డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 61

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుకే ఎవరికివారు వారి శక్తికొద్ది పనిచెయ్యాలనే తాపత్రయపడుతున్నారు.
ఇంతలో శాస్ర్తీగారు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. ఆయన డ్యూటీ అయిపోయిందట. ఇంకా మాతో మాట్లాడడానికి ఒక పక్కకు తీసుకువెళ్లారు ఒక డైరీ చేతపట్టుకుని.
‘‘ఈవిడ వౌళి అమ్మగారు’’ అని పరిచయం చేయంగానే, వంగి నమస్కారం చెయ్యబోయారు. పురోహితులు నాకు దండం పెట్టడం ఏమిటని- అరె అంటూ వెనక్కి జరిగాను. అదేమాట అన్నాను ఆయనతో.
‘‘్భలేవారే. వౌళి బాబు లాంటి కొడుకును పెంచారు. మీరు వందనీయులే!’’ అన్నారు. ఇంతకుమునుపు ఎవ్వరూ నాకా బిరుదు ఆపాదించలేదు. నవ్వి ఊరుకున్నాను. ఆయనకు వౌళి బాగా తెలుసట. అతను కూడా చాలా చిన్నవాడే! మొహంలో వేద పఠనంతో అబ్బిన వర్చస్సు కనిపిస్తోంది. చాలా తెలివిగా కనిపించాడు. అన్ని భాషలు మాట్లాడుతున్నాడు. మూడు వేదాలు నోటిచివర ఉన్నాయి.
‘‘ఈయన మా టెంపుకి ఓ అసెట్ అన్నారు మూర్తిగారు. ఆ గుళ్ళో మొదట్టమొదటి విగ్రహ ప్రతిష్ఠాపనకు ఆయనే వచ్చాడుట. చాలా చిన్నతనంలో అమెరికా వచ్చినట్లున్నాడు.
‘‘మా గుడిలో ప్రత్యేకత గమనించారా’’ అని అడిగాడు.
‘‘నాకు మీ గుడిలో అన్నీ ప్రత్యేకంగానే ఉన్నాయి. ప్రతి విగ్రహంలోనూ రూపురేఖలు మాత్రం కూర్చి చేర్చినట్లున్నాయి, ఎక్కడ తయారుచేయించారోగాని’’ అన్నాను.
‘‘మీ నోటంబడి అంత ప్రశంస వినడం చాలా సంతోషం. మీరు గమనించని, ప్రత్యేకత ఏమిటంటే- మేము నాలుగు యువదైవాలను ప్రతిష్ఠించుకున్నాం. ఎదురుగా లక్ష్మీనారాయణులు సత్య యుగం నుండి, త్రేతాయుగం రామచంద్రుడు, ద్వాపర యుగం కృష్ణుడు, సరే కలియుగం చెప్పాల్సింది ఏముంది- ప్రపంచం అంతా వెలిగిపోతున్న వెంకటేశ్వరుడు’’ అన్నాడు.
‘‘నిజమే! ఆ విషయం నాకు తోచనేలేదు!’’ అనుకున్నాను.
‘‘చిత్రం ఏమిటంటే, ఆ మూల విగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేస్తుంటే ఆ వెనుకగా మళ్లీ చిన్న విగ్రహాలు, లక్ష్మి, సరస్వతి, శ్రీనాధ్, హనుమాన్, ఒకటేమిటి మహావీర్ కూడా ఉన్నాడు.
అందులో మాత్రం కొంచెం పాలిటిక్స్ కనిపించాయి. అందరి దాతలను తృప్తిపరచినట్లున్నారు.
ఆ టెంపుల్ కట్టడానికి ఎంతమంది దాతలు ఉన్నా, ఆ కట్టించడంలో పెద్ద కృషి తెలుగువారిది కనిపిస్తూనే ఉంది. ఆ దాతల పెద్దలో అన్నిటికంటే పైన ఉన్న వట్టికుట్టి రాజ, పద్మ అన్న పేర్లు చూడగానే నా మనసు ఎంతో సంతోషించింది. ‘‘మా విజయవాడ నుండి వచ్చాడు ఎం.ఎస్ చదవడానికి!’’ అన్నాను.
‘‘ఇవాళ అమెరికాలో పెద్ద ఇండస్ట్రియలిస్ట్’’ అన్నారు మూర్తిగారు.
‘‘ఎంతో సింపుల్, డౌన్ టు ఎర్త్ పర్సన్. అతనెవరో తెలియనివారికి చెప్పినా నమ్మరు’’ అన్నారు మూర్తిగారు. అందరం కూచున్నాం.
శాస్ర్తీగారు శ్రద్ధగా ఇంటి పద్ధతులు, ఆచారాలు అడిగి తెలుసుకున్నారు. వివాహ తంతు అంతా ఎలా చేయించబోతున్నాడో విడమరిచి చెప్పాడు నన్ను ప్రత్యేకించి ఉద్దేశించి. ‘‘అమ్మా, మూర్తిగారు నాకు పరిచయులే! వారింటి వ్యవహారాలు అన్నీ నాకు తెలుసు. మీరు ప్రత్యేకంగా ఏమయినా మీ కుటుంబ ఆచారాలు ఉంటే చెప్పండి, తప్పకుండా జరుపుదాం’’ అన్నాడు.
‘‘అదేం లేదండీ! మీరు సూచించినవన్నీ బాగున్నాయి’’ అన్నాను.
‘‘మన హిందూ సాంప్రదాయం ప్రకారం, పెళ్లిలో కన్యాదానం చేస్తే ఇటు పది తరాలు, అటు పది తరాలు తరిస్తాయి అంటారు. అందుకే, పై రెండు తరాలకు గోత్ర నామాలు కూడా చెప్పాలి’’ అని ఆగిపోయాడు.
నాకు కొంచెం మనసులో ఆశ్చర్యం వేసింది. ఆ శాస్ర్తీగారు అన్నీ అడిగాడు కాని, రఘురామ్ పేరు ఎత్తలేదు. ఎవరిని కూడా అడగలేదు ఇంతవరకూ, మూర్తిగారు ఎమైనా చెప్పారేమో అనుకున్నాను.
‘‘అందుకని, వౌళి తాతగారు, తండ్రిగారిని ఇక్కడ చెప్పాల్సి వస్తుంది’’ అన్నాడు తిరిగి.
మూర్తిగారు వౌనం వహించి తను తయారుచేసుకుంటున్న లిస్టుమీద దృష్టి ఉంచడానికి ప్రయత్నించాడు. నేను వౌళి వంక చూచాను. వాడూ నా వంకే చూశాడు ఎటువంటి భావమూ వ్యక్తపరచకుండా.
అంటే నిర్ణయం నాదన్నమాట!
ఒక్కసారి బలంగా నిట్టూర్చాను. కావాలనుకుంటే వచ్చేది, వద్దంటే పోయేదీనా ఈ రక్తసంబంధం అంటే, అది తరతరాలు కట్టిపడేస్తుంది అనుకున్నాను.
కాగితంమీద రఘురాం పేరు, ఆయన తండ్రి పేరు, గోత్రం రాసి ఆయనకు అందించాను. ‘‘పేర్లు చెప్పండి అంతకుమించి ఏమీ వద్దు’’ అన్నాను.
రఘురాం పేరు చూడగానే శాస్ర్తీగారి కళ్ళు పెద్దవయ్యాయి.
‘‘తానులో గుడ్డ. ఎక్కడికి పోతాయమ్మా. వౌళిలో ఆ తెలివితేటలు చూడంగానే అనుకున్నాను. ఏదో ప్రత్యేకత ఉందని’’ అన్నాడు హుషారుగా.
వౌళి వంక చూచాను. ఎటువంటి భావాలు వ్యక్తపరచకుండా ఉండాలని ప్రయత్నిస్తున్నాడు. వౌళికి తనని ఏ సందర్భంలోనూ
రఘురాంతో ఐడెంటిఫై చేసుకోవడం ఇష్టం లేదు. కానీ, నాకు అంత శాస్త్రోక్తంగా చేస్తున్న పెళ్లిలో వ్యక్తిగత అభిప్రాయాలకు చోటివ్వడం ఇష్టం లేదు. సాంప్రదాయం పాటించడమే ముఖ్యం అనిపించింది.
