డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 60

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుకని తల వంచుకుని అందంగా కట్టసాగాను. సావిత్రి నా పరిస్థితి గమనించిందేమో! ఆ సంభాషణ మార్చాలన్నట్లు తొందర పడింది.
‘‘రాదు, రాదు అంటూ, కల్యాణిగారు ఎంత చక్కగా చేసేస్తున్నారో- మనం కబుర్లలో పడి వెనక పడ్డాం’’ అంది సావిత్రి.
చిన్నప్పుడు కుందేలు- తాబేలు కథలా ఉంది మన వ్యవహారం అని నవ్వింది.
ఆ సాయంత్రం చాలా హాయిగా సరదాగా గడిచిపోయింది.
ఎక్కడివాళ్ళు అక్కడికి వెళ్లిపోయారు. అందరం భోజనం చేశాం.
సావిత్రి అమ్మగారు అన్నారు- రేపటినుంచి కార్యక్రమాలన్నీ ఆవిడకి కూడా చెప్పు అంది కూతురితో. అవునవును. అన్నిటికంటే ముఖ్యం రేపు 10 గంటలకు మనం అంతా టెంపుల్‌కు వెళ్లి అక్కడ శాస్ర్తీగారిని కలవాలి అంది సావిత్రి.
మర్నాడు ఉదయం అంతా కలిసి దేవాలయానికి వెళ్లాలి. దాని పేరే భారతీయ టెంపుల్. అది కూడా ట్రాయ్ అనే ఊళ్ళో ఉంది. మూర్తిగారింటికి పెద్ద దూరం లేదు.
నేను, వౌళి హోటల్‌లో స్నానం చేసి కాఫీ తీసుకుని వచ్చాం మూర్తిగారింటికి. వీళ్ళు ముగ్గురూ కూడా రెడీగా ఉన్నారు. అందరం కలిసి గుడికి వెళ్లాం. ఆ గుడికి ఏ ప్రత్యేకమైన పేరు పెట్టలేదు భారతీయులందరికోసం అన్నట్లు. దాదాపు 18 ఎకరాల స్థలంలో కట్టారు. మన దేశంలో బిర్లా టెంపుల్స్ మించిపోయింది.
చాలా విశాలంగా ఓపెన్‌గా ఉంది లోపల భాగం. లోపల అడుగుపెట్టంగానే పైన విశాలమయిన రోటుండ. క్రింద గుండ్రటి టేబుల్ కేసి దాని మీద ఒక చక్కని రిలిజియస్ సీన్ పెట్టారు. వెనక పెద్ద వినాయకుడి విగ్రహం పెట్టారు. ఆ ముందు చాలా భక్తులు పూజ చేస్తున్నట్లు అమర్చారు. చక్కని పూలతో అలంకరించారు. అక్కడే రకరకాల వాయిద్యాలతో రాజస్థాన్ బొమ్మలు కూచుని ఉన్నాయి. ఆ టేబుల్‌మీద ఎవరో చాలా అందంగా కళాత్మకంగా అలంకరించారు.
అది కేవలం ఒక దేవాలయంలా లేదు. భారతీయుల ఊహల నిలయంలా ఉంది.
ఎదురుగా క్రిందకు వెళ్ళేందుకు మెట్లున్నాయి. ఒక ఆఫీసు, గిఫ్ట్ షాపు ఉన్నాయి. వర్కింగ్ డే మూలంగా పెద్దగా ఎవరూ జనం లేరు. ఓ 10 మంది ఆడవాళ్ళు, 2, 3 మగవాళ్ళు ఉన్నారు, అంతే!
లోపలకు అడుగుపెట్టగానే చాలా ఆశ్చర్యపోయాను. అదో పెద్ద హాలు. పాల సముద్రపు ఒడ్డున పరిచిన ఒడ్డులా వుంది. పైన మళ్లీ ఎత్తుగా పెద్ద రోటుండ. తెల్లని పాలరాతితో ఎత్తుగా ఆ హాలులో ఈ చివర నుండి ఆ చివర దాకా స్టేజీ కట్టారు. ఆ తెల్లని పాల గట్టుమీద పాలరాతితోనే చిన్న చిన్న మందిరాలు కట్టి అందులో అన్ని దేవతలను ప్రతిష్ఠించుకున్నారు. మొదటగా వినాయకుడితో మొదలుపెట్టి, కనకదుర్గతో పూర్తిచేశారు. అన్ని పాల రాతివిగ్రహాలు ఒక్క వెంకటేశ్వరుడు, శివలింగం మాత్రమే నల్లని శిలతో చేయించారు.
మధ్యగా లక్ష్మీ నారాయణులు. ఒక పక్క గణపతి, వెంకటేశ్వరుడు, రాధాకృష్ణ, మరోపక్క సీతారామ లక్ష్మణులు, పరమేశ్వరుడు, కనకదుర్గ. అన్ని దేవతలను ప్రతిష్ఠించుకున్నారు. ఒక్కసారిగా అనిపించింది- పాల సముద్రంలో ఉన్న లక్ష్మీ నారాయణులను పలకరించడానికి సమస్త దేవతలూ దిగి వచ్చారా అన్నట్లు.
అమెరికాలో అంత పెద్ద గుడి, అంత అందమైన గుడిని చూస్తాననుకోలేదు. కొన్ని మిలియన్లు ఖర్చు చేసి కట్టుకున్నారు. ప్రతి ఒక్క డాలరు, పూర్తిగా మన భారతీయులు సంపాదించుకుని దానం చేసిందే!
