శ్రీకాకుళం

పేదోడి కల చెదిరింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూలై 24: రాష్ట్రానికి మరో విడతగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన గృహాల్లో చివరి నుంచి రెండో స్థానంలో శ్రీకాకుళం నిలిచింది. కేంద్రప్రభుత్వం ఏపీకి మరో 2 లక్షల 25 వేల 245 ఇళ్ళు మంజూరు చేస్తూ సోమవారం నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకుగాను రూ. 14,140.44 కోట్లు ఖర్చు చేయనున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాల వారీగా సమతూల్యత, అత్యవసరం, దారిద్య్రరేఖకు దిగువనున్న ప్రజల గణాంకాలు, అందరికీ ఇళ్లు అనే నినాదంతో అమలు చేసే పథకంలో సిక్కోల్ వాటా వంటి అంశాలపై ఇక్కడ నేతలు నిలదీసి అడకపోవడం వల్ల శ్రీకాకుళం జిల్లాకు చాలా నష్టం జరిగిందనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన గృహాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో విశాఖపట్నంకు 12,244 గృహాలు మంజూరు కాగా, శ్రీకాకుళానికి 6709 గృహాలు, విజయనగరానికి 3692 గృహాలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మిగిలిన జిల్లాలైన అనంతపురం 19,697, తూర్పుగోదావరి 15,966, గుంటూరు 32,577, కడప 14,544, కృష్ణ 52,986, నెల్లూరు 19940 పశ్చిమగోదావరి 26,985 ఇలా అక్కడ ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీసుకవెళ్ళే ఒత్తిళ్ళు మేరకు ఆయా జిల్లాల్లో పేదోళ్ళకు గూడు కట్టాలన్న దృక్పథం వారిలో ఎక్కువగా కన్పించడం వల్ల ఆయా జిల్లాలకు అత్యధికంగా గృహాలను కేంద్రం నుంచి మంజూరు చేయించుకోగలిగారు. ఆంధ్రప్రదేశ్‌కు గతంలో లక్షా 95 వేల 067 ఇళ్లు మంజూరు చేసిన కేంద్రం తాజాగా బాబు సర్కార్ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుంది. కేంద్ర మంత్రిగా వెంకయ్యనాయుడు ఉన్న సమయంలోనే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. మంత్రి పదవి నుంచి తప్పుకునే ముందు ఏపీకి ఇళ్ళ మంజూరు దస్త్రంపై చివరి సంతకం చేసిన వెంకయ్యనాయుడు చివరి వరంగా సోమవారం జరిగిన సమావేశంలో కేంద్ర గృహ నిర్మాణశాఖ మానిటరింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో ఆంధ్రాలో 4,20,312 ఇళ్ళు మంజూరు చేసిన కేంద్రం ఇందుకు కోసం మొత్తం 24,834.18 కోట్లు ఖర్చు పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు ఆర్థిక అనుమతులు పొందాయి. కానీ - ఇటువంటి బృహత్తర గృహానిర్మాణ పథకంలో కేంద్రం నుంచి సిక్కోల్‌కు తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన ఎం.పి. రామ్మోహన్‌నాయుడు, మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కిమిడి కళావెంకటరావు, స్థానిక ఎమ్మెల్యేలు పేదోళ్ళ కోసం పోటాపోటీగా పనిచేయడం లేదన్న నిజం నిర్థారణ చేసేలా కేంద్రం గృహాలు మంజూరు చేసే జిల్లాల్లో చిట్టచివరి స్థానంలో రెండవది సిక్కోల్ ఉండడమే తార్కణం.
ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం 2016-17 సర్కార్ ఉత్తర్వుల మేరకు మహాత్మగాంధీ గ్రామీణ ఉపాధి పథకానికి అనుసంధానం చేస్తూ అసెంబ్లీ నియోజకవర్గం ఒక్కోక్కటికీ 1250 గృహాలు చొప్పున్న జిల్లా అంతటా 12,500 గృహాలు గ్రామీణ ప్రాంతలలో మాత్రమే కేటాయించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ మూడేళ్ళు పాలన ముగించుకున్న తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఇప్పటికీ పేదోళ్ళకు ఇంకా గృహాలు పంపిణీ సంబరాలు నిర్వహించలేకపోయింది. ఇదిలా ఉండగా, ప్రధానమంత్రి అవాస్ యోజన (గ్రామీణ్) పథకంతో అనుసంధానం చేసి ఎన్టీఆర్ గృహాలు జిల్లాకు ఇప్పటికీ 2734 గ్రామీణ ప్రాంతాల్లో మంజూరైన విషయం తెలిసిందే. తాజాగా మరో 6709 గృహాలను కేంద్రం మంజూరు చేసింది. ఇందుకుగాను, యూనిట్ విలువ రూ. 2 లక్షలు కాగా, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూ. 78,000 కాగా, బాబు సర్కార్ రూ. 52,000 ఇస్తూ, మహాత్మగాంధీ జాతీయగ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులుగా 58,260 రూపాయలు, మరుగుదొడ్డి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ. 3,000, రుణంగా రూ. 8,740 రూపాయలుగా కేటాయింపులతో రూ. 2 లక్షలకు ఒక యూనిట్‌గా కేటాయించే గృహాలు అతి తక్కువ యూనిట్లు శ్రీకాకుళం జిల్లాకు మంజూరు చేయడంతో పేదోళ్ళ అందరికీ 2019 ఎన్నికల ప్రచారం సమయానికి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చే హామీ నెరవేర్చలేదన్న ఆందోళన ప్రతీ పేదోడు మదనపడుతున్న నేపథ్యంలో ఇక్కడ ప్రజాప్రతినిధులు పేదోళ్ళ సంక్షేమం - అభివృద్ధికి మరింతగా పనిచేస్తేనే రానున్న రోజుల్లో మళ్లీ తెలుగుదేశం తరుఫున బి.్ఫరాలు అందిపుచ్చుకునే నేతలకు ఓట్లు పడతాయే తప్ప, సిక్కోల్ పేదోళ్ళ కోసం పనిచేయకుండా, వారి స్వలాభం, స్వపేక్ష కోసం నేతలు పరుగులు తీస్తే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వేలాది ఓట్లు మెజార్టీలతో గెలుపొందిన ఎమ్మెల్యేలకు డిపాజిట్లు కూడా గల్లంతైనా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటూ మురికివాడల్లో విలవిలలాడుతున్న జనం గళం వినిపిస్తోంది! నేతలంతా ఇకనైనా బహుపరాక్!!

ఆదాయపు పన్నుతోనే దేశాభివృద్ధి
శ్రీకాకుళం, జూలై 24: దేశం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే అదాయపు పన్నుదారులు సక్రమంగా పన్నులు చెల్లించాలని జిల్లా కలెక్టర్ కె.్ధనుంజయరెడ్డి పేర్కొన్నారు. ఇన్‌కమ్ ట్యాక్స్ డే సందర్భంగా స్థానిక ఆదాయపు పన్ను శాఖ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1962 నుండి 2017 సంవత్సరం వరకు ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లింపుల్లో కేంద్ర ప్రభుత్వం చాలా మార్పులు తీసుకువచ్చిందని చెప్పారు. ట్యాక్స్‌లో రాయితీలు కల్పించడం వలన ఎక్కువ శాతం మంది పన్నుదారులు తమ పన్నులకు చెల్లించేందుకు కొంతవరకు సుముఖత చూపుతున్నారని తెలిపారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లింపుల్లో పునర్వవస్థీకరణ చేసినట్లు చెప్పారు. ఉద్యోగులు, వ్యాపారస్తులు ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించేందుకు గతంలో అనేక ఇబ్బందులు పడేవారని, ప్రస్తుతం దాన్ని ఒకే పత్రంలో వారి ఆదాయ వివరాలు తెలిపే విధంగా మార్పులు చేయడం జరిగిందని అన్నారు. ఎల్ ఐ సి తదితర పొదుపు పథకాల్లో పెట్టుబడులు ద్వారా ట్యాక్స్ రాయితీ వర్తిస్తుందని, కాబట్టి ప్రజలు పొదుపుపై దృష్టి సారించాలని చెప్పారు. ఫారం హౌజ్‌ల పేరిట తదితర ప్రాంతాల్లో చాలామంది ట్యాక్స్ చెల్లించడం లేదని ఈ ఫారం హౌజ్‌లు వ్యవసాయ రంగం పరిధిలోనికి వస్తాయన్నారు. ఇన్‌కమ్ ట్యాక్స్‌లో 42శాతం రాష్ట్భ్రావృద్ధికి ఇవ్వడం జరుగుతుందని అందువలన రాష్ట్రంలో ఉన్న వ్యాపార వేత్తలు, పారిశ్రామిక వేత్తలు ఆదాయపన్ను చెల్లించడానికి ముందుకు రావాలని సూచించారు. ఈసందర్భంగా వనం-మనం కార్యక్రమంలో భాగంగా ఆదాయపు పన్ను శాఖ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఇన్‌కమ్ ట్యాక్స్ కమీషనర్ అనురాగ్ చంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారులు కె.వి అప్పారావు, డి.సంధ్యారాణి, ఇన్‌స్పెక్టర్లు, కె.రవిశంకర్, యు.నారాయణరావు, పివి ఎస్ కుమార్, రెడ్‌క్రాస్ సంస్థ ఛైర్మన్ పి.జగన్మోహనరావు, రోటరీ క్లబ్ అధ్యక్షులు నటుకుల మోహనరావు, రిటైర్డ్ ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారి యు.వి రామారావు, చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ రామమూర్తి, జిల్లా ట్యాక్స్ అసోసియేషన్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్దానం కిడ్నీ వ్యాధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
వజ్రపుకొత్తూరు, జూలై 24: ఉద్దానంలో మరణమృదంగం మోగిస్తున్న కిడ్నీవ్యాధిపై టిడిపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వైకాపా జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి అన్నారు. సోమవారం ఉద్దాన రామకృష్ణాపురంలో ఉద్దాన కిడ్నీవ్యాధిగ్రస్తులతో ప్రత్యేక ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కిడ్నీ వ్యాధులు ఉద్దాన ప్రాంతాన్ని కబళించి ఊర్లుకు ఊర్లు ఖాళీ అవుతుంటే మూడేళ్లుగా నిద్రపోయిన టిడిపి ప్రభుత్వం ఇప్పుడు మేలుకువ వచ్చిందని ప్రశ్నించారు. వైకాపా అధ్యక్షుడు జగన్ ప్లీనరీలో నవరత్నాలు ప్రకటనతో టిడిపి పాలకుల్లో వణుకు మొదలైందని, మూడేళ్లుగా అమలుకాని హామీలు ఇచ్చిన ప్రభుత్వం డయాలసిస్ చేసుకుంటున్న కిడ్నీ బాధితులకు 2500 రూపాయలు పింఛన్ పథకం ప్రకటించడం హాస్వాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వం ప్రజలను ఉద్దాన కిడ్నీ బాధితులను మభ్యపెట్టడానికి ఇటువంటి హామీలు గుప్పిస్తుందన్నారు. జగన్ అధికారంలోకి వస్తే కిడ్నీవ్యాధితో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి 5 నుంచి 10 వేల రూపాయలు పింఛను ఇస్తుందని గుర్తు చేసారు. పలాస నియోజకవర్గ సమన్వయకర్త సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ డయాలసిస్ చేయించుకున్నవారికి పింఛను ప్రకటించడం టిడిపి అవివేకానికి నిదర్శనమన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులపై నిజమైన ప్రేమ ఉంటే ఈ వ్యాధితో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి పింఛన్ ప్రకటించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల కన్వీనరు ఎం.్భస్కరరెడ్డి, వైకాపా నాయకులు ఎం.కుమారస్వామి, దువ్వాడ శ్రీకాంత్, శ్రీనివాసరావు, కె.రమేష్, గిరిబాబు, హేమరావు, గున్నమ్మ, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

ఎన్‌బిసి కాలువ ద్వారా నీరు విడుదల
