేష్ ముదిరాజ్, పి.రామకృష్ణ, సునీల్, గోపినాథ్ పాల్గొన్నారు.
వికారాబాద్: వికారాబాద్‌లోని కొత్తగడి రెండు వార్డులు, ఎనె్నపల్లిలో సోమవారం బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. బోనాలను మహిళలు ఊరేగింపుగా బయలదేరి అమ్మవారికి బోనం సమర్పించుకున్నారు. వార్డుల్లోని వీధుల్లో డప్పుల చప్పుళ్ళు, పోతురాజుల విన్యాసం ఆటాపాటల మధ్య ఊరేగింపు సాగింది. కొత్తగడిలో అమ్మవారిని వికారాబాద్ శాసనసభ్యుడు బి.సంజవరావు, జడ్పిటిసి ముత్తార్‌షరీఫ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.రాంచంద్రారెడ్డి, పట్టణ టిఆర్‌ఎస్ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్ రాజమల్లు, మార్కెట్ కమిటి డైరక్టర్ గోపాల్, టిఆర్‌ఎస్‌కెవి జిల్లా అధ్యక్షుడు బి.కృష్ణయ్యలు పాల్గొన్నారు. ఎనె్నపల్లిలో బోనాల ఉత్సవాల్లో కౌన్సిలర్ నర్సింలు, నాయకులు అనంత్ రెడ్డి, ముత్యం రెడ్డి పాల్గొన్నారు. బోనాల ఉత్సవాలతో జిల్లా కేంద్రంలో పండగ వాతావరణం నెలకొంది.
ఆధ్యాత్మిక శోభ
ఉప్పల్, జూలై 17: బోనాల జాతరలో భాగంగా రెండవ రోజు సోమవారం రామంతాపూర్, హబ్సిగూడ పట్టణంలో ఫలహార బండ్లు, తొట్టెల ఊరేగింపు కార్యక్రమం వైభవోపేతంగా.. భక్తిశ్రద్ధలతో జరిగింది. శ్రీ పోజమ్మ, మహంకాళమ్మ, ఊర పోచమ్మ, బంగారు మైసమ్మ, మద్ది దొర్సానమ్మ, ఉప్పలమ్మ, మైసమ్మ, బాలమ్మ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శివసత్తుల పూనకాలతో, పోతరాజుల విన్యాసాలతో ఫలహార బండ్ల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. పోలీసుల బందోబస్తు మధ్య డప్పు వాయిధ్యాలతో యువకుల నృత్య ప్రదర్శనలతో ఊరేగింపు కన్నులపండువగా సాగింది. మహంకాళమ్మ ఆలయం ప్రాంగణంలో భవిష్యవాణి భవిష్యత్‌లో బాగా వర్షాలు కురుస్తాయని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారని, అమ్మవారికి పూజలు చేయాలని వివరించింది. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి ఫలహార బండి ఊరేగింపులో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సైదాబాద్: పండుగలు, ఉత్సవాలు దేశ సంస్కృతికి.. ప్రాచీన చరిత్రకు ప్రతీకలని శ్రద్దాబాద్ మార్కెట్ అసోసియేషన్ చైర్మన్ జి.సుభాష్‌చందర్‌జీ అన్నారు. మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహంకాళీ జాతర మహోత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారి ఘటాల ఊరేగింపు వైభవోపేతంగా సాగింది. మలక్‌పేట్ ఏసిపి కార్యాలయం చౌరస్తా నుండి మొదలైన ఈ ఊరేగింపులో గుర్రాలు, ఒంటెలు, రథాలలో కృష్ణార్జునులు, సాయిబాబా,త్రిమూర్తులు, గణపతి, కుమారస్వామి వంటి దేవతా వేషధారణలు, అల్లూరి, భగత్‌సింగ్, చత్రపతి శివాజీ, స్వామి వివేకనంద, రామకృష్ణ పరమహంస వంటి దేశభక్తుల వేషధారణలు ఊరేగింపులో అలరించారు. కళాకారులు భక్త్భిజన పాటలను ఆలపించారు. డప్పు వాయిద్యాలు, పోతురాజుల విన్యాసాలు, యువకులు, చిన్నారుల నృత్యాలు, బాలికల కోలాటాలతో ఘటాల ఊరేగింపు సందడిగా సాగింది. ఊరేగింపు తిలకించేందుకు వచ్చిన ఆహూతులతో సైదాబాద్ పురవీధులు నిండిపోయాయి. మధ్యాహ్నం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా భక్తులు తడుచుకుంటూనే ఊరేగింపును తిలకించారు. సైదాబాద్ ప్రధాన రహదారిపై ఏర్పాటుచేసిన స్వాగత వేదికపై మాజీ డిప్యూటీ మేయర్ జి.