దక్షిన తెలంగాణ

అమ్మంటే అనుపమ (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మంటే..
ఆప్యాయతానురాగాల ప్రోది
ఇలపై వెలసిన ఆరాధ్యదైవం
తాపోపశమనార్థం వీచే
చల్లని ప్రభాత పవనాంకురం
త్యాగానికి తల్లివేరు
నిస్వార్థానికి మరో పేరు
తనవాళ్ల సంక్షేమార్థం
హరించుకుపోయే హారతి కర్పూరం
అమ్మంటే అనిర్వచనీయమైన
ఓ మధుర స్పర్శ!
బిడ్డలే నగలుగా
భవబంధాలే పసుపు కుంకాలుగా
ఐదవతనమే ఆహార్యంగా
సాక్షాత్కరించే అమ్మంటే
కోటి సూర్యుల తేజోపుంజం!
ఓ కామధేనువో కల్పవృక్షమో
అనుకుంటే ముమ్మాటికీ పొరపాటే
అమ్మంటే ఓ అమృత కలశం!
సంసార సాగర మథనంలో
సముద్భవించే అమృతాన్ని
అందరికీ పంచేస్తూ
హాలాహలాన్ని మాత్రం
ఆనందంగా ఆస్వాదించే
అమ్మంటే అనుపమ!!
- కొడుకుల సూర్య సుబ్రహ్మణ్యం, జగిత్యాల, సెల్.నం.9492457262

అమ్మనైన వేళ!

బొమ్మలతో ఆడటమే తెలిసిన నేను
అమ్మనవ్వబోతున్నానన్నప్పుడు
పరిపూర్ణ స్ర్తిత్వం పొందానని మురిసిపోతి
ప్రథమ మాసాన నోరంత వెగటు
పుక్కిటనీరైన నిలవదు
అదేమంటే మా మామ్మ చెప్పింది
కడుపులో నలత పడితే అంతే అని
కంట్లో నలత ఎరిగిన నేను
కడుపులో నలత
అంతకన్న దుర్లభమని తెల్సుకుంటి
వేవిళ్ల వగచాట్లు కలతనిద్రల అగచాట్లు
తిన్నదేది నిలువని తీరు
సువాసనలన్ని శతృత్వాలు
షడ్రుచులతోనే నా రణాలు
నాపై ప్రేమో నాకూనకై తపనో
పతి వెంట సతినై మాసమాసాన
వైద్యశాల దర్శనం
నా మానాభిమానాలు, సిగ్గు బిడియాలు
ఆత్మగౌరవాలన్ని మాయంచేసి,
రాజీపడటం నేర్పే రసాయనశాల అది
ఎల్లపుడు అమ్మనోట వినడం తప్ప
నేనెప్పుడు ఎరుగని
వెన్నుపోటు లాంటి వెన్నునొప్పి
అంతకు తేన్పుల ప్రస్థానం,
ఆయాస మిసమిసలు
నడక బాతు నడక, మదిమిల ఆహారం
శివథనస్సులా వంగిపోయెను వెన్నుతో
భూగోళం మోసినంత భారంతో
పురిటి నొప్పుల బాధ తన్నుకొచ్చె
కాన్పుకై పొదలి పొదలి దుఃఖిస్తూ
పాన్పుపై అశక్తతగా చేరగా
నా మేని నా స్వాధీనము తప్పి,
పరాధీనమాయెను
తాళువులను బిగపట్టి
ఆర్తనాదము చేయగా
పైటచెంగు చెదిరిపోయే హీనస్థితి దాపురించే
నవనవలాడిన తనువు నలిగిపోతుండెను
శరము కడుపున చొచ్చినట్లు
కనుల కాంతి కానరాక
చీకటి గోచరమయ్యెను
సంద్రంలోని కల్లోలమంతా
నా కడుపున సంతరించె
సంద్రాన నిక్షేపాలకై వెతికినట్లు
నా కడుపున బిడ్డకై వెతుకనట్టే!
- సంకేపల్లి కీర్తనారెడ్డి, మహబూబాబాద్

అభిషేకించు

అమ్మ కంట్లో కన్నీరు రానీయక
నీ ఆదరణతో అభిషేకించు
అమ్మ బాధలోనీ బాధ్యతను
గుర్తెరిగి కర్తవ్యపు దాసుడవై
అభిషేకించు!
అమ్మ అనురాగం నీ గెలుపుకు
మూల స్థంభంగా నిలుపుకొని
అభిషేకించుకో!
అమ్మ మనసు చల్లగా దీవిస్తుంది
ఎన్ని జన్మలకైనా బలాన్నిస్తుంది
తనివి తీరా అభిషేకిస్తూ తరించు!
అమ్మ కడుపు కత్తి గాటుకు బలైనా
నీ జన్మకు ఆయువును పంచి
తను మురిసిన మురిపాల
క్షణాలను నీ ఆసరాతో జన్మంతా
అభిషేకించు!
కడదాకా నీ కుటుంబానికి
కంటికి రెప్పలా కాపాడుతుంది!
- చిందం సునీత, కోరుట్ల, జగిత్యాల జిల్లా, సెల్.నం.9701075502

పేదవాడు

‘జనం’ అనే పదానికి - నిరతము
నిండుదనాన్ని చేకూర్చేవాడు,
సాటి మనిషిని - ఆపదల్లో ఆదుకునే
హార్దిక గుణసంపద అతి పుష్కలంగా
ఉన్నవాడు - పేదవాడు!
పార్టీలన్నింటికీ అవసరమైన
‘ప్రీతి’ పాత్రమైన ‘ఓట్ బ్యాంక్’ - పేదవాడు!
రాజకీయ చైతన్యం పేరిట - సంతతమూ
విభాగించబడుతుండేవాడు - పేదవాడు!
ఏ ర్యాలీనైనా, ఏ సభనైనా
‘మహా’గా మార్చివేసి
తన నినాదాలతో హోరెత్తిస్తూ
విజయవంతం చేసే
సత్తా గలవాడు పేదవాడు!
ఏ ఉద్యమంలోనైనా
ప్రళయ ప్రభంజనమై వీచి,
భూకంప ప్రకంపనలు కూడా
సృష్టించగలవాడు - పేదవాడు
తన దగ్గర ఆర్థికకళ లేకున్నా
చిన్నమార్గాల నుండీ రాజమార్గాల వరకూ,
చిన్న పల్లెల నుండీ పెద్ద పట్టణాల వరకు
శ్రమకు విశ్వరూపంగా
అంతటా తానై కనిపిస్తూ
తన ఉనికితో
కళకళలూ, తళతళలూ,
మిలమిలలతో మెరిపించగలవాడు పేదవాడు!
ఆదర్శం మాట్లాడేవారి
నాలుకలపై మాత్రమే
హాయిగా ఊయల లూగగలిగేవాడు పేదవాడు!
బాధల మధ్య విరామాలనే
సంతోషాలు అనే ‘మొలాం’గా పూసుకుంటూ
మనస్సుకు అయ్యే గాయాలను
మాన్పుకుంటుండేవాడు పేదవాడు!
సమాజంలోని వివిధ పరిణామాల్లోను
వాటి దశలవారీ అభివృద్ధిలోనూ
ప్రత్యక్ష భాగస్వామి పేదవాడు!
ఏ అందాలూ, ఆనందాలూ
మనస్ఫూర్తిగా కనిపించని,
ఆది తప్ప అంతం కనిపించని
అష్టవిధ కష్టాల పరంపరకు
చిరునామా కూడా పేదవాడే!
‘ఆయింట్‌మెంట్’!
- రఘువర్మ, జగిత్యాల, సెల్.నం.9290093933

ఓ మేఘమా!

ఓ మేఘమా!
వర్షించవే అవనియంతా
చినుకు చినుకు తోడై
కాలువలై వరదలై
కుంటలు చెరువులై
కనుల పంటగా కనిపించవే!
కప్పతల్లులాటలు కరువై
కంటి తుడుపు మాటలాయే!
నీ చినుకులు..నదులై..
మహా సంద్రం దిశగా
ఉప్పెనలా ఊరేగింపుల్లా
ఎగసి ఎగసి పడి నిండనీ!
పరువళ్లు తొక్కనీ సాగరంలా!
మా గుండెల్లో సంతో వెల్లివిరియనీ!
మా నేలలు
పచ్చని పంటలతో ఈననీ!
మాలో ఆనందం చవిచూడనీ!
ఓ ఆకాశమా!
వదలవే వరద గూడును..
పుడమి పులకరించేలా!
- గంప ఉమాపతి
కరీంనగర్, సెల్.నం.9849467551