జలుమూరు, జూలై 24 : మండలం పెద్దదూగం గ్రామం వంశధార ఎడమ ప్రధాన కాలువ నుండి ఎన్‌బిసి పిల్ల కాలువ ద్వారా సోమవారం ఆ శాఖ డిఈ మురళీ మోహనరావు నీరు విడుదల చేసారు. ఈ కాలువ ద్వారా జలుమూరు, నరసన్నపేట మండలాల పరిధిలో వందలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని డిఈ మురళీమోహనరావు అన్నారు. ఇప్పటి వరకు దిగువ భూములకు వర్షాధారంతో సాగు జరిగిందని, ఇక మీదనుండి పిల్ల కాలువ ద్వారా ప్రవహించే నీటిని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ముందుగా గ్రామంలో వ్యవసాయ సాగుకు ఉపయోగ పడే చెరువులను నింపుకోవాలని ఆయన సూచించారు. ఆయనతో పాటు ఎఈలు ఎం.వి.సురేష్. మెండ తిలక్ , గౌరి ప్రసాద్, నీటి సంఘ అధ్యక్షులు పిర్యా వెంకటరావు, తిమ్మ లక్షణరావు, పలువురు రైతులు పాల్గొన్నారు.

విఆర్‌ఎల ఆందోళన
శ్రీకాకుళం(రూరల్), జూలై 24: వి ఆర్ ఏ ల సమస్యలు పరిష్కారం కోరుతూ రాష్టవ్య్రాప్త ఆందోళనలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 48గంటలు మహాధర్నాను జిల్లా వి ఆర్ ఏ ల సంఘం చేపట్టింది. ధర్నా శిబిరాన్ని సోమవారం సిటు జిల్లా ప్రధాన కార్యదర్శి సందర్శించి మద్దతు తెలిపారు. ఈసందర్భంగా గోవిందరావు మాట్లాడుతూ కనీస వేతనాలు చెల్లించకుండా పార్ట్‌టైమ్‌పేరుతో వి ఆర్ ఏ లతో వెట్టిచాకరి చేయిస్తున్నారన్నారు. రేషన్‌కార్డులను సైతం ఇనాక్టివ్ చేసిందని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించని ఎడల పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. వి ఆర్ ఏ ల సంఘం జిల్లా గౌరవధ్యక్షులు అల్లు సత్యన్నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పలస్వామిలు మాట్లాడుతూ వి ఆర్ ఏ లకు 10వ పి ఆర్ సిని అమలు చేయాలని, అర్హులైన వారికి 70శాతం ప్రమోషన్లు కల్పించాలని, కనీస వేతనం రూ.18వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నామినీ వి ఆర్ ఏలకు 1849 జీవో ప్రకారం కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్.సీతప్పడు, కె.వి రాజేశ్వరరావు, మిన్నారావు, రాజారావు, ఢిల్లీరావు, కె.శ్యామ్, బద్దర్రావు, వై.రామారావు, రామచంద్రుడు, లీలావతి తదితరులు పాల్గొన్నారు.
రిమ్స్ కాంట్రాక్టు ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు
శ్రీకాకుళం(రూరల్), జూలై 24: నెల నెల జీతం ఇవ్వకుంటే రిమ్స్ కార్మికుల కుటుంబాలు బతికేదెలా అని కాంట్రాక్టర్లు, రిమ్స్ యాజమాన్యం, కలెక్టర్ తక్షణం స్పందించాలని కోరుతూ సిటు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బకాయివేతనాలు చెల్లించాలని, పి ఎఫ్, ఈ ఎస్ ఐలు సక్రమంగా కట్టాలని కోరుతూ రిమ్స్ ఆసుపత్రి వద్ద సోమవారం రిలే నిరాహార దీక్షలు సిటు ఆధ్వర్యంలో ప్రారంభించారు. రిమ్స్ ఆసుపత్రిలో శానిటేషన్, సెక్యూరిటీ, ఎస్ టి పి ప్లాంట్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకపోవడం రెండు నెలలనుండి వేతనాలు చెల్లించకపోవడం చాలా దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. 130మంది కార్మికులు పి ఎఫ్ డబ్బులు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న ఎజైల్ సంస్థపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ డివిజన్ నాయకులు డి.గణేష్ మాట్లాడుతూ రిమ్స్ కార్మికుల సమస్యలపై డైరెక్టర్‌కు, కలెక్టర్‌కు రెండు నెలల క్రితమే వినతిపత్రం ఇచ్చినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఈ దీక్షల్లో ఉన్నవారు గణేష్, సింహాచలం, శ్యామల, రాజేంద్రప్రసాద్, ఎస్.శ్రీనివాసరావు, ఈశ్వరి, వౌనిక, భారతి, సరస్వతి, శ్రీను, అప్పన్న, పెంటయ్య, లక్ష్మణ్, విజయ, భీంశంకర్, సాంబమూర్తి తదితరులు ఉన్నారు.
