విశాఖ

బదిలీలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, జూలై 20: జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలు ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఈ బదిలీల బారి పడకుండా ఎక్కడున్నవారు అక్కడే ఉండిపోయేట్టు, లేకుంటే వారు నివసిస్తున్న ఇళ్ళకు మరింత దగ్గరగా వచ్చేందుకు అయ్యవార్లు తొక్కడి అడ్డదార్లంటూ లేవు. ఈ బదిలీల నుంచి తప్పించుకునేందుకు చాలా మంది టీచర్లు ఓ అడుగు ముందుకేసి తాము రకరకాల వ్యాధులతో బాధపడుతున్నామని, అందువలన తాము కోరుకున్న ప్రదేశానికి బదిలీ చేయాలంటూ, డాక్టర్ సర్ట్ఫికెట్లతో విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యక్షమవుతున్నారు.
ఉపాధ్యాయల బదిలల్లో కీలకమైన ప్రిఫరెన్షియల్ క్యాటగిరి (వివిధ రోగాలతో బాధపడుతున్న వారు,దివ్యంగులు) వారికి ప్రాధాన్యత ఉంటుంది. మానవతా ధృక్పథంతో వారు కోరుకున్న చోటికి లేదా, వారికి అనువుగా ఉన్న ప్రదేశానికి బదిలీ చేసే అవకాశం ఉంటుంది. ఈ పాయింట్ పట్టుకుని టీచర్లు లేని రోగాలను కొని తెచ్చుకుని బదిలీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిబంధన ప్రకారం 80 శాతం వైకల్యం ఉన్న వారికే మాత్రమే బదిలీ చేసే విషయంలో అధికారులు సానుభూతి చూపిస్తారు. కౌన్సిలింగ్ సమయంలో వారికి ముందుగా అవకాశం ఇస్తారు. వాస్తవానికి నిజంగా వైకల్యం ఉన్న వారికి కల్పించే ఈ అవకాశాన్ని కొంత మంది అంతంతమాత్రంగా వైకల్యం ఉన్నవారు, అస్సలు వైకల్యమే లేని వారు వినియోగించుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. గత వారం రోజులుగా విద్యాశాఖకు అందుతున్న దరాఖాస్తులలో అంగవైకల్యంతో బాధపడుతున్నట్టు చాలా మంది ఉపాధ్యాయులు డాక్టర్ సర్ట్ఫికెట్లతో సహా దరఖాస్తు చేసుకున్నారు. ఒకేసారి ఇంతమందికి అంగవైకల్యం ఎలా వచ్చిందోనని విద్యాశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎనిమిది సంవత్సరాలు ఒకే చోట పనిచేసిన టీచర్‌ను విధిగా బదిలీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలా మంది మెడికల్ బోర్డు ద్వారా తప్పుడు ధృవపత్రాలు పొంది తాము దీర్ఘకాల వ్యాధులతో భాధపడుతున్నాముని, తమకు ప్రాధాన్యత కల్పించాలని కోరుతున్నారు. సాదారణంగా గుండె జబ్బు, క్యాన్సర్, చెవుడు, మూగ, కీళ్ళ వైకల్యం, మూత్ర పిండాల జబ్బు తదితర తీవ్రమైన వ్యాధులు ఉన్న వారిని మాత్రమే ఈ క్యాటగిరీ కిందకు తీసుకుంటున్నారు. ఇలా పొందిన నకిలీ ధృవ పత్రాలను ఏంఈఓలు, విద్యాశాఖ ఉన్నతాధికారులు గుడ్డిగా ఆమోదిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటువంటి ధృవీకరణ పత్రాల ఆధారంగా పలువురు హెచ్‌ఎంలకు, సీనియర్ ఉపాధ్యాయులకు అవకాశం కల్పిస్తూ జాబితాలు సిద్ధం చేసినట్టు సమాచారం.
ఉన్నతాధికారులు దృష్టి పెడితేనే
ఈ వికలాంగ ధృవీకరణ పత్రాలపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలని పలువురు ఉపాధ్యాయలు కోరుతున్నారు. ఇప్పటికే ఆరు వేల దరాఖాస్తులకు రాగా వీటిలో చాలా వరకు తప్పుడు దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. అయితే ఈ దరఖాస్తులో కొన్నింటికి పలువురు యూనియన్ నాయకులు తమకు కావల్సిన వారందరీకి ఏటువంటి ఇబ్బందులు రాకుండా ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకున్నారని అరోపణలు వినిపిస్తూన్నాయి. ఈ విషయంపై జిల్లా విద్యాశాఖధికారిని వివరణ కోరగా పారదర్శకంగానే బదిలీల ప్రక్రియ చేపడుతున్నామని , ఏవరైన నేరుగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.