హైదరాబాద్

జోరుగా మెట్రో పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జూలై 17: నగరానికే తలమానికగా నిలవనున్న మెట్రో పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చే హెచ్‌ఎంఆర్ నిరంతరం కృషి చేస్తోంది. ఎల్ అండ్ టి సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెట్రో పనులు ఇప్పటికే ఉప్పల్ - మెట్టుగూడ, మియాపూర్ - ఎస్సార్‌నగర్ వరకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. ఈ రూట్లలో మెట్రోరైలు టెస్ట్ డ్రైవ్‌లు సైతం పలుమార్లు నిర్వహించింది. అయితే కీలకమైన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని చౌరస్తాల వద్ద నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో మెట్రోరైల్‌ను అందుబాటులోకి తేలేని పరిస్థితి నెలకొంది. దీంతోపాటు మియాపూర్ - ఎస్సార్‌నగర్ మార్గంలో పనులు పూర్తి అయినా స్టేషన్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడం, అమీర్‌పేట చౌరస్తా వద్ద పనులు నిలిచిపోవడం వంటి కారణాలతో ఈ రూట్‌ను అందుబాటులోకి తీసుకురాలేదు. ఇలాంటి వాటితో ప్రారంభ తేదీని పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. కాగా ప్రభుత్వం పనులు పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేయడంతో ఊపందుకున్నాయి.
మెట్రో పనులను పరిశీలన
మెట్రోరైల్ కారిడార్ 3లో మీయాపూర్ నుంచి ఎస్‌ఆర్‌నగర్ వరకు నవీకరణ, పునఃనిర్మాణ పనులను ఎండి ఎన్వీఎస్ రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిపై హెచ్‌ఎంఆర్ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో ఎండి ఎన్విఎస్ రెడ్డి సమీక్షా- సమావేశం నిర్వహిస్తున్నారు. హైదర్‌నగర్ మైట్రో ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో పలు అంశాలపై సమగ్రంగా చర్చించారు. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పానికి అనుగుణంగా పనులు కొనసాగాలని ఎండి ఇంజనీర్లకు సూచించారు. రాబోయే నాలుగు నెలల్లో పనులు పూర్తి అయ్యేలా చూడాలని కోరారు. నవీకరణ పనుల్లో తలెత్తే ఇబ్బందులు, పనులు ఏ మేరకు జరిగాయి అనే అంశాలను వివరించేందుకు నూతనంగా రూపొందించిన వాట్సాప్‌గ్రూప్‌లో పోస్టు చేయాలని ఆదేశించారు. అనంతరం మీయాపూర్ - ఎస్సార్‌నగర్ స్టేషన్ల మధ్య నడుస్తున్న పనులను పరిశీలించారు. మెట్రోస్టేషన్ల పరిధిలో విశాలమైన ఫుట్‌పాత్‌ను నిర్మించి దానిపై అందమైన స్ట్రీట్ ఫర్నీచర్‌ను అమర్చాలని సూచించారు. మెట్రోస్టేషన్ల మధ్యలో పైనుంచి వెళుతున్న విద్యుత్ తీగలను పూర్తిస్థాయిలో భూగర్భంలోంచి వేయాలని సూచించారు.
మియార్‌పూర్ నుంచి హైదర్‌నగర్ వరకు ఒక కిలోమీటర్ పరిధిలో గ్రామీణ క్రీడలకి ఒక ప్రదేశాన్ని కల్పించమని ఆర్కిటెక్ట్ శంకర్ నారాయణకు సలహా ఇచ్చారు. మెట్రోరైల్ స్టేషన్ల పరిసర ప్రాంతాల్లో మొక్కలతో, చెట్లతో పచ్చని వాతావరణం నెలకొనేలా చూడాలని సూచించారు. భరత్‌నగర్ రైతు బజార్ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన సౌకర్యాలపై సంతృప్తి తెలుపుతూ, పచ్చని మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణంతో మరింత మెరుగుపరచమని ఎండి ఇంజనీర్లను ఆదేశించారు.