క్రీడాభూమి

దుమ్మురేపారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలే, జూలై 26: శ్రీలంకతో బుధవారం ప్రారంభమైన మొదటి టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆటలో భారత బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్, చటేశ్వర్ పుజారా శతకాలతో కదంతొక్కారు. వీరిద్దరూ లంక బౌలింగ్‌ను దుమ్మురేపారు. రెగ్యులర్ ఓపెనర్ మురళీ విజయ్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో, అతని స్థానంలో జట్టులోకి వచ్చిన ధావన్ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 168 బంతుల్లోనే 190 పరుగులు చేశాడు. టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఇన్నింగ్స్‌ను ధావన్‌తో కలిసి ప్రారంభించిన అభినవ్ ముకుంద్ కేవలం 12 పరుగులు చేసి, నువాన్ ప్రదీప్ బౌలింగ్‌లో నిరోషన్ డిక్‌విల్లా క్యాచ్ పట్టగా పెవిలియన్ చేరాడు. టీమిండియా మొదటి వికెట్ 27 పరుగుల వద్ద కూలింది. ఆరంభంలోనే వికెట్ పడినప్పటికీ ధావన్ ఏమాత్రం వెనుకంజ వేయలేదు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన చటేశ్వర్ పుజారా జాగ్రత్త ఆడుతూ, చక్కటి మద్దతునివ్వగా, అతను పరుగుల వరద పారించాడు. రెండో వికెట్‌కు అత్యంత విలువైన 253 పరుగులు జోడించిన తర్వాత ధావన్ అవుటయ్యాడు. నువాన్ ప్రదీప్ క్యాచ్ పట్టగా నువాన్ ప్రదీప్ అతనిని పెవిలియన్‌కు పంపాడు. డబుల్ సెంచరీకి 10 పరుగుల దూరంలో ధావన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. అతను సాధించిన 190 పరుగుల్లో 31 ఫోర్లు ఉన్నాయి. అతని విజృంభణ ఏ రీతిలో కొనసాగిందో చెప్పడానికి ఈ బౌండరీలే సాక్ష్యం. కాగా, సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ కేవలం మూడు పరుగులు చేసి, నువాన్ ప్రదీప్ బౌలింగ్‌లోనే నిరోషన్ డిక్‌విల్లాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆతర్వాత మైదానంలోకి వచ్చిన అజింక్య రహానేతో కలిసి పుజారా మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడుతూ, మొదటి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లకు 399 పరుగులకు చేర్చాడు. ఎంతో జాగ్రత్తగా ఆడుతూ, క్రీజ్‌లో పాతుకుపోయిన అతను 247 బంతుల్లో అజేయంగా 144 పరుగులు చేసి, ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్‌ను గుర్తుకు తెచ్చాడు. రహానే 94 బంతుల్లో 39 పరుగులు చేసి, పుజారాకు అండగా ఉన్నాడు. తొలి రోజు కూలిన 3 భారత వికెట్లను నువాన్ ప్రదీప్ తన ఖాతాలో వేసుకోవడం గమనార్హం.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: శిఖర్ ధావన్ సి ఏంజెలో మాథ్యూస్ బి నువాన్ ప్రదీప్ 190, అభినవ్ ముకుంద్ సి నిరోషన్ డిక్‌విల్లా బి నువాన్ ప్రదీప్ 12, చటేశ్వర్ పుజారా బ్యాటింగ్ 144, విరాట్ కోహ్లీ సి నిరోషన్ డిక్‌విల్లా బి నువాన్ ప్రదీప్ 3, అజింక్య రహానే బ్యాటింగ్ 39, ఎక్‌స్ట్రాలు 11, మొత్తం (90 ఓవర్లలో 3 వికెట్లకు) 399.
వికెట్ల పతనం: 1-27, 2-280, 3-286.
బౌలింగ్: నువాన్ ప్రదీప్ 18-1-64-3, లాహిరు కుమార 16-0-95-0, దిల్‌రువాన్ పెరెరా 25-1-103-0, రంగన హెరాత్ 24-4-92-0, దనుష్క గుణతిలక 7-0-41-0.