అందులో మధ్యగా ప్రాధాన్యత చూపిస్తూ లక్ష్మీ నారాయణులు. పైన నీలాకాశం లాంటి సీలింగ్, నక్షత్రాలే మెరుస్తున్నట్లు మధ్య మధ్య లైట్లు. ఎదురుగా నవగ్రహాలూ, మరో పక్క ప్రతి పౌర్ణమికీ సత్యనారాయణ వ్రతం చేసుకునేందుకు ఏర్పాటు. దానికి ఎదురుగా మరో లక్ష్మీ నారాయణులు కొంచెం చిన్న సైజులో ఉన్నాయి. ఆ విగ్రహాలతో తొలిగా 150 మందికి సరిపోయే సైజులో 25 ఏళ్ళ క్రితం ఆ టెంపుల్ మొదలుపెట్టారుట. ఆ చిన్న టెంపుల్ ఇవాళ ఇంతై, అంతై, వటుడంతై అన్నట్లు పెద్ద 6000 చదరపు అడుగుల గుడి అయిపోయింది. ఆ హాల్‌లో కనీసం ఒక అయిదు వందల భక్తులు కూర్చోవచ్చు.
ఇక్కడ భారతీయులు చాలా ప్రాక్టికల్‌గా ఆలోచించే రకం. గర్భగుడి అది పెట్టుకుంటే అందరికి సర్వదర్శనం కష్టం అని ఓపెన్‌గా పెట్టుకున్నారు. టెంపుల్‌కి ఎక్కడ నుంచున్నా దాదాపు అన్ని దేవుళ్ళని దర్శించవచ్చు. అంత పెద్ద ఆలయాన్ని కన్నులారా చూస్తూ నిలబడిపోయాను.
మేం మాట్లాడాలనుకున్న పంతులుగారు ఏదో పూజలో ఉండటంతో మూర్తిగారు గుడిబయటికొచ్చి ఆ ఆవరణ అంతా చూపించారు.
మెట్లు దిగి వెళ్లగానే మళ్లీ ఒక హాల్, ఆ హాలుని ఆనుకుని గదులు, పార్టీ చేసుకునే వాళ్ళు ఉపయోగించుకునేందుకు, పైన మెరిసిపోయే షాండిలియర్స్, ఎదురుగా ఉన్న తలుపులు తోసుకువెడితే దాదాపు వెయ్యిమంది పట్టే బ్రహ్మాండమైన హాలు, ఎదురుగా స్టేజి, మెత్తని కార్పెట్, పైనుంచి వేలాడే షాండిలియర్స్ వజ్రాలల్లా మెరుస్తున్నాయి.
ఇక్కడే పెళ్లి భోజనాలు అని చెప్పింది సావిత్రి.
ఆ హాలు దాటి వెళ్ళంగానే మరో డైనింగ్ హాలు, కిచెన్ ఉన్నాయి.
చిన్న సైజు పంక్షన్‌కి మరో హాలు, అక్కడే హోమగుండం అన్నీ కనిపిస్తున్నాయి.
చాలా విశదంగా, విచారించి కట్టిన భవనం అది. అక్కడ మన సంస్కృతికి సంబంధించిన ప్రతి ఒక్కో సందర్భానికి అవసరమైన హంగులన్నీ ఉన్నాయి. అక్కడే వంటలన్నీ చేయించే సౌకర్యాలు అన్నీ ఉన్నాయి.
దసరా పండుగ హోమాలన్నీ అక్కడే జరుగుతాయిట.
ఇంత పెద్ద టెంపుల్- ఎంతో శుభ్రంగా చూడముచ్చటగా ఉంది. పైన పెద్ద లైబ్రరీ, క్రింద చిన్న పిల్లల మాంటిస్సోరి. అన్ని రకాల వసతులు ఏర్పరుచుకున్నారు. నేను అక్కడ ఉన్న లైబ్రరీలో ఉత్సాహంగా చూస్తుంటే ఇప్పుడు ఇలా ఖాళీగా ఉంది కాని, శని, ఆదివారాలలో చాలా హడావిడిగా ఉంటుంది అంది. ప్రతి ఆదివారం ఎంతమంది వచ్చినా ఉచితంగా లంచ్ పెడతారుట.
అక్కడ పనిచేస్తున్న వాళ్ళంతా వాలంటీర్స్. ఒక్క ఆఫీసలోనూ, పురోహితులు, జూనిటోర్స్ తప్ప.
సావిత్రి కూడా వారానికి రెండు రోజులు టెంపుల్‌కు వచ్చి వెడుతూనే ఉంటుందిట- టెంపుల్ లైబ్రరీలో పనిచేయడానికి.
మేం చూస్తూ ఉండగానే మరో ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు. సావిత్రిని చూడంగానే ఎలా జరుగుతున్నాయి పెళ్లి పనులంటూ పలకరించి వెళ్లారు. చూడబోతే ఆ ఊర్లో ఉన్నవాళ్ళంతా వచ్చేలా ఉన్నారు ఈ పెళ్లికి.
ఆ వచ్చినవాళ్ళు దేవుళ్లకి కట్టిన వస్త్రాలు తీసి మళ్లీ కొత్తవి అలంకరించారు. డొనేషన్ బాక్స్ తెరచి డబ్బంతా లెక్కించి ఇద్దరూ బ్యాంకు బాగ్‌లో సీల్ చేసి మూడోవాళ్ళ సంతకం తీసుకున్నారు.
అందరూ ఆ గుడి కోసం శ్రద్ధగా పనిచేస్తున్నట్లే కనిపించారు. మరొక ఆవిడ దేవుళ్ళ చుట్టూ ఉన్న పువ్వులు క్లీన్ చేస్తోంది. వీరందరిలో నాకు ఒక ప్రత్యేకత కనిపించింది. వదిలేసి వచ్చిన సాంప్రదాయం ఎక్కడ మరుగుపడిపోతుందో అని భయం వాళ్ళలో ఉంది.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి