జాతీయ వార్తలు

నితీశ్‌పై హత్యారోపణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, జూలై 26: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆకస్మికంగా రాజీనామా చేయటంపై రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికార కూటమిని చీల్చి విపక్షంతో జత కట్టడం వెనుక నితీశ్‌పై ఉన్న హత్యారోపణలే కారణమని లాలూ అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ మహాకూటమి ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేసి కొత్త శాసనసభాపక్ష నేతను ఎన్నుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 34తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌లు ఈ సమావేశంలో అభ్యర్థులుగా ఉండరు అని ఆయన అన్నారు. తన చిన్న కుమారుడు, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌పై అవినీతి ఆరోపణల నేపథ్యంలో నితీశ్‌కుమార్ రాజీనామా చేయటాన్ని ఆయన తప్పుపట్టారు. రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేసే అధికారం అత్యధిక స్థానాలున్న పార్టీగా ఆర్జేడీకే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తాను జీవితంలో బిజెపితో జత కట్టనంటూ అనేకసార్లు చెప్పిన నితీశ్ ఇప్పుడు ఎలా కలుస్తున్నారని లాలూ ప్రశ్నించారు. 1991లో జరిగిన ఒక హత్య కేసులో నితీశ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, ఈ కేసుకు సంబంధించిన ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కోవటానికి భయపడే మహాకూటమిని విచ్ఛిన్నం చేశారని లాలూ ఆరోపించారు. ఓ పక్క తాను స్వయంగా ఆరోపణలు ఎదుర్కొంటూ తేజస్విపై సిబిఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినంత మాత్రాన అతణ్ణి రాజీనామా చేయమనటం విడ్డూరమని, బిజెపి, ఆరెస్సెస్‌ల గొంతుతో నితీశ్ మాట్లాడుతున్నారన్నారు. తాము నితీశ్‌కు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని, దర్యాప్తు సంస్థలకు ఇస్తామని లాలూ స్పష్టం చేశారు.