ఉత్తర తెలంగాణ

‘అమరవాది’ ప్రబోధ గీత మాలిక (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వృత్తిరీత్యా తెలుగు పండితులైన అమరవాది రాజశేఖర శర్మ రచనా వ్యాసంగాన్ని ప్రవృత్తిగా మలచుకొని.. ‘ప్రబోధ గీతమాలిక’ పేరుతో చతుషష్టి గీతాలను పాఠకులకు అందించారు. అమ్మ జన్మనిస్తే.. నాన్న బ్రతుకు నేర్పాడని సవినయంగా ప్రకటించుకునే శర్మ గారు, ఈ గ్రంథం ద్వారా చదువు యొక్క ప్రాశస్త్యాన్ని, అమ్మనాన్నల గొప్పదనాన్ని, కులమతాలకు అతీతంగా అందరూ కలిసి జీవించాలని, కష్టపడి జీవిత లక్ష్యాన్ని సాధించాలని కోరుతూ తమ రచనను కొనసాగించారు. ‘నమో భారత మాత’ గీతంలో.. భరతమాతకు ప్రణమిల్లారు. తల్లిదండ్రి గురువుల యెడ భక్తి ప్రపత్తులతో మసలుకోవాలని.. నిజమెప్పుడు మరువ వద్దని మరో గేయంలో హితవుపలికారు.
‘మాతృభూమి ఘనత’ గేయంలో భారతదేశ సంస్కృతిని చాటి చెప్పారు. మతమేదైతేనేం? మనమంతా మనుషులమని, జీవితంలో ఏదో ఒకటి సాధించాలనీ.. ఇంతకు ఇంతై ఎదగాలని ఆయా గేయాల ద్వారా ప్రబోధించారు. లక్ష్యాన్ని ఛేదించి.. గమ్యాన్ని చేరుకోవాలని, చదువే సర్వస్వమైతే సాధించనిదంటూ ఏమీ ఉండదని, తమ గేయాల్లో శర్మగారు చక్కగా ఆవిష్కరించారు. ఇక సినిమా పాటల స్టైల్‌లో పేరడీలు రాసి శర్మ పాఠకులను మెప్పించ యత్నించారు. జీవితమంటే టైంపాస్ కాదనీ, మనిషిగా జన్మించినందుకు.. మహనీయత సాధించడమే ధ్యేయం కావాలని సూచించారు. ‘చినుకే ఒక సముద్రం’ గేయంలో చిన్నదంచు దేన్నీ చూడొద్దని హితవు పలికారు. దీపమెంత చిన్నదైనా వెలుగే ఇక అనంతమని వివరించారు.
‘ఆర్తనాదం’ గీతంలో వివిధ నాదాల్లో దాగి ఉన్న ఆర్తనాదాలను ఏకరువు పెట్టారు. ‘పిల్లలం సిరిమల్లెలం’ గేయంలో.. పిల్లలను విరుల తేనెల జల్లులుగా అభివర్ణించారు. మరో గేయంలో తెలుగు భాష ఔన్నత్యాన్ని చక్కగా ఆవిష్కరించారు. స్నేహం మరుపురానిది. మరువ లేనిదని.. స్నేహితుల అనుభవాల పుటల నుండి సలహాలను యిచ్చుకొని ముందుకు సాగాలని సూచించారు. ఓటమి గెలుపునకు నాందీ అని, మదికి ఆనందం కలగాలంటే లలిత కళలను ఆరాధించాలని కోరారు. ఇలా.. ఇందలి గేయాల్లో చక్కని సూక్తులను తలపించే భావాలున్నప్పటికీ.. కవిత్వాంశ అసలే లేక.. సాదాసీదాగా కనిపించినప్పటికీ.. విద్యార్థినీ, విద్యార్థులు గానం చేసుకొని సదాచార సంపన్నులు కావడానికి మాత్రం ఉపయోగపడగలవు.. చిన్నారులకు చిన్ననాటి నుంచే దేశభక్తి, మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి తదితర మంచి అలవాట్లను నేర్పడానికి ఇందలి గేయాలు ఉపకరిస్తాయి.

పేజీలు: 65, వెల: 25/-
ప్రతులకు:
అమరవాది రాజశేఖర శర్మ
7-175, పెంటాచారి
హాస్పిటల్ దగ్గర, గజ్వేల్
సిద్దిపేట జిల్లా
సెల్.నం.9848996559

- సాన్వి, సెల్.నం.9440525544