కృష్ణ

అభివృద్ధే ప్రామాణికంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ప్రభుత్వ ఆదేశాల మేరకు భూముల ధరల పెంపుపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఏ మేర భూముల ధర పెంచాలనే అంశంపై జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు చైర్మన్‌గా ఏర్పాటైన కమిటీ సోమవారం కలెక్టరేట్‌లో సమావేశమైంది. రిజిస్ట్రేషన్, సిఆర్‌డిఎ, మున్సిపల్ అధికారులతో సమావేశమైన జెసి చంద్రుడు భూముల ధరల పెంపు అంశంపై సమీక్షించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధిని ప్రాతిపదికగా తీసుకుని భూముల విలువ పెంపునకు కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు రెసిడెన్షియల్, కమర్షియల్ ఏరియా తదితర అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కమిటీ చైర్మన్, జెసి చంద్రుడు తెలిపారు. గత ఏడాది ఎన్ని లావాదేవీలు జరిగాయి..? కొత్త సంస్థ ఏవైనా వచ్చాయా..? బాగా అభివృద్ధి చెందే అవకాశాలు గల ఏరియాల్లో రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచాలన్నారు. జిల్లా వ్యాప్తంగా సరాసరి 10 నుండి 20 శాతం భూముల విలువ పెరగనుందని తెలిపారు. పెడనలోని నివాస ప్రాంతాల్లో గజం రూ.4వేలు, వర్తక సముదాయాల గల ప్రాంతంలో రూ.10వేలు ప్రస్తుతం ఉందని దీన్ని 20 శాతం పెంపునకు కమిటీ అనుమతించింది. గుడివాడ పురపాలక సంఘంలో మొత్తం 20 వార్డులు ఉండగా అభివృద్ధి చెందుతున్న నాగవరప్పాడు, ఎలివర్తిపాడు ప్రాంతాల్లో 20 శాతం, మిగిలిన ప్రాంతాల్లో 10 శాతం, ఉయ్యూరులో మచిలీపట్నం-విజయవాడ ప్రధాన రహదారి, తోట్లవల్లూరు రోడ్డు ప్రాంతంలో 20 శాతం, మిగిలిన ప్రాంతాల్లో 10 శాతం పెంపు చేస్తూ కమిటీ నిర్ణయించింది. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో 10 నుండి 30 శాతం వరకు భూముల విలువ పెంపుకు అనుమతించారు. కమిటీలో తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నారు. ఈ సమావేశంలో విజయవాడ, మచిలీపట్నం రిజిస్ట్రార్లు జి శ్రీనివాసరావు, జి బాలకృష్ణ, బి శివరామ్, సిఆర్‌డిఎ అధికారులు, మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు తదితరులు పాల్గొన్నారు.