రాష్ట్రీయం

మళ్లీ మాదే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 26: టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం పేదల సంక్షేమానికి స్వర్ణయుగంగా మారిందని, ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో రూ. 40వేల కోట్లతో వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నా రు. నగరంలోని కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జియాగూడలో రూ. 71.40 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన 840 డబుల్ బెడ్ రూం ఇళ్లకు మంత్రి బుధవారం శంకుస్థాపన చేశా రు. పు్రఅనంతరం కెటిఆర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో శాంతిభద్రతల ను మెరుగుపర్చటంతో పాటు మంచినీరు, విద్యుత్ కొరత లేకుండా చేశామన్నారు. రాష్టవ్య్రాప్తంగా రూ. 18వేల కోట్లను వెచ్చించి 2.65 లక్షల డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తున్నామని, ఇందులో భాగంగా నగరంలో కూడా లక్ష ఇళ్లను నిర్మించిన తీరుతామని వివరించారు. ఇందులో ఇప్పటివరకు 68వేల ఇళ్లకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, నిర్మాణాలను ప్రారంభించినట్లు తెలిపారు. మిగిలిన 32వేల ఇళ్లకు ఆగస్టు నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. సుమారు 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.8.50 లక్షల వ్యయంతో ఉచితంగా పేదలకు నిర్మించి ఇస్తున్న ఒక్కో ఇల్లు బహిరంగ మార్కెట్‌లో రూ. 30 లక్షల వరకు విలువ చేస్తుందన్నారు. డిప్యూటీ సిఎం మహమూద్ అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు రూ. 40వేల కోట్ల వ్యయంతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో రూ. 5300 కోట్లను 40లక్షల ఆసరా పెన్షన్లకు కేటాయించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, స్థానిక ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి మంత్రి రావడానికి ముందు ప్రోటోకాల్‌పై డిప్యూటీ సిఎం మహమూద్ అలీ, స్థానిక ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్‌ల మధ్య వాగ్వాదం జరిగింది.
చిత్రం.. జియాగూడలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి కెటిఆర్ తదితరులు