సుభాష్‌చందర్‌జీ మాట్లాడుతూ మన దేశ పండుగలు గతం నుండి స్ఫూర్తిని పొంది వర్తమానాన్ని సవ్యంగా మలుచుకుంటూ భవిష్యత్తు ఉజ్వల స్థితికి చేరుకోవడానికి తోడ్పడుతాయని అన్నారు. సైదాబాద్ రహదారుల మీదుగా సాగిన ఊరేగింపులో మార్కెట్ కూడలి వద్ద గావుపట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఊరేగింపు సంతోష్‌నగర్ వరకు సాగి తిరిగి దోబీఘాట్ వద్ద నిమజ్జనం గావించారు. ఊరేగింపులో పాల్గొన్న భక్తులకు శ్రద్దాబాద్ ఉమ్మడి దేవాలయాల బోనాల జాతర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వేదిక నుండి భక్తులకు కమిటీ చైర్మన్ కె. భూమేశ్వర్ ప్రతినిధులతో కలిసి ప్రసాద వితరణ చేశారు. ఘటాల ఊరేగింపులో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మల్లేష్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కడారి రాముకుమార్, ఉపాధ్యక్షుడు సంగోది పరమేష్‌కుమార్, జైల్‌సింగ్ తదితరుల ఆధ్వర్యంలో అమ్మవారి పలహారాల బండి ఊరేగింపును ఘనంగా నిర్వహించారు.
చేవెళ్ల: చేవెళ్ల మండల పరిధిలోని కుమ్మెర, మూడిమ్యాల్ గ్రామాల్లో సోమవారం మైసమ్మ బోనాల ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అమ్మవారి దేవాలయాలను ముస్తాబు చేశారు. సాయంత్రం రంగురంగులతో తీర్చిదిద్దారు. బోనంతో మహిళలు వచ్చి నైవేథ్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
ఎల్‌బినగర్: తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీకగా బోనాల పండుగ నిలుస్తుందని, యావత్ భారత దేశంలో తెలంగాణ బోనాల పండుగకు ప్రత్యేక గుర్తింపు ఉందని ఆర్కెపురం డివిజన్ కార్పొరేటర్, గ్రేటర్ బిజెపి డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ వి.రాధధీరజ్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని ఆర్కెపురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో నిర్వహించిన బోనాల ఉత్సవాలలో పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు.
ధారూర్: బోనాల పండుగ జరుపుకొని ప్రజలు సంతోషంగా సందడి చేశారు. ధారూర్ మండలం జైదుపల్లి గ్రామంలో మైసమ్మతల్లి మాతా బోనాలను పోతరాజుల నృత్యాలతో బోనాలను ఊరంతా తిరగి ఆలయానికి వెళ్లారు. ఉత్సవాలకు హైదరాబాద్‌లో ఉపాధి కోసం వెళ్లినవారు సైతం గ్రామానికి చేరుకుని బోనాలను ఆనందంగా జరుపుకున్నారు. గ్రామంలో ఎక్కువ శాతం యువత హైదరాబాద్‌లో ఉపాధి నిమిత్తం వెళ్లి అక్కడే వివిధ రకాల పనులు చేసుకుంటారు. పండగ వచ్చిందంటే చాలు ఊరంతా సందడిగా మారిపోతుంది. హైదరాబాద్‌లో ప్రైవేట్‌గా కార్లు నడిపే వీరందరూ కార్లతో గ్రామానికి రావడంతో ఊరంతా సందడిగా మారింది.
కీసర: కీసరగుట్ట శ్రీరామలింగేశ్వరస్వామి సేవలో రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ శివశంకర్ దంపతులు సోమవారం గడిపారు. ఆలయ చైర్మన్ టి. వెంకటేశ్ వేద పండితులతో ఎదురు వెళ్లి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మహా మండపంలో వేద పండితులు శివశంకర్ దంపతులకు స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి ఆశీర్వచనాలు, ప్రసాదాన్ని అందజేసారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త బోడ జంగయ్య పాల్గొన్నారు.