జాతీయ వార్తలు

వారంతా చనిపోయినట్లు ఆధారాల్లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 26: ఇరాక్‌లోని మోసుల్‌లో అపహరణకు గురయిన 39 మంది భారతీయులు చనిపోయినట్లు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ బుధవారం చెప్పారు. అందువల్ల వారంతా చనిపోయినట్లు ప్రకటించే పాపం తాను చేయబోనని ఆమె స్పష్టం చేశారు. బుధవారం లోక్‌సభలో ఈ అంశంపై సుష్మాస్వరాజ్ ఒక ప్రకటన చేస్తూ, ఈ విషయంలో తాను జాతిని తప్పుదారి పట్టించానంటూ వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చుతూ, వారు చనిపోయారని ఆధారాలు లభించేదాకా ