విశాఖపట్నం

జీవిఎంసి జోనల్ కార్యాలయంలో భర్తీకి నోచుకోని కీలక పోస్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, జూలై 20: సుమారు 1.20లక్షల జనాభా కలిగిన జీవిఎంసి అనకాపల్లి జోనల్ కార్యాలయంలో పలు కీలకమైన పోస్టులు భర్తీకి నోచుకోవడంలో ఎడతెగని జాప్యం చోటుచేసుకుంది. దీంతో దిగువ స్థాయి సిబ్బంది పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. అయినా పలు అత్యవసర పనులు జరగకపోవడంతో కార్యాలయం చుట్టూ వారాల తరబడి ప్రజలు ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. తమ పని ఎప్పుడు జరుగుతుందని అడుగుదామంటే సంబంధిత విభాగం అధికారి లేకపోవడం, జోనల్ కమీషనర్ నుండి సరైన సమాధానం రాకపోవడంతో ప్రజలు నానా అగచాట్లకు గురవుతున్నారు. జవాబుదారీతనం కొరవడటంతో ప్రజల బాధలు వర్ణనాతీతమవుతున్నాయి. కోట్లాది నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామని, పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగుపరుస్తున్నామని, దోమల బెడద లేకుండా చూస్తామని పాలకులు చేస్తున్న ప్రకటనలు కార్యరూపం దాల్చడం లేదు. సుదీర్ఘ చరిత్ర కలిగిన అనకాపల్లి పురపాలక సంఘాన్ని 2013లో విశాఖ జీవిఎంసిలో విలీనం చేసారు. దీంతో పట్టణం రూపురేఖలే మారిపోతాయని, ఈ ప్రాంతానికి నగర హంగులు సంతరించుకుంటాయని ప్రజలను అప్పటి పాలకులు నమ్మబలికారు. అదనంగా వసతులు మెరుగుపడకపోగా ఉన్న వసతులు సైతం గాలిలో కలిసిపోతున్నాయి. అత్యంత కీలకమైన సూపరింటెండెంట్, హెల్త్ ఆఫీసర్, అకౌంటెంట్, రెవెన్యూ ఆఫీసర్, శానిటరీ ఇనస్పెక్టర్లు, సీవెండ్ గుమస్తా వంటి కీలకపోస్టులు భర్తీకి నోచుకోని పరిస్థితి ఏర్పడింది. పురపాలక సంఘంతోపాటు మూడు గ్రామాలను విలీనం చేసారు. అయితే అందుకు అనుగుణంగా అదనంగా ఉద్యోగుల పోస్టులు భర్తీకాకపోగా ఉన్న కీలకపోస్టులు సైతం ఖాళీ అయిపోయాయి. జీవిఎంసి ప్రధాన ఆదాయం సమకూర్చే రెవెన్యూ విభాగంలో సంబంధిత రెవెన్యూ అధికారి పోస్టు గడచిన మూడునెలలుగా ఖాళీగా ఉండిపోయింది. సంబంధిత అధికారి జీవిఎంసి ప్రధాన కార్యాలయానికి బదిలీ అయిపోయారు. ఆ స్థానం భర్తీకాలేదు. ఇంటి పన్నుల పెంపుదలకు సంబంధించి శాంపిల్ సర్వే జరుగుతుంది. దీంతో సంబంధిత సర్వే పనులను పర్యవేక్షించే నాథుడే కరువయ్యారు. మున్సిపాల్టీగా ఉన్నప్పుడు మేనేజర్ ఉండేవారు. ఇప్పుడు ఆ మేనేజర్ స్థానంలో సూపరింటెండెంట్ ఉండాలి. ఆ పోస్టు కూడా భర్తీకి నోచుకోలేదు. పురపాలక సంఘంగా ఉండేటప్పుడు అనకాపల్లికి ఐదు సర్కిళ్లుండేవి. ఒక్కో సర్కిల్ ఒక శానిటరీ ఇనస్పెక్టర్‌తోపాటు పురపాలక సంఘం మొత్తానికి ఒక హెల్త్ ఆఫీసర్ ఉండేవారు. సంబంధిత పోస్టు ఖాళీగానే ఉండిపోయింది. ఐదు శానిటరీ ఇనస్పెక్టర్ల సర్కిల్‌లో ఒక స్థానంలో మినహా మిగతా సర్కిళ్లలో పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. అలాగే సి-1 విభాగం, క్లర్క్ గత కొంతకాలంగా ఖాళీగానే ఉండిపోయింది. అలాగే అకౌంటెంట్ పోస్టు ఖాళీగానే ఉంది. దీంతో కీలకపోస్టులు భర్తీకాకపోవడంతో ప్రతీ పనికి జోనల్ కమీషనరే జవాబుదారీగా వ్యవహరించాల్సి వస్తోంది. దీంతో పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరచడం ఇతరత్రా కీలకమైన పనులను చక్కబెట్టే తీరిక జోనల్ కమీషనర్‌కు దొరకడం లేదు.
జీవిఎంసి జోనల్ కార్యాలయ పరిధిలో పలు కీలకమైన పోస్టులు భర్తీకి నోచుకోని మాట వాస్తవమే. ఈ పోస్టులను భర్తీచేయాలని కోరుతూ జీవిఎంసి ప్రధాన కమీషనర్‌కు లేఖ రాసానని, సాధ్యమైనంత త్వరలోనే ఈ పోస్టులు భర్తీకాకపోతే పరిపాలనా పరంగా కొంతమేరకు స్తంభన ఏర్పడే పరిస్థితి లేకపోలేదని అంగీకరించారు.