రాష్ట్రీయం

ఐదుగురిని చంపేశాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూలై 26: ఆర్థిక ఇబ్బందులు తాళలేక కుటుంబాన్ని అంతం చేసి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ కుటుంబంలోని పెద్ద కొడుకు. ఖమ్మం జిల్లా జీళ్లచెరువు గ్రామంలో ఈ దుర్ఘటన సంచలనమైంది. కుటుం బ సమస్యలను తట్టుకోలేక తల్లితండ్రులు, భార్య, కూతుళ్లును మట్టుబెట్టి పాలేరు రిజర్వాయర్ కాల్వలోకి తోసేశాడు. అనంతరం తానూ ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఆరుగురి మృతదేహాలు పాలేరు రిజర్వాయర్ కాలువలో బుధవారం ఉదయం బయటపడ్డాయి. పోలీసుల కథనం ప్రకారం జీళ్ళచెరువుకు చెందిన షేక్ పెంటుసాహెబ్ (55) పెద్ద కొడుకు సలీంతో కలిసి ఉంటున్నాడు. ఆర్థిక సమస్యలతో కొంతకాలంగా సతమతమవుతున్న కుటుంబంలో మనస్పర్థలు చెలరేగాయి. పెద్ద కొడుకైన సలీం ఇంట్లో ఇబ్బందులను తట్టుకోలేక, సమస్యల పరిష్కారానికి పూజ చేద్దామంటూ నమ్మించి పాలేరు కాల్వకు తీసుకెళ్లాడు. తల్లిదండ్రులు, భార్య, సంతానాన్ని కాల్వలోకి తోసేసి, తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనలో షేక్ పెంటు సాహెబ్ (55), అతడి భార్య మహెబూబా (50), పెద్ద కొడుకు సలీం (30), కోడలు రజియా (27), మనవరాళ్లు నసీమా (7), షాహనాజ్ (5)లు మృతిచెందారు. సలీం సోదరుడు బాబా బతికిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం ఇంట్లో సమస్యలు సమసిపోడానికి పూజలు చేద్దామని కుటుంబాన్ని నమ్మించిన సలీం, అందర్నీ గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలోని పాలేరు రిజర్వాయర్ వద్దకు మంగళవారం అర్ధరాత్రి తీసుకెళ్లాడు. పూజాసామగ్రి తేవాలంటూ తమ్ముడు బాబాను తిరిగి ఇంటికి పంపాడు. ఇంటికి తిరిగి వచ్చిన తమ్ముడు ఇంటిదగ్గర ఆత్మహత్య చేసుకుంటున్నామని రాసిన లేఖను చూసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నా అప్పటికే దారుణం జరిగిపోయింది. కుటుంబ సభ్యుల కాళ్లు, చేతులు కట్టేసి కాలువలోకి తోసేసిన సలీం తాను కూడా అదే కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలువలోకి తోసేసే ముందు కుటుంబ సభ్యులకు మత్తుమందు ఇచ్చి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పెంటుసాహెబ్ కుటుంబం అంతా ఒకేసారి మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, ఎసిపి సురేష్‌కుమార్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను సమీక్షించి విచారణ జరిపారు.