గో రవాణాను అడ్డుకున్న పోలీసులు
పలాస, జూలై 24: అక్రమంగా పశువులను తరలిస్తున్న మూడు వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకొని ఆరుగురును అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ సి ఐ అశోక్‌కుమార్ తెలిపారు. లక్ష్మిపురం టోల్‌గేటు వద్ద సాధారణ తనిఖీల్లో భాగంగా పోలీసులు తనిఖీలు చేస్తుండగా కంచిలి నుంచి అలమండ సంతకు పశువులతో తరలిస్తున్న వాహనాలను గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. ఎ.సూర్యనారాయణ, గోవింద్, మన్మధరావు, అప్పన్న, సిహెచ్ కన్నయ్య, గంగారాజులను అరెస్టు చేయడం జరిగిందన్నారు. పట్టుకున్న పశువులను బారువలోకి గో శాలకు పోలీసులు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సి ఐ తెలిపారు.

గ్రంథాలయంలో పుస్తకాల హుండీ
లావేరు, జూలై 24: భక్తులు తమ కోర్కెలు తీర్చాలని కోరుతూ, కోర్కెలు తీరిన తరువాత దేవాలయం హుండీలో తమ మొక్కుబడులు చెల్లించుకుంటారు. అదే తరహాలో ఆధునిక దేవాలయాలుగా పేర్కొన్న గ్రంధాలయాల్లో పుస్తకాలను అధ్యయనం చేసి ఉన్నత స్థాయికి చేరిన వ్యక్తుల నుండి ఆ రుణం తీర్చుకునేలా పుస్తకాల హుండీలను వినూత్నంగా ఏర్పాటు చేశారు. స్థానిక శాఖా గ్రంధాలయంలో సోమవారం గ్రంధాలయ హుండీని మండల విద్యాశాఖాధికారి లండ ఈశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లావేరు శాఖా గ్రంధాలయంలో తాను విద్యార్థి దశలో గ్రంధాలను సమగ్రంగా అధ్యయనం చేసి అనేక పోటీ పరీక్షలకు హాజరయ్యానని తాను ఈ దశలో ఉండేందుకు సహకరించిన గ్రంధాలయం రుణం తీర్చుకునేందుకు పుస్తకాలను బహుకరిస్తున్నట్లు వెల్లడించారు. ఇదే తరహాలో గ్రంధాలయంలో పూర్వపాఠకులు తిరిగి ఆ గ్రంధాలయాలకు తమ శక్తి మేరకు పుస్తకాలను పుస్తకాల హుండీలో వేసి గ్రంధాలయ పాఠకులకు మరింత ప్రయోజనకరంగా గ్రంధాలయాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో గ్రంధాలయాధికారి ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ లావేరు శాఖా గ్రంధాలయంలో గ్రంధపఠనం చేసిన వ్యక్తుల్లో చాలామంది ఉన్నత స్థాయిల్లో ఉన్నారని వారు గ్రంధాలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ నల్ల కామరాజు, గ్రంధాలయ సహాయకులు ఏ.గడ్డెయ్య తదితరులు పాల్గొన్నారు.
ద్విచక్రవాహనంపై వచ్చి లక్ష రూపాయలు చోరీ
సంతబొమ్మాళి, జూలై 24: మండలంలోని భావనపాడు గ్రామానికి చెందిన జి.కృష్ణారావు నుంచి గుర్తు తెలియని అగంతుకుడు లక్ష రూపాయలతోపాటు బంగారం వున్న క్యాష్‌బ్యాగ్‌ను అపహరించి పారిపోయాడు. దీనితో కాశీబుగ్గ డి ఎస్పీ వివేకానంద, టెక్కలి సి ఐ భవానీప్రసాద్‌లు రంగంలోకి దిగారు. సోమవారం భావనపాడు నుంచి టెక్కలి ఎస్‌బి ఐకు వెళ్లి గోల్డ్‌లోన్ బంగారంతో రుణం తీసుకొని ద్విచక్రవాహనంపై జి.కృష్ణారావు తిరిగి ఇంటికి వెళ్తుండగా నౌపడలో ఆగారు. నౌపడలో ఆగిన సమయంలో గుర్తు తెలియని అగంతుకుడు జి.కృష్ణారావు వద్ద ఉన్న క్యాష్‌బ్యాగ్‌ను అపహరించుకుపోయినట్లు నౌపడ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ మేరకు డి ఎస్పీ, టెక్కలి సి ఐలు నౌపడ పోలీసుస్టేషన్‌కు హుటాహుటిన వచ్చి దొంగతనంపై విచారణ జరిపారు. కృష్ణారావును పోలీసుస్టేషన్‌ను పిలిపించి దొంగ ఏలా వచ్చాడని, ఏలా అపహరించుకుపోయాడని, ఏలా అజాగ్రత్తగా ఉన్నారని ప్రశ్నించారు. దీనితో కృష్ణారావు ఇంటి అవసరాల నిమిత్తం టెక్కలి ఎస్‌బి ఐలో బంగారంపై రుణం తీసుకున్నామని, ఇంతలో దొంగ వెనుకనుంచి వచ్చి చేతిలో వున్న బ్యాగ్‌ను లాక్కోని వెళ్లిపోయారన్నారు.

బాలికలంతా విద్యావంతులు కావాలి

ఎచ్చెర్ల,జూలై 24 : బాలికలంతా విద్యావంతులు కావాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు బడికొస్తా అనే కార్యక్రమాన్ని రూపొందించి అర్హులకు సైకిళ్లు అందజేస్తున్నారని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి అన్నారు. సోమవారం స్థానిక పోలీస్ క్వాటర్స్ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువు సాగిస్తున్న విద్యార్ధులకు సైకిళ్లు పంపిణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ బాలికలంతా విద్యావంతులైతే సమాజాభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని తెలుగుదేశం ప్రభుత్వం వివిధ విద్యా పథకాలను అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మరిన్ని వౌలిక సదుపాయాలు కల్పించి తాజాగా కంప్యూటర్ విద్యను అందించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ప్రతి విద్యార్ధి 10వ తరగతి ఉత్తీర్ణలైన తరువాత బాల్యవివాహలను వ్యతిరేకించి ఉన్నత చదువుల వైపు దృష్టి సారిస్తే గొప్ప భవిష్యత్ ఉంటుందన్నారు. సర్కార్ బడుల్లో చదివిన విద్యార్ధులు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారని అటువంటి వారిని స్పూర్తిగా తీసుకొని రాణించాలన్నారు. ఉచితంగా ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకంతో పాటు నాణ్యమైన విద్యాభోదన అంది పుచ్చుకొని తల్లిదండ్రులు, గురువులకు గొప్ప పేరు తీసుకువచ్చెలా విద్యార్ధులు శతశాతం ఫలితాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బల్లాడ వెంకటరమణారెడ్డి, సర్పంచ్ మెండరాజారావు, ఎంఈఓ పున్నయ్య,విశ్రాంత హెచ్‌ఎం వసంతరావు, ఎఆర్‌డిస్పీ చంద్రబాబు, ఆర్‌ఐ కోటేశ్వరబాబు, సిబ్బంది పాల్గొన్నారు.