సాహితి

హైకూలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వయసుకి
శే్వతపత్రం
తెల్లజుట్టు

ఫ్యాన్ గలికి
విరబూస్తోంది
టేబుల్‌పైన పుస్తకం

ఆ ఒక్కరూ
ఏం పాపం చేశారు
సెల్ఫీ

మైనస్ డిగ్రీల్లోనూ
ముచ్చెమటలు
గ్లాసుకి

శిల
తల్లి అవుతోంది
శిల్పి పురిటినొప్పులు

వాచీ టైమే చెప్తుంది
పని
దాని విలువ చెప్తుంది

ఆత్మారాముడి
తృప్తిగానం
బ్రేవ్
ఎన్ని దెబ్బలో పాపం
వస్త్రానికి
శత్రు సంహారంలో

రంగు రంగుల
వెల్తురు టాటూలు
రాత్రి నిండా

లైటార్పే వేళ కోసం
కాస్కుంది రాత్రి
ఈలోగా సూరీడొచ్చాడు

అతను
డౌన్ టు ఎర్త్
రాత్రి పూట మరీను

పసితనం
అమ్మ చేజారింది
బుజ్జి పాదాల్లోకి

- గోపరాజు రాధాకృష్ణ