క్రీడాభూమి

ఆ ఐదు తప్ప.. ‘లోధా’కు ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 26: లోధా కమిటీ చేసిన సిఫార్సుల్లో ఐదింటిని మినహాయించి, మిగతా వాటిని అమలు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నిర్ణయించింది. బుధవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో లోధా సిఫార్సులపై విస్తృతంగా చర్చించింది. మొదటి నుంచి చెప్తున్నట్టుగానే ఐదు కీలక అంశాలపై మరోసారి విముఖత ప్రదర్శించింది. అవి తప్ప మిగతా సిఫార్సులను ఆమోదించింది. లోధా కమిటీ చేసిన సూచనల్లో బిసిసిఐ అంగీకరించని ఐదు అంశాలపై అత్యంత కీలకమైనవి కావడం విశేషం. ఒక రాష్ట్రానికి ఒకే ఓటు, పాలక మండలికి నియమితులైన అధికారులకు హక్కులు, పాలక మండలిలో పరిమితమైన సభ్యుల సంఖ్య, మంత్రులకు ప్రవేశం లేకపోవడంతోపాటు వరుసగా రెండుసార్లు, మొత్తం మీద మూడు పర్యాయాలకు మించకుండా పాలక మండలిలో సభ్యత్వం, జాతీయ సెలక్షన్ కమిటీ ఏర్పాటు అంశాలు లోధా కమిటీ సిఫార్సుల్లో ప్రధానమైనవి. వీటికితోడు పలు ఇంతర అంశాలను కమిటీ ప్రతిపాదించింది. అయితే, అత్యంత ప్రధానమైన పైన పేర్కొన్న ఐదు అంశాలను మినహాయిస్తూ, మిగతా వాటిని అమలు చేయాలని బిసిసిఐ తీర్మానించింది. ఈ నిర్ణయంపై సుప్రీం కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. లోధా సిఫార్సులను తు.చ తప్పకుండా పూర్తిగా అమలు చేయాలని కోర్టు ఏడాది క్రితమే బిసిసిఐని ఆదేశించింది. ఆతర్వాత సిఫార్సులను అమలు చేసేలా చర్యలు తీసుకోవడానికి పాలనాధికారుల బృందాన్ని నియమించింది. కానీ, బిసిసిఐ మాత్రం ఇప్పటికీ తన మొండి వైఖరిని వీడకపోవడం గమనార్హం.