రాజమండ్రి

స్నేహమంటే ఇదేరా (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎలాగైనా కృష్ణని ఈ రోజు కలవాలి’
ఈ బాధల నుండి విముక్తి పొందాలి
ఎట్టకేలకు ధైర్యంగా నిర్ణయం తీసుకున్నాడు

ప్రసాద్.
‘నిజాయితీగా, క్రమశిక్షణగా జీవించాలి’
‘చిన్నప్పటి నుండి గిరిగీసుకోని

ఏర్పరచుకున్న కట్టుబాట్లు జీవన

సమరానికి ప్రతిబంధకంగా మారాయి’
అయినా బాధపడలేదు.
‘ప్రసాద్ - కృష్ణ చిన్ననాటి స్నేహితులు’
కలసి చదువుకున్నారు. ‘ఒకే మంచం - ఒకే

కంచం’ ఒకే బెంచ్
ప్రసాద్ చదువు సంధ్యల్లో ప్రథమం
కృష్ణ చదువు సంధ్యల్లో అధమం. అయితే

డబ్బు ముందు ఇవన్నీ దూది పిందెల్లా

తేలిపోయాయి.
‘వ్యాపారస్తుల కుటుంబం కావడంతో డబ్బు

మంచినీళ్లప్రాయంలా ఖర్చు చేసేవాడు. ఈ

ప్రస్థానం పదవ తరగతి వరకు కొనసాగింది’
నాడు విడిపోయి కృష్ణ పెద్ద చదువులు చదివి

వ్యాపారిగా స్థిరపడిపోయాడు.
ప్రసాద్ కూడా బాగానే చదువుకున్నప్పటికి

కుటుంబ బాధ్యతలు పై చదువులకు

సహకరించలేదు. ప్రవేట్ ఉద్యోగంలో

స్థిరపడ్డాడు ఆస్థిపాస్తులు గాని, తల్లిదండ్రుల

నుండి సంక్రమించిన ఆస్తులు గాని

లేకపోవడంతోపాటు, ఓ పేదింటి పిల్ల -

కమలను పెళ్లి చేసుకోవడం ఇద్దరు బిడ్డలు

తండ్రి కావడం అన్నీ జరిగిపోయాయి.
బాధలు
కష్టాలు
కన్నీళ్లు ఇవన్నీ ప్రసాద్ జీవితంలో

సర్వసామాన్యం అయ్యాయి.
‘అరకొర జీతం - ఎగుడూ - దిగుడూ జీవితం.

ఎలాగో కాలం వెళ్లదీస్తున్న ప్రసాద్‌కి
భార్య ‘కమల’ అనారోగ్య సమస్యలు -

నిద్రలేకుండా చేస్తున్నాయి. బంధువులు -

సన్నిహితుల దగ్గర అప్పులు చేసి
‘వైద్యులు’ దగ్గరకు తీసుకెళ్లినా ప్రయోజనం

శూన్యం
‘అందినంతవరకు అప్పులు చేసినా ఫలితం

కనిపించలేదు. సంవత్సరం కిందట ఓ

శుభకార్యం సందర్భంలో కృష్ణని కలిసాడు

ప్రసాద్. అదే ఆప్యాయత, అదే ఆదరణ, చెక్కు

చెదరలేదు. సిరిసంపదల గర్వం కృష్ణ

ముఖంలో ఎక్కడా కనిపించలేదు.అంతరాలు

- అగాధాలు - బేషజాలు లేకుండా ఓ గంట

పాటు కష్ట సుఖాలు కలబోసుకున్నారు.
వేష, భాష, ప్రవర్తనలో ఎక్కడా డబ్బు

తాలూకా అహంకారం కృష్ణ ముఖంలో

కనిపించలేదు, సరికదా! అంతరాలు మరచి

ప్రసాద్ తన సహచరులందరికి పేరుపేరున

పిలిచి మరీ పరిచయం చేయడం ప్రసాద్

జీవితంలో మరచిపోలేనిది.
చిన్నప్పటి జ్ఞాపకాలు

నెమరువేసుకున్నారు.
అనేక విషయాలలో ‘ప్రసాదే’ తన ‘గురువు’

అని కృష్ణ అంతమందిలో చెప్పడం ఇప్పటికీ

మరపురావడంలేదు. పంక్షన్ నుండి కారు

ఎక్కేముందు కృష్ణ తన భార్యకి ప్రసాద్‌ని

పరిచయం చేస్తూ
తన ఉన్నతికి ప్రసాదే కారణం అని చెప్పడం

కూడా గొప్ప అనుభూతిగా మిగిలింది.
‘ప్రసాద్’ ఏ అవసరమున్నా తనని

కలవవచ్చునని విజిటింగ్ కార్డు కూడా

ఇచ్చాడు కృష్ణ జాగ్రత్తగా దాచుకున్న

విజిటింగ్ కార్డుని ఇప్పుడు ఉపయోగించాలి.

