మెయిన్ ఫీచర్

తండ్రే రోల్ మోడల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తండ్రి గొప్ప నటుడు. ఆయనను రోల్ మోడల్‌గా తీసుకున్నా.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటి శృతిహాసన్. తండ్రి చాటు బిడ్డగా కాకుండా తనకంటూ స్వతంత్ర భావాలను ఏర్పరచుకున్న నటి. ఐరన్‌లెగ్ అంటూ సినీ పరిశ్రమలో అవకాశాలు తగ్గినా.. ఏ మాత్రం అధైర్యపడకుండా అడుగు ముందుకు వేసింది. ఈ సందర్భంలో ఆమె ఏనాడు తన తండ్రి పరపతిని సైతం ఉపయోగించుకోకుండా స్వతంత్రంగానే అవకాశాలను అందిపుచ్చుకున్నది. దక్షిణాదిన అగ్రశేణి నటిగా రాణిస్తున్న శృతిహాసన్ సమస్యలు చుట్టిముట్టినా ప్రేక్షకులతో కళాత్మకంగానే అనుసంధానం చేసుకున్నారు. విభిన్న అంశాలపై తన మనసులోని మాటలను మీడియాతో వెల్లడించారు.
ఈ మధ్యకాలంలో ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీలలో మెరుస్తున్నారు అని అడిగితే.. నా శరీరాన్ని చూసుకుంటే నాకెంతో గర్వంగా ఉంటుంది. ఇదే అవకాశాలు తెచ్చిపెడుతుందని తన అందం గురిం చి మురిసిపోతూ చెబుతుం ది. బాలీవుడ్‌లో ఏ నటి అయినా ఇలాగే చేస్తుంది. నేనూ కూడా కవర్ పేజీల్లో రావటానికి ప్రయత్నించటంలో తప్పులేదుకదా అని అం టుంది. అభిమానులు ఇప్పటికీ అందమైన మీ ముఖం గురిం చే ఎక్కువగా మాట్లాడుతుంటారు. దీనిపై ఎలా ఫీల్ అవుతున్నారు అని అడిగితే నా జీవితాన్ని ఎలా మలుచుకోవాలో నా ఎంపిక మీద నే ఆధారపడి ఉంటుంది. స్క్రిప్ట్‌లను ఎంచుకునేటపుడు నా పాత్రకు తగ్గట్టు ఎంచుకుంటాను. ఇది దర్శక, నిర్మాతలపై ఆధారపడి ఉంది. ఈ సందర్భంలో తండ్రి సలహాలు తీసుకోను అని నిర్మోహమాటంగా చెబుతుంది. కాని తండ్రి ఇచ్చిన స్వేచ్ఛ వల్లే తనకు బాధ్యతలు తెలిశాయని శృతిహాసన్ అభిప్రాయం. శభాష్‌నాయుడులో తండ్రి కమల్‌హాసన్‌తో కలిసి పనిచేయటం గురించి మాట్లాడుతూ.. ఆయనలో గొప్ప నటుడు ఉన్నాడు. ఏదైనా గొప్ప విజన్ ఉంటేనే ఆయన దర్శకత్వం చేయరు. ఇది అందరికీ తెలిసిన విషయమే. శభాష్‌నాయుడులో నాది తిరుగుబాటు భావాలున్న యువతి పాత్ర. హాస్యం కూడా మేళవించి ఉంటుంది.
పదేళ్ల వయసులోనే సినిమా పరిశ్రమలోకి వచ్చాను. విజయవంతమైన ఎన్నో సినిమాలు చేశాను. సినిమా పరిశ్రమ మీద ఉన్న అవగాహనతో, ప్రేక్షకుల ఆశీర్వాదంతో వేర్వేరు భాషల్లో విభిన్న పాత్రలు చేయగలుగుతున్నాను. రోల్ మోడల్ గురించి అడిగితే.. ప్రతి ఒక్కరిలోనూ మంచి లక్షణాలు తప్పక ఉంటాయి. ప్రజలలో ఉన్న మంచినే చూస్తాను. వారి నుంచే ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాను. ఇక సినిమాల్లో రోల్ మోడల్ తండ్రి కమల్‌హాసన్‌కు మించినావారు ఎవరుంటారు అని సమాధానం ఇచ్చింది. కమల్‌హాసన్ నిర్వహిస్తున్న ‘బిగ్‌బాస్’ గురించి మాట్లాడుతూ.. ఆయన ప్రజలతో దగ్గరగా ఉండాలని కోరుకుంటారు. టిఆర్‌పి అనేది ఓ క్రేజీ. ఇక ఆ బిగ్‌బాస్ కార్యక్రమంలో మీరు ఉంటారా అని అడిగితే నేను నో అని పెద్దగా చెబుతాను.
ఎందుకంటే వందరోజులు ఒక్కచోట ఉండలేను. సోషల్‌మీడియాను బాగానే ఉపయోగించుకుంటున్నారని ప్రశ్నిస్తే ట్విట్టర్ ద్వారా అభిమానులతో ఎన్నో విషయాలను పంచుకుంటున్నాను. చాలామంది సెలబ్రిటీలకు ట్విట్టర్ ఎక్కౌంట్స్ ఉన్నా యి. ప్రజలతో కనెక్ట్ కావాలంటే సోషల్ మీడియా ద్వారానే సాధ్యపడుతుంది. అన్నింటిలోనూ మంచి, చెడు ఉన్నట్లే సోషల్‌మీడియా ఉపయోగించుకునే సందర్భంలో సంభవించటం సహజం. సోషల్‌మీడియాలో ఎలాంటి రాజకీయ విషయాలు చర్చించను. మీ తండ్రిలో మీకు నచ్చే గుణం ఏమిటి? అని అడిగితే ముక్కుసూటిగా ఉండటం అని సమాధానం ఇచ్చింది.
ఎవరితోనైనా ఏదిపడితే అది మాట్లాడను. ఆలోచించి, ఏది మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాను. తాను మాట్లాడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కోలేదని చెబుతుంది. కొత్తగా ఏర్పడిన సంబంధ బాంధవ్యాలు గురించి అడిగితే ఇపుడు వాటికి ఎలాంటి సమాధానం ఇవ్వలేనని ముగించింది.