మెయిన్ ఫీచర్

గజ్జె ఘల్లుమంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది డ్యాన్స్ ప్లస్ టీవి షో. మేఘాలు గజ్జలు కట్టి ఘల్లుఘల్లు మన్నట్లు.. ఆ ఏడుగురు యువ నాట్యకళాకారిణులు స్టేజ్‌మీద మెరుపుతీగల్లా చేసిన నాట్యం నయనమనోహరమైంది. న్యాయనిర్ణేతల హృదయాలను సమ్మోహన పరిచింది. న్యాయనిర్ణేతలలో ఒకరైన ప్రముఖ బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ వారి నృత్యాభినయానికి ముచ్చటపడి తాను కూడా వారితో జత కలసి హావభావ ప్రదర్శనలు ఇవ్వటం విశేషం. ఇంతకూ ఈ ఏడుగురు భరతనాట్య కళాకారిణులు ఎవరా అని ఆరా తీస్తే వారు హైదరాబాద్‌కు చెందినవారు. వారి గురువు 97 ఏళ్ల వి.ఎస్. రామమూర్తి అని తెలుసుకుని న్యాయనిర్ణేతలు రెమో డిసౌజా, శక్తిమోహన్, సుమిత్ నాగ్‌దేవ్, పునీత్ పాథక్ ఆ గురువుకి నమస్సుమాంజలిలు ఘటించారు.
భాగ్యనగరం నుంచి కళలకు కాణాచి
వినోదమే ప్రధానంగా సాగే టీవీల్లో చాలా రియాలిటీ షోలకు నేడు డ్యాన్స్ ప్రధానమైంది. అలాంటి డ్యాన్స్ షోలో ఆహుతులను సమ్మోహనపరచిన ఈ నృత్యవిన్యాసంలో అడుగులు వేసిన ఈ సిరిసిరి మువ్వలు హైదరాబాద్‌కు చెందిన శ్రీరామ నాట్యకళా నికేతన్ విద్యార్థులు. ఈ కళానికేతన్‌ను నిర్వహిస్తున్న వి.ఎస్ రామమూర్తి నాట్యం ఒ కళ కాదు, ఆ కళ ద్వారా విజ్ఞానాన్ని అందించే గురువు. కళలకు కాణాచిగా నాట్యకళానికేతన్‌ను తీర్చిదిద్దారు. సికింద్రాబాద్‌లో ఉండే ఈ కళానికేతన్‌ను తండ్రి మార్గనిర్దేశంలో ఆయన కుమార్తె మంజులా రామస్వామి నిర్వహిస్తున్నారు. వందలాది మంది కళాకారులను తీర్చిదిద్దుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని కాదని శ్రీరామమూర్తి ఈ నాట్యకళానికేతన్‌లో ఉంటూ ఈ 47 ఏళ్ల కాలంలో వేలాదిమంది కళాకారులను తీర్చిదిద్దారు. నాట్యమే ఆయన జీవితమైంది. ఆత్మగా భాసిల్లింది.
ఎలా ఆరంభమైంది..
ఇపుడు ఈ నాట్యకళా నికేతన్‌లో 80 మంది విద్యార్థులకు శాస్ర్తియ నృత్యంలో మంజులారామస్వామి శిక్షణ ఇస్తున్నారు. ఈ నాట్యకళానికేతన్ ఆరంభమవటానికి ఆధ్యుడు శ్రీరామమూర్తి గురువు శ్రీ దండాయుధపాణి పిళ్లై. ఆయన చెన్నైలో అకాడమీని ప్రారంభించారు. అక్కడ ఇరవై రెండేళ్ల వయసులో రామమూర్తి భరతనాట్యం నేర్చుకోవటానికి అడుగు వేశారు. ఆయన దాదాపు 30 కిలోమీటర్లు దూరం ప్రయాణించి అవది నుంచి మైలాపూర్‌కు వచ్చి భరతనాట్యంలో శిక్షణ తీసుకునేవారు. శ్రీరామమూర్తిని నాట్యం నేర్చుకోవటంలో కుటుంబ సభ్యులు తొలిరోజుల్లో ప్రోత్సహించినా.. ఆ తరువాత ఆయన నాట్యం కోసం పడుతున్న తపన, కష్టాన్ని చూసి విచారించేవారు. అలా ఆయన నాట్యమే శ్వాసగా జీవించారు. ఆయన తొలి ప్రదర్శన ఆరంగేట్రమే అదిరిపోయింది. నాట్యానికి వయసు అంతరం లేదు అంటూ శ్రీరామమూర్తి చేసే కఠోర సాధన ఆయనను భారత రాష్టప్రతి బాబు రాజేంద్రప్రసాద్ ఎదుట ప్రదర్శన ఇచ్చే స్థాయికి తీసుకువెళ్లింది. బాబు రాజేంద్రప్రసాద్ మెప్పును పొందిన శ్రీరామమూర్తి ఇక వెనుదిరిగి చూడలేదు. తంజావూరు ప్రజలు ఆరోజుల్లో కళలను ఆదరించేవారు. మనదేశం కళలకు పుట్టిల్లుగా విరాజిల్లింది. ఇదిలా ఉండగా ఆనాడు శ్రీపిళ్లై వద్ద శ్రీరామమూర్తితో పాటు అలనాటి ప్రముఖ నృత్యకారిణి వైజయంతిమాల, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జూనియర్లుగా నేర్చుకునేవారు. ఎంతోమంది లెజండరీ డ్యాన్సర్స్ చేయలేని నృత్యరీతులను సైతం గురువు ఆదేశంతో శ్రీరామమూర్తి చేసి చూపించేవారు. ‘‘రామా! నువ్వు చేసి చూపించు’’ అని అంటే చాలు.. ఆయన అందెల రవళి మార్మోగేది. అలా ఆయ న నాట్యమే ఆయన జీవితమైంది. తొంభై ఏడేళ్ల వయసులోనూ యువ కళాకారిణులను తీర్చిదిద్దుతున్నారు. తన తదనంతరం కూడా ఈ కళానికేతన్‌ను కళాకారుల నిలయంగా తీర్చిదిద్దాలనేది ఆయన కోరిక. ఆయన ఒక్కగానొక్క బిడ్డగా ఆయ న ఆశయం నెరవేర్చటం తన బాధ్యత అని అంటారు మంజులారామస్వామి.
చిత్రం.. నాట్యానికి వయసు అంతరం లేదు అంటూ శ్రీరామమూర్తి చేసే కఠోర సాధన ఆయనను భారత రాష్టప్రతి బాబు రాజేంద్రప్రసాద్ ఎదుట ప్రదర్శన ఇచ్చే స్థాయికి తీసుకువెళ్లింది. బాబు రాజేంద్రప్రసాద్ మెప్పును పొందిన శ్రీరామమూర్తి ఇక వెనుదిరిగి చూడలేదు.

- ఆశాలత