శ్రీకాకుళం

అడ్డంకులు తొలగిపోయాయి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూలై 21: వంశధార ప్రాజెక్టు నిర్మాణానికి కొత్త భూసేకరణ చట్టం అమలు చేస్తూ, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో వేసిన పిటిషన్లను కొట్టేసింది. పాత భూసేకరణ చట్టాన్ని అనుసరిస్తూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలంటూ తీర్పు చెప్పింది. ఇప్పటి వరకూ ప్రాజెక్టు పనులను మోకాలడ్డుతున్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. శుక్రవారం వెలువడిన ఈ హైకోర్టు తీర్పును ఉద్దేశిస్తూ జాయింట్ కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధరరావు తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. వంశధార ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి హైకోర్టులో దాఖలైన 40 రిట్ పిటిషన్లపై కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని ఆయన చెప్పారు. నష్టపరిహారం చెల్లింపులు, కొత్త భూసేకరణ చట్టం వర్తింపజేయడం వంటి అంశాలపై కోర్టులో రిట్‌పిటీషన్‌లు దాఖలు చేశారని ఆయన చెప్పారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు రిట్ పిటీషన్ల సంఖ్య 850,851తో దాఖలు చేసిందని దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరో ఇద్దరు న్యాయమూర్తులతో కలిసిన బెంచ్ విచారణ చేసిందని పేర్కొన్నారు. బెంచ్ అన్ని పరిశీలించిన పిదప పాత భూసేకరణ చట్టం ప్రకారం చేపట్టవచ్చునని పేర్కొందని చెప్పారు. ఇప్పటికే 95శాతం భూసేకరణ నష్టపరిహారం చెల్లించడం జరిగిందని 85శాతం మేర రిజర్వాయర్ కాలువలు, స్పిల్ వోవర్ పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఇంతమేర పనులు జరిగిన తరువాత కొత్త భూసేకరణ చట్టం సరికాదని న్యాయమూర్తుల బృందం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. భవిష్యత్‌లో ఇతర వాజ్యాలు ఉండే అవకాశాలు లేవని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు దృష్ట్యా ప్రజలు ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని కోరారు. ప్రభుత్వం తరఫున అర్హత మేరకు నష్టపరిహారం చెల్లింపులో సత్వర చర్యలు చేపట్టామని చెప్పారు.
* మధ్యవర్తులను నమ్మవద్దు
ప్రజలు పూర్తి అవగాహనతో ఉండాలని మధ్యవర్తుల మాటలను నమ్మవద్దని నిర్వాసితులకు జాయింట్ కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పరంగా అందజేయాల్సిన ప్రతీ అంశాలను పక్కాగా అమలు చేశామని ఆయన చెప్పారు. రాష్టమ్రంత్రి వర్యులు ఇటీవల నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. అన్యాయం జరిగిందని అర్హత ఉన్నప్పటికీ నష్టపరిహారం పొందలేదని ఎవరైనా భావిస్తే వారు ప్రత్యేక సెల్‌లో తమ సమస్యలను వివరించవచ్చునని చెప్పారు. వాటిని పరిశీలించి తగు చర్యలు చేపడతామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజలే ముందు-1100 అనే టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను వివరించవచ్చునని ఆయన తెలిపారు. ఇప్పటివరకు పరిష్కరించిన సమస్యలు పూర్తిపారదర్శకతతో చేపట్టామని చెప్పారు. గ్రామ, మండల డివిజన్ స్థాయిలో పరిశీలించిన అనంతరం జిల్లా స్థాయిలో పరిశీలన చేయడం జరిగిందని ఆయన వివరించారు. సెక్షన్ 24(2) ప్రకారం వంశధార నిర్వాసితులకు నష్టపరిహారం వర్తింపజేశామని చెప్పారు. అన్ని రకాల ప్రమాణాలను పాటించిన అనంతరం ఈ స్థాయిలో, ఈ దశలో కొత్త భూసేకరణ చట్టం సరికాదని హైకోర్టు స్పష్టంచేసిన నేపథ్యంలో మరలా న్యాయవివాదాలకు తావు ఉండదన్నారు. ప్రభుత్వానికి సానుకూలంగా కోర్టు స్పందించిందని గ్రహించాలని ఇటువంటి సమయంలో మధ్యవర్తులమాటలను నమ్మి మోసపోరాదని ప్రజలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉత్తర్వులు 460 ప్రకారం రూ.421,80 కోట్లను మంజూరు చేసిందన్నారు. 