విశాఖపట్నం

సినారె (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత
పద్మవిభూషణ్ ఆచార్య డాక్టర్ సినారె
యావత్ ప్రపంచానికే కవి కులగురువు
పదాలకు సొగసులద్ది
భావాలకు తావినిచ్చి కవిత్వ సౌందర్యాన్ని
కలం ద్వారా ప్రవహింపజేసిన
సాహిత్యాచార్యులు
నిత్య చైతన్యశీలి సినారె
సినారె సాహితీవనంలో పూసిన ఓ గులాబి
సాహితీ వనానికే రారాజు సినారె
సినారె ఇక లేరంటే
సాహితీలోకం బోరున విలపిస్తుంది
తెలుగు భాషాభివృద్ధికి
ఆయన చేసిన కృషి ఎనలేనిది
సినారె వారసులుగా సాహితీ
పూదోటలో పూసిన గులాబీలు
ఒక్కో కవి ఒక్కో గులాబీలా మారి
పూమాలలో చేరి భరతమాత
కంఠాభరణానికి
పూమాలగా అలంకరించి సాహితీ విలువను
అందించు నవతరానికి
- రాయవరపు సరస్వతి, కోటవీధి, మొదటి లైను
చోడవరం పోస్టు, విశాఖ జిల్లా - 531036.
సెల్ : 9885656356.

అశాంతి బాట
అయింది

శాంతిదూతగా పేరొందావు
నీ సంకేతాలు సమస్యల
నిలయమైనాయి చాచాజీ
చైనా చెలగాటమాడుతోంది
మానస సరోవరం టిబెట్లు
హస్తగమైనాయి
నేపాలు హిందూ రాజ్యం
మావోల భోజ్యమయింది
అరుణాచల్‌పై కనే్నసి
భారత్‌ను బలి చేయదలిచారు
నీ శాంతి మాట
అశాంతి బాట అయింది
నీవు ఉంటే
ఈ దారుణాలు చూసి
ఎంత బాధపడిపోదువో
శాంతి దూత చాచాజీ
- సీరపు మల్లేశ్వరరావు,
కాశీబుగ్గ. సెల్ : 7680812592.

కళ్యాణ మండపం

కళ్యాణ మండపం
వివాహాది శుభకార్యాలకు
అసలైన వేదిక
కన్యాదానం
ఎంతో కమనీయం
ఆడ పెళ్లి వారికి
మగ పెళ్లి వారికి
అనువైన ప్రాంగణం
చుట్టాలు, బంధువులు
అంతా వివాహ వేడుకను
హాయిగా తిలకించే చోటు
ఒక జంట పవిత్రంగా
ఒక్కటయ్యే అద్భుత స్థలి
విద్యుద్దీపాలు, మంత్రోచ్ఛరణల నడుమ
పవిత్రమైన పెళ్లి వేడుకకు
కళ్యాణ మండపమే అసలైన చోటు
- చెన్నాలక్ష్మణరావు,
పాచిపెంట,
విజయనగరం జిల్లా.
సెల్ : 8985914107.

ధన్యము

సగం తల్లిదండ్రుల కోసం
సగం పిల్లల కోసం
నీ కోసం శూన్యం
నీ జీవితం ధన్యం

నిజం

కులం కన్నా
గుణం మిన్న
మతం కన్నా
మానవత్వం మిన్న
- రాకురా, చినవాల్తేరు,
సెల్ : 9441344503.