సాహితి

చిగురుటాకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిద్రార్తి తీరకముందే
బద్దకంగానే నిద్రలేస్తారు పిల్లలు
అమ్మానాన్నల పొదిగిళ్ళలో
బాల్యం బడి - బడి బాల్యం
పర్యాయ పదాలై జంట పదాలయ్యాక
లే లేత తవ్వ కంకుల్లా
ఇల్లంతా విస్తరించాల్సిన వాళ్లు
లేస్తూనే బడి కొష్టాలకి బయలుదేరుతుంటారు
బెల్టులై షూలై బ్యాగులై
గడియారం ముల్లులై
పిల్లల్ని చుట్టేస్తుంటారు
అమ్మానాన్నలు
తూనీగల దండు వాలినట్టు
స్కూలు ఆవరణమంతా
ఇంద్ర ధనుస్సుల రంగులీనుతుంది
పిల్లల కేరింతలతో
వీపుల మీద
అమ్మానాన్నల కలల బరువుల్ని
మోస్తున్న పిల్లలు
చిగురుటాకుల్లా వణికిపోతుంటారు
టాటాలు చెప్పే చేతులు
ఆ పసిగుడ్డుల భవితని త్రీడీల్లో భ్రమిస్తుంటాయి
పిచ్చుక గూళ్లుగా
నెమలీక పింఛాలుగా
కొంగా పువ్వాటలుగా
కాగితం పడవలుగా
వెల్లివిరియాల్సిన బాల్యం-
పగలంతా
ఎక్కాలై లెఖలై హోంవర్కులై
ఫారం కోళ్ళలా
మార్కుల్ని పొదుగుతుంటారు
సాయంత్రానికి బడులు
పిల్లల పాలిట
రసం పీల్చే పురుగులవుతాయి

ఆటాపాటల వూసెరగని పిల్లలు
నిదర మత్తులో సయితం
హోంవర్కుల్ని కలవరిస్తుంటారు

ఇప్పుడు బాల్యం
పిల్లలకు పరాయిదైంది -
అమ్మానాన్నల ఆశల సౌధానికి పునాదైంది
డాలర్ల వేటకు ఎరయింది-

నూతక్కి సతీష్, 9848693298