రాజమండ్రి

కథన వైవిధ్యం - మేథోజనితం (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు కథ వర్తమానంలో కొత్త పుంతలు

తొక్కింది. గతంలో ఎప్పుడో వచ్చే సాదాసీదా

కవుల్ని, వస్తువుల్నుంచి విడివడింది.

సమకాలీన నవ్యత, నాణ్యత, పఠనీయత

సంతరించుకున్న రచనలు వస్తున్నాయి.

అవి 1980వ దశకం నుంచే

ప్రారంభమయ్యాయి. అలాగని మూలాల్లోకి

వెళ్లి గురజాడ, శ్రీపాద, చింతా, బలివాడల

బాటలు వీడలేదు. పదిలంగా వాటి

మూలాలు, మాండలికాల నేపథ్యాలు,

అస్తిత్వ, మైనార్తీ వంటి వాద పోరాటాలు

అన్నీ కథా వస్తువులయ్యాయి.

అవుతున్నాయి. కీ.శే. డాక్టర్ రావుకు

సుమారు మూడు దశాబ్దాల సాహిత్య

నేపథ్యం ఉంది. ఒక ఆవేశం, సంయమనం,

అప్పటి అన్ని వాదాల ప్రసక్తి ఉంది. జీవన

జ్వలన నిర్వేదనలు- అనునయింపలలో

తానెదుర్కొన్న విషయాలు, ఎదురైన

బీభత్స, దుఃఖాగ్నుల్ని తనలోనే

దాచుకున్నారు. కానీ కొన్ని పాత్రల ద్వారా

ఆవేశాల్ని, సందేశాల్ని, సందర్భ సమస్యల్ని,

వలయాల్లోంచి నిర్గమించేందుకు రచనలు

చేశారు. సూత్ర నిబద్ధతల్ని పాటించే

సందేశాల్నిచ్చారు.
మేథోజనం ఒక విధంగా ఆలోచించే సరళి,

వాదాల్ని తెల్పారు. అలాంటి గాఢతలు,

కాలం వెంబటి పోరాటాలు కథలయ్యాయి. ఈ

క్రమం గెలుపోటములు రికార్డు చేయడం

వల్లనే సాధ్యమన్నారు. అందుకే ఈయన

కథలైనా, నవలలైనా ఒక అసంబద్ధతనించి

మొదలై సమిష్టి సమగ్ర అధ్యయనం తీవ్రంగా

చేయాల్సిందేనని భావించాలి.
అప్పుడే పాఠక ప్రతిక్రియల లక్షణం

అలవుడ్తుందంటారు. డాక్టర్

చంద్రశేఖరరావు కథల్లో శిల్ప ప్రామాణికత

వస్తు విశే్లషణలు, సంఘటనాత్మక

సంభాషణల్నే చదువుతాం. ఆద్యంతాల

ఎత్తుగడలు ముగింపులుగా చెప్పవచ్చును.

ఇలా స్థూలంగా చెప్పాలంటే 20వ శతాబ్దపు

అంతంలోంచి దరిమిలా వస్తున్న

పరిణామక్రమాల్ని అంచనా వేస్తూ

రావాల్సిందే. ఒక ప్రక్క లాటిన్ అమెరికన్

భావజాలాల అన్వయాన్నిస్తారు. ఆ ఒరవడికి

తెలుగు పాఠకులకు సమాయత్తపర్చడంగా

కనిపిస్తుంది. అయితే కవులన్నీ పాశ్చాత్య

వ్యామోహాలకే పరిమతం

అవుతున్నాయనుకోవడం సరికాదు. దీనికి

ఉదాహరణ ‘ఆత్మహత్యల ఋతువు’ కథ.

స్వర్ణాంధ్ర నిర్మాణాలు ఎల్‌పిజాలు, గ్రామాల

నగరీకరణం, సెజ్‌ల ప్రభావం, రైతులు

పాలికాపులుగా మారడం ఆలోచింపచేస్తుంది.

అలాగే చాలా రచనల్లోని శాస్ర్తియ విధానాలు,

వాటి ప్రయోజనం, ఒక డాక్టర్‌గా పేషెంట్ల

మానసికత్వం లాంటి అంశాలు వచ్చి చేరడం

అనివార్యంగా కనిపిస్తుంది. తక్షణ

కర్తవ్యాల్లోంచి సందేశాత్మక కథనం, శైలి

కన్పించిన రచనల్లో ‘జీవని’ పలు భాషల్లోకి

దృశ్య, శ్రావ్య నాటికగా పేరొందడం

గమనార్హం. ఒక కధన చతురతని

ఆపాదించుకోవడంలో శిల్పం, అభివ్యక్తి,

నిర్థుష్ట ప్రారంభాల జోలికి వెళ్లకుండానే

కథలో ఒకానొక అసంగ్ధిదంకాని

ఆలోచనాత్మకతతో ముగింపు

అయిపోయిందే అనే తలపు పఠితకు ఏర్పడే

అభిప్రాయంగా ఉంటుంది. ఇక మారుతున్న

వ్యవస్థలోని జీవన వైవిధ్యాలు, స్ర్తిపురుష

సంబంధాలలోని నైతిక, అనైతికలు

చోటుచేసుకునే సందర్భాల్ని లోతుగా

చెప్పడం చూస్తాము. దీనికి ఉదాహరణ

‘నడిచి వెళ్లిన దారి’ కథ. ఇది ఒక

సమీక్షణాత్మక కథన శైలిలో రాశారు. అది

రత్నమాలతి కథ. దానిపై సమీక్ష ఏలా రాస్తే

బావుంటుంది అనుకుంటూ ప్రారంభిస్తారు.

‘వెదురుపొద వేణుగానం, తుళ్లిపడ్డ నది

లాంటి పదోపరకో పదాలులో ‘ఒక ఫైరవిల్

నోట్’ రాయడం కాదంటూ కొంత సెనే్సషన్,

మిష్ఠిగా మితిగా మిగల్చే ప్రయత్నం

చేయరాదుకుంటూ - గతంలో రత్నమాల

సృష్టించిన డాక్టర్ జ్ఞాన ప్రకాశం (చివరకు

తన తండ్రి) సుగుణ అనే తల్లి, రమణి పాత్ర,

ఇలా 5, 6 పాత్రల్ని- 32 అధ్యాయాలు

మధ్యలో రచయిత్రికి తారసపడిన పిఎస్

రావు, పెళ్లిచేసుకుని వదిలేసిన

పరమేశ్వరరావు, ప్రభాకరం..ఆ మధ్యలో

తల్లి- తండ్రి విడిపోతే పిల్లల పరిస్థితి, పార్వతి

పాత్రలాంటివెన్నో తారసపడుతుంటాయి.
ఒక స్నేహితురాలికి రాసిన ఉత్తరంలో తన

జీవితంపై విరక్తిని, ఆ పై రచయిత్రి మానసిక

స్థితి బాగోలేకపోవడం, చివరికి తను

సృష్టించిన ప్రకాశం తన తండ్రే అని తెల్పడం

జరుగుతుంది. ఒక నవలంటూ ఉండి దాంట్లో

పనికిరాకుండా ఉన్న పేజీయే తన నాన్న

మనోభావాల్ని పొందుపరుస్తూ ‘తనకంటూ

ఒక భార్య, పిల్ల, ఇల్లు ఉంటే ఎంత

బాగుండును అనుకోవడం విశే్లషణ.
ఇలాంటి సందర్భాల్లో ఈ సమీక్షాణాత్మక

కథకు రచయిత్రి రత్నమాల ఇంటికి

పెట్టుకున్న పేరు ‘ఏకాంత’. అక్కడి

శిలాఫలకం మీది అక్షరాల్ని పొందుపర్చే

ముగింపు చంద్రశేఖరరావు శైలిని

తెలియజెబుతుంది. ‘నేను ఒంటరిని/ మీ

వంటరి/ మనం పరస్పరం స్పర్శించుకున్న

క్షణాల్లో కూడా/ మనతోపాటు మన

ఒంటిరితనం, అలాగే జీవని, ద్రోహవృక్షం

కథల్లోని శైలిని, శిల్పాన్ని విమర్శల్ని

తట్టుకునే, అయిదు హంసల’ నవల

ప్రారంభించారు. అలాగే నల్లమిరియం చెట్టు -

ఒక వేదనాభరిత దుఃఖాన్ని, వర్గ- వర్ణ

వైషమ్యాల్ని నిలువరించేయత్నం..అలాగే

ఆకుపచ్చని దేశం కూడా ఆలోచింపజేస్తుంది.

తన ఉద్యమాల వెనుక నుండీ ఉన్న

సమర్థనీయంగానే కొన్ని రచనలు ‘లెనిన్

ప్లీస్, మాయాలాంటరు’ చిట్టచివరి రేడియో

నాటకం, ఇలా 90కి పైగా కథలొచ్చాయి.

ఇంకా కొన్ని పునర్‌ముద్రణ ఆలోచనల్లో

ఉండగా, గత ఆరేడు నెలలుగా అనారోగ్యంతో

బాధపడుతూ, సాహిత్య, సాన్నిహిత్యం

వదలలేకపోయారు. ఎంతో మృధుస్వభావి,

ఉత్తమ కథకుడెప్పుడూ సామాజిక

సూత్రాల్నించి కాక నమ్ముకున్న

ఉద్యమాలు, విప్లవాలు తెరమరుగైనా సరే

ఆవ్యయవుల కథలు రాసే కథకులు

జీవిస్తూనే సంజీవనులయ్యే సందర్భాలు

ఉంటాయి. అలాంటి దుఃఖాల్ని, క్రోథాల్ని,

భయం అక్షరాల్లో నింపుకున్న మేజిక్

రియలిస్ట్ ఇక లేదు. కలల్లోంచి రచయిత

చెప్పినట్టు ‘మరణం అంటని ఒక ముగింపుని

కలగన్నాను’ అన్న మోహన సుందరం

సృష్టికర్త అత్యంత సౌందర్య రూపమైన

‘మృత్యువు’తో వెళ్లిపోయింది.

కథ, నవల, వ్యాసకర్త
చంద్రశేఖరరావుకు
స్మృతి నివాళిగా..

- విఎస్‌ఆర్‌ఎస్ సోమయాజులు డోర్ నెం: 65-5-20/5, మెహర్ నగర్, కాకినాడ- 3