క్రీడాభూమి

నిరాశ పరచిన కోహ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలే: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానులను నిరాశ పరిచాడు. చాలాకాలంగా భారీ స్కోర్లు చేయలేకపోతున్న అతను ఇటీవలే లంక బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్‌తో జరిగిన వామప్ మ్యాచ్‌లో 76 బంతులు ఎదుర్కొని 53 పరుగులు సాధించి, సహచరులకు బ్యాటింగ్ ప్రాక్టీస్‌ను అందించేందుకు వీలుగా రిటైర్డ్ అవుటయ్యాడు. ఆ ఇన్నింగ్స్‌ను చూసిన తర్వాత అభిమానులు అతను మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడని ఆనందించారు. కానీ, ఈ మ్యాచ్‌లో ఎనిమిది బంతులు ఎదుర్కొన్న అతను మూడు పరుగులు చేసి, ప్రదీప్ నువాన్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ నిరోషన్ డిక్‌విల్లాకు సులభమైన క్యాచ్ ఇచ్చి వెనుదిరగడం అందరినీ నిరాశకు గురి చేసింది.