తరువాత, వౌళిని, తేజాని ప్రత్యేకంగా పక్కకు తీసుకువెళ్ళాడు. వాళ్ళిద్దరితో ఏకాంతంగా ఓ గంట సేపు గడిపాడు. వాళ్ళిద్దరూ నిర్వహించబోయే ప్రతి పని, దాని వెనక అర్థం, సారాంశం విడమరచి చెప్పాడు. హిందూ వివాహంలో ఉన్న ప్రాముఖ్యత అంతా వివరించాడు.
ఆ పంతులుగారి పద్ధతి నాకు చాలా విస్మయం కలిగించింది. ఆయన చేయించేవన్నీ అమెరికాలో పెరిగిన పిల్లల పెళ్లిళ్లే! గట్టిగా పంచ కట్టుకోవడం కూడా రాని బాపతు. కానీ, ఈయన మాటల ధోరణికి వాళ్ళందరూ శ్రద్ధగా అర్థం చేసుకుంటున్నారు.
వౌళి, తేజ ఇద్దరూ పక్క పక్కన నడుస్తూ కారు వైపుకు వెళ్లారు.
‘‘ఆయన చెప్పిన విషయాలు నీకేమయినా తెలుసా’’ అడుగుతున్నారు వౌళి. తల అడ్డంగా ఊపింది తేజ. ‘‘నీకూ!’’ ఎదురు అడిగింది. వౌళి కూడా తెలియదన్నాడు. ‘‘సర్లే, ఇండియాలో పెరిగిన నీకే తెలియకపోతే నాకేం తెలుస్తుంది’’ అంది తేజ!
‘‘ఇండియాలోనా, ఫ్రెండ్స్ పెళ్లంటే హాయిగా కబుర్లు చెప్పుకోవడం, ఎంజాయ్ చేయడం. అసలు ఇంతవరకు ఎవరి పెళ్లి సరిగ్గా చూడలేదు!’’ అన్నాడు వౌళి.
వౌళి, తేజ ఇద్దరూ ఇంగ్లీష్‌లో మాట్లాడుకుంటారు. తేజాకి తెలుగు బాగానే అర్థం అవుతుంది. కానీ, మాట్లాడటానికి ముందుకు రాదు. దాంతో వౌళి కూడా తేజాతోపాటు ఇంగ్లీష్ మాట్లాడేస్తాడు. కారు ఎక్కుతూ అనుకున్నాను- ‘‘వీళ్ళిద్దరూ ఇలాగే ఉంటే, వాళ్ళింట్లో తెలుగు భాష వెనకపడిపోతుంది’’. ఆ రాత్రి వౌళితో మాట్లాడాలి అనుకున్నాను.
సావిత్రిగారు- ఇక రాబోయేవన్నీ ఏకరువు పెట్టారు.
పెళ్లికూతురు, పెళ్లికొడుకు చేయడం-సంగీత్, మెహంది ఒకటేమిటి వరుసగా ప్రతిరోజు ఏదో హడావిడి వుంటూనే ఉంది.
తేజా స్నేహితురాండ్రు అంతా కలిసి తేజాకి బ్రైడల్ షవర్ అవి చేస్తారుట. పెళ్లికూతురు స్నేహితులు అంతా చేరి, పెళ్లి కూతురికి బహుమతులు, సలహాలు, జోకులు కురిపించేస్తారు.ఓ రాత్రి వౌళి తన స్నేహితులతో బాచిలర్స్ పార్టీ ఉందన్నాడు. పెళ్లికొడుకు తన స్వతంత్రం కోల్పోయే ముందు స్నేహితులతో పార్టీ.
ఈ అమెరికాలో పెళ్లిళ్ళు చూస్తే మన దేశం దాటిపోయింది. దాదాపు ఓ వారం రోజుల హడావుడి చేసుకుంటున్నారు. అన్నిటికంటే-
అన్ని రాష్ట్రాల వేడుకలు కలిపి మరీ చేస్తున్నారు.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి