Others

విడిగా ఉంటేనే ముద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లయిన వెంటనే కొత్త జంటలు హానీమూన్, ముద్దూముచ్చట్లు తీరిన వెంటనే చెంగున కొత్త కాపురం పెట్టేస్తున్నాయి. చాలా జంటలు కూడా ఉమ్మడి కుటుంబాల్లో ఉండటానికి ఇష్టపడటం లేదని ఆధునిక సర్వేలు వెల్లడిస్తున్నాయి. షాదీ డాట్‌కామ్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన అంశాలను జంటలు వెల్లడించాయి. దాదాపు 8,500 మందిపై సర్వే నిర్వహించగా.. ఇందులో పాల్గొన్న 4,617 మహిళల్లో 3,952మంది విడిగా ఉండటానికే ఇష్టపడుతున్నారు. సర్వేలో పాల్గొన్నవారంతా 24 నుంచి 34 ఏళ్ల వయసువారే. భర్తతో విడిగా ఉండటానికి ఇష్టపడేవారు 64.1శాతం ఉండగా.. 29.6శాతం మంది మాత్రం అత్తామామలతో జీవించటానికి మక్కువ చూపారు. 6.3శాతం మంది మహిళలు తమ తల్లిదండ్రులతో కలిసి ఉండటానికి ఇష్టపడ్డారు. మీ భర్త మీతోపాటు మీ తల్లిదండ్రులతో కలిసి ఉండటం ఇష్టమేనా అని అడిగితే 27.3శాతం సమ్మతి తెలుపగా..30.1శాతం మంది వద్దుఅని, 42.6శాతం మంది అలా ఉంటే బాగుంటుందని చెప్పటం జరిగింది. ఇదే విషయాన్ని భర్తలను అడిగితే.. 73.5శాతం మంది వద్దు అనటం గమనార్హం. అలాగే 4.7శాతం మంది అవును, 21.8శాతం మంది అలాజరిగితే బాగుండును అని భావించినవారు ఉన్నారు. ఇలా వీరి సర్వేను బట్టి చూస్తే.. చాలా జంటలు కూడా విడిగా ఉండటానికే మక్కువ చూపుతున్నట్లు వెల్లడైంది.