బ్రతికి బంధువులు ఇంటికి వెళ్లరాదు, చెడి

స్నేహితుల ఇంటికి వెళ్లాలి’ అనే సామెత

ప్రసాద్‌కి గుర్తుకి వచ్చింది. కృష్ణని ఏదైనా

సహాయం అడగాలి. ఆత్మగౌరవాన్ని ప్రక్కన

పెట్టాడు ప్రసాద్.
ఇరవై ఎకరాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన

జీడిపప్పు ఫ్యాక్టరీ, వందలాది మంది ఉపాధి

కల్పిస్తున్న ప్రాంగణంలోకి అడుగుపెట్టాడు

ప్రసాద్.
రకరకాల ఆలోచనలు జోరీగల్లా

ముసురుకుంటున్నాయి. సహాయం ఎలా

అడగాలి.
అడిగితే కృష్ణ ఏమనుకుంటాడో!
ఆడగకపోతే అమ్మయినా అన్నంపెట్టదు

కదా!
‘చిరుచెమటలు పడుతున్నాయ’
‘స్నేహాన్ని దుర్వినియోగం చేస్తున్నానా! అనే

భావం ప్రసాద్‌ను తోలిచేస్తోంది. శరీరమంతా

నీరసం ఆవరించింది.
‘అయితే అవసరం ‘ప్రసాద్’ను కృష్ణ

ఛాంబర్‌వైపు నడిపిస్తోంది. అదృష్టంకొద్దీ కృష్ణ

చాంబర్‌లోనే ఉన్నాడు. తన వివరాలతో

కలిపి చీటి ఓ కుర్రాడితో లోపలికి పంపాడు

ప్రసాద్ వెంటనే స్పందన వచ్చింది. కృష్ణ

ఉన్న గది ప్రక్కనే ఉన్న సోఫాలో

కూర్చోమన్నాడు ఆ కుర్రాడు.
కూర్చున్న ప్రసాద్‌కి కృష్ణ గది నుండి పెద్దగా

మాటలు వినబడుతున్నాయి. ప్రతీసారీ

డబ్బులుకోసం నామీద పడితే ఎలా!

డబ్బులు చెట్లకు కాస్తున్నాయా,

స్నేహితులు, బంధువులు పేరుతో ఇలా

దానాలు చేసుకుంటూ పోతే నేను రోడ్లమీద

పడాల్సి వస్తుంది.
దయ చేసి మరెప్పుడూ డబ్బులు అని నా

దగ్గరకి రావొద్దు’
ఈమాట కృష్ణవే
ప్రసాద్‌కి గుండెల్లో రాయి పడింది.
ఆదిలోనే హంసపాదు అన్నట్లయింది
ఆ మాటలు తనకీ వర్తిస్తాయి. సరే వెళ్లిపోతే

బాగుండునేమో ఆలోచిస్తున్న

సమయంలోనే పిలుపు వచ్చింది.
అప్పటివరకు కోపంతో ఫోన్‌లో మాట్లాడిన

కృష్ణ ముఖంలో ఒక్కసారిగా ప్రసాంతత

కనిపించింది.
ఆప్యాయంగా పలకరించి కూర్చోబెట్టాడు.
కష్టసుఖాలను ఇద్దరూ కాసేపు

పంచుకున్నారు.
చిన్నప్పటి ముచ్చట్లు కలబోసుకున్నారు,

కాఫీలు త్రాగారు.
‘ప్రసాద్’ ఈ రోజు నాతో కలసి నువ్వు

భోంచేయాలి. అని కృష్ణ ఆర్డర్ వేసాడు. ప్రసాద్

కాదనలేకపోయాడు. జీవితంలో అటువంటి

భోజనం తినడం మాట అటుంచితే చూసి

కూడ ఉండడు ప్రసాద్
భోజనాలు పూర్తి చేసారు. వచ్చిన పని

అడిగాడు కృష్ణ.
ఇందాకటి మాటలు గుర్తుకు వచ్చాయి

ప్రసాద్‌కి
ఏమీలేదు నిన్ను చూద్దామని వచ్చాను

అనేసరికి కృష్ణలేచి అయితే మళ్లీ కలుద్దాం -

ఎప్పుడైనా మీ ఊరు వస్తాను నీ అడ్రస్

కావాలన్నాడు కృష్ణ. అడ్రస్ చీటిమీద వ్రాసి

ప్రసాద్ అక్కడ నుండి నిష్క్రమించాడు.

సహాయంకోసం వచ్చి ‘్భజనం’ చేసి

వెళుతున్న ప్రసాద్‌కి అవకాశాన్ని

ఉపయోంచుకోలేకపోయానే అనే బాధ

తీవ్రమయింది. కళ్ల ముందు భార్య

అనారోగ్యం గుర్తుకి వచ్చి కళ్ళల్లో నీళ్లు

తిరిగాయి.
కొన్నాళ్లు గడిచాయి. ఓఫైన్ మార్నింగ్

పోస్టుమాన్ ప్రసాద్ ఇళ్లు వెతుక్కుంటూ ఓ

రిజిష్టర్డు కవర్ చేతిలో పెట్టాడు. రెండు రోజుల

నుండి వెతుకుతున్నాను సార్ ఈ రోజు

దొరికింది మీ అడ్రస్ అంటూ వెళ్లిపోయాడు.

ఆతృతగా కవర్ చింపి చూసేసరికి ‘ప్రసాద్’

పేరిట ఇరవై వేల రూపాయల చెక్కు. అదే

కవర్ మరో చీటీ. అందులో ఇలా ఉంది ‘నేను

కృష్ణుడిని కాను, నీవు కుచేలుడివి కాదు.

ఇద్దరం ప్రాణస్నేహితులం. నీ కుటుంబ ఆర్థిక

పరిస్థితి గురించి మన ఫ్రెండ్ శ్రీను అంతా

చెప్పాడు. మొన్న జరిగినదానిని మనసులో

పెట్టుకోకు. ఈ చిరు సహాయం

ఉపయోగించుకో ఇట్లు నీ కృష్ణ.
ప్రసాద్ పొంగిపోయాడు. తన మనసులోని

భావన అర్థం చేసుకుని ఆర్థికంగా చేయూత

నిచ్చిన కృష్ణ నిజంగా కృష్ణుడే అనుకొని

మురిసిపోయాడు. అందుకే ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్

ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారు’.

- టంకాల సత్యంనాయుడు, సెల్ : 9395355952