6304మందికి రూ.302.87 కోట్లను మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. 2015 డిసెంబర్ 31 నాటికి 18 ఏళ్లు నిండిన 3148మంది యువతకు సెక్షన్ 4(1) నెగోషియేషన్ క్రింద 1544మందికి రూ.5లక్షల చొప్పున యూత్‌ప్యాకేజీని అందించడం జరిగిందన్నారు. అంతేకాకుండా పి డి ఎఫ్‌లో మిస్ అయిన 300 మందికి ప్యాకేజీలో అధనంగా చేర్చామన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు 460 కింద అర్హులైన వారికి యూత్‌ప్యాకేజీ, పునరావాసం తదితర కార్యక్రమాల క్రింద 19 గ్రామాల ప్రజలకు చెల్లించిన వివరాలను వెల్లడించారు. సొలిపిరి గ్రామంలో 93 కుటుంబాలకు రూ.63.41లక్షలను చెల్లించామని చెప్పారు. పాలక వీరన్న అనే పి డి ఎఫ్ వ్యక్తి తన నలుగురు కుమారులకు రూ.5లక్షల చొప్పున రూ.20లక్షలు, కుమార్తెకు రూ.5లక్షలు వెరసి రూ.25లక్షలు యూత్‌ప్యాకేజీగా చెల్లించామని చెప్పారు. గ్రామంలో 42 నిర్వాసిత కుటుంబాలతో సహా 4(1) ఒక కుటుంబానికి డిసెంబర్ 31నాటి అర్హత ఆధారంగా 20మంది యువతకు సామాజిక సర్వేలో లేని వయోజనులు ఇద్దరికి వెరసి 65మందికి రూ.2.40కోట్లను పంపిణీ చేశామని చెప్పారు. గదబపేట గ్రామంలో 146 కుటుంబాలకు రూ.2.65కోట్లను పంపిణీ చేశామని చెప్పారు. ఈ గ్రామంలో పి డి ఎఫ్ కుటుంబంగా ఉన్న చల్లాభాస్కరరావు కుమారునికి రూ.5లక్షలు, ఇద్దరు కుమార్తెలకు రూ.10లక్షలు వెరసి రూ.15లక్షలు చెల్లించామన్నారు. చల్లా రామారావు అనే వ్యక్తి కుమారునికి రూ.5లక్షలు, ఇద్దరు కుమార్తెలకు రూ.10లక్షలు చెల్లించామని పేర్కొన్నారు. తులగాం గ్రామంలో 1292మందికి రూ.61.34 కోట్లను చెల్లించామని చెప్పారు. పాడలి గ్రామంలో 1267మందికి రూ.37.62కోట్లను చెల్లించామని వివరించారు. ప్రత్యేకంగా 12 బృందాలతో పరిశీలించి ఇళ్ల పట్టాలు పొందని 1582మందికి వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద రూ.5లక్షల చొప్పున చెల్లించామన్నారు. అన్ని గ్రామాల్లో ఆర్ అండ్ ఆర్ కుటుంబాలకు రూ.302.87 కోట్లు చెల్లించడమే కాకుండా 400 నిర్మాణాలకు రూ.78కోట్లను చెల్లించామని పేర్కొన్నారు. కోర్టు ద్వారా వచ్చిన ప్రతీ అర్జీ పరిష్కారం అయిందని చెప్పారు. ఇంకా ఎవరైనా ఉన్నా లోక్‌అదాలత్‌కు వెళ్లవచ్చునని అటువంటి వారికి ఉత్తర్వుల మేరకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు. వచ్చే జనవరి 5 నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అందుకు సహకరించాలని కోరారు. ప్రలోభాలకు మోసపోవద్దని ఆయన తెలిపారు. భవిష్యత్‌లో మరలా కోర్టు నుండి తీర్పు రాదని దీనిపై అవగాహన చెంది ప్రాజెక్టు పనుల్లో పూర్త్భిగస్వామ్యంతో సహకరించాలన్నారు. గ్రామాలను వదిలి నిర్వాసిత కాలనీలకు మారాలని ఆయన పిలుపునిచ్చారు. నిర్వాసిత కాలనీల్లో రేషన్‌కార్డుల జారీ, పింఛన్లు తదితర అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఈ మేరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ప్రజలు ప్రాజెక్టుపై కోర్టు తీర్పుపై స్పష్టమైన అవగాహన పొందాలని ఆయన కోరారు. 2005, 2006వ సంవత్సరంలో 6858 కుటుంబాలకు సామాజిక ఆర్థిక సర్వేలో గుర్తించి 47.33 కోట్లను చెల్లించడం జరిగిందని 4785 కుటుంబాలకు నిర్వాసిత కాలనీల్లో ఐదు సెంట్ల భూమిని పంపిణీ చేశామన్నారు. 10 సంవత్సరాల క్రింద ఎకరాకు రూ.1లక్ష చెల్లించడం జరిగిందన్నారు. ప్రతీ నిర్వాసితుని ఆధార్, బ్యాంకు ఖాతా ఆన్‌లైన్‌లో అనుసందానం చేశామని ప్రభుత్వానికి పే అండ్ అకౌంట్స్ విభాగానికి లోకల్ ఆడిట్‌కు జాబితాలు అందజేశామని చెప్పారు. ప్రజలు ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తి సహకారం అందజేయాలనికోరారు. ప్రజల సహకారంతోనే జిల్లా సస్యశ్యామలం కాగలదని ఆయన పేర్కొన్నారు.