రివ్యూ

సీక్వెల్‌లోనూ సేమ్ గోల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దండుపాళ్యం-2
*
తారాగణం: పూజాగాంధీ, మకరంద్ దేశ్‌పాండే, రవికాలే, పి.రవి, శంకర్, శృతి, సంజన, సుబ్బు తదితరులు
సంగీతం: అర్జున్‌జన్య
నిర్మాత: వెంకట్
రచన, దర్శకత్వం: శ్రీనివాసరాజు
*
వాణిజ్యపరంగా ప్రజాదరణ పొందిన చిత్రానికి కొనసాగింపు రావడం ఆధునిక విపణి అనుసరిస్తోన్న వ్యాపార శైలి. అలా వచ్చిన చిత్రం ‘దండుపాళ్యం-2’. మూలం కన్నడానిదైనా దక్షిణ భారతీయ భాషలన్నింటిలోకీ అనువదితమైంది. బెంగుళూరుకు గంట ప్రయాణం దూరంలో వున్న దండుపాళ్యం గ్రామంలోని వ్యక్తులు చేసిన దొంగతనాలు, మానభంగాలు, హత్యలూ ఆధారంగా ఆ గ్యాంగ్‌కు ఉరిశిక్ష పడుతుంది. అయితే వారు చేసినట్లుగా చెపుతున్న 80 హత్యలలో కేవలం పనె్నండిటికే సాక్ష్యం దొరకడం తదితరాల ఆధారంతో వారికన్యాయం జరిగిందన్న కారణంతో పాత్రికేయురాలు అభివ్యక్తి (శృతి) అభిప్రాయపడి తాను నిజాలు వెలికితీస్తానని, ఆ ప్రక్రియ కొనసాగిస్తుంది. మామూలుగా అయితే, ఆ ప్రయత్నం ఫలించిందా లేక ఆమె విఫలురాలైందా? అన్న ప్రశ్నలకు సమాధానాలతో చిత్రం ముగియాలి. కానీ ఈ చిత్రం అందుకు భిన్నంగా వాటి సమాధానాలు అన్నీ ఆగస్టులో విడుదలయ్యే దండుపాళ్యం-3లో చూడండన్న సంకేతాలివ్వడంతో చిత్రం ముగుస్తుంది. ఇది ప్రేక్షకుల్ని నిరాశకు గురిచేయడమే కాకుండా సాధారణ ఒప్పందాలను సైతం ఉల్లంఘించినట్లైంది. ఎందుకంటే ఒక సినిమాకు కొంత రుసుము చెల్లించి వచ్చిన ప్రేక్షకుడికి, మీరింకో టిక్కెట్టు కొనుక్కుని రాబోయే మరో చిత్రం చూడమని చెప్పడం ఒక రకంగా బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేసినట్లే. మరి ఇంతటి అసమగ్ర, అసంపూర్ణ ఒరవడికి కారణాలేవైనా, పద్ధతి మాత్రం పూర్తిస్థాయి అసమంజస రీతికి తెరతీసింది.
ఇక ఏ నేరమైనా దాని పరిశోధన ముఖ్యంగా పరిస్థితుల రీత్యా లభించగిన ఆధారాలు మీదే ఆధారపడుతుంది. ప్రత్యక్ష సాక్ష్యాలు ఎన్నిటికి లభిస్తాయి? అవి లేకపోతే పూర్తి న్యాయం ఎలా? అన్న అభివ్యక్తి ఇందులో ప్రశ్నిస్తుంది. అయితే ఆధునిక నేర పరిశోధనలో మిగతా విధానాలు, కొన్ని సందర్భాలలో అత్యంత ఖచ్చిత సమచారాన్నిచ్చేవి కూడా ప్రస్తుతం లభ్యమవుతున్నాయి. అదీ ఇందులో గమనిస్తే బావుండేది. ఓ సందర్భంలో అభివ్యక్తి జైలు అధికారిని ‘మీ సర్వీసులో ఒక్క నిర్దోషికి కూడా శిక్షపడలేదు అని చెప్పగలరా’? అని అడుగుతుంది. వాస్తవానికి భారతీయ న్యాయవ్యవస్థ అంతరంగం కూడా అదే- పదిమంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు కానీ ఒక్క నిర్దోషికీ శిక్ష పడకూడదనే! పోనీ ఈ సూత్రానికి న్యాయం చేకూరేలా సినిమాని బలంగా తీసుకెళ్లినా వీక్షకుడు ఓ విధమైన సహేతుకత దొరికిందని ఆనందించేవాడు. ఇంత పెద్ద సంచలనం కలిగించిన కేసులో ప్రాథమిక నివేదిక కూడా నమోదు కాలేదు. నలభై రోజులు ఎవరికీ తెలియని ప్రదేశంలో పోలీసధికారి వుంచారు. అక్కడేం జరిగింది? అంటూ ప్రశ్నించారు. అయితే అలా నలభై రోజులు అంతమంది నేరస్థుల్ని వుంచడం- అదీ ఒక పోలీసధికారి, కొందరు సిబ్బందితో సాధ్యమయ్యే పనేనా అన్న ఆలోచన ఎవరికైనా వస్తుంది. దాదాపు చిత్రం ద్వితీయార్థం అంతా పోలీసధికారి చలపతి (పి రవిశంకర్) ఆతడి గ్యాంగ్ (దండుపాళ్యం గ్యాంగ్)ని టార్చర్ పెట్టడమే చూపారు. అసలు దృశ్యపరంగా చూసేదేదైనా ఓ మాదిరిగా ఎస్టాబ్లిష్ చేస్తే చాలు. దానికి పదే పదే అదే సన్నివేశాన్ని (లాఠీలతో కొట్టడం, మట్టి తినిపించడం తదితరాలు అతి క్రూరంగా ఇందులో చూపారు) చూపడం విసుగు పుట్టించింది.
నటీనటులంతా దండుపాళ్యం ద్వారా తమ ప్రతిభ నిరూపించుకున్న ఆర్టిస్టులే కనుక సీక్వెల్‌లో ప్రత్యేక ప్రశంస అవసరం లేదు. అయితే ఇందులో వచ్చిన కొత్త పాత్ర జర్నలిస్టుది. ఆ పాత్రను శృతి బాగానే చేశారు. అలాగే చలపతిగా బొమ్మాళి రవిశంకర్ తన మార్కు తీవ్ర క్రౌర్యాన్ని చూపారు. ఇక చిత్రంలో సంభాషణల బరితెగింపుతనం ప్రస్తావించి తీరాలి. ముఖ్యంగా జైల్లో స్ర్తి ఖైదీల మధ్య జరిపిన సంభాషణలు వగైరా. అలాగే బెల్గాం జైలు వార్డెన్ నోటినుంచి తీవ్రాతితీవ్ర అభ్యంతరకర సంభాషణలు యధేచ్ఛగా దొర్లాయి. ఇలాంటి ముళ్లలాంటి మాటలమధ్య శృతి పాత్రతో ‘వెనక వున్న నీడకీ, ముందు వుండే సత్యానికీ తేడా వుంటుంది’ అంటూ ఎన్నదగిన డైలాగ్స్ వుండటం విశేషం. అర్జున జన్య అందించిన పాట (జననం ఒక కథ..) బాణీ కంటే అందులో భువనచంద్ర అందించిన సాహిత్యమే ఎక్కువగా ఆలోచించపజేసింది. ముఖ్యంగా మలుపు మలుపునా.. అంటూ జీవన విశేషాల్ని బాగా వివరించారిందులో. మొత్తానికి దండుపాళ్యం-2 ద్వారా రెండు టిక్కెట్లతో ఒక చిత్రసారాన్ని తెలుసుకోగలం అన్న సంగతి మాత్రం అర్థమైంది.

-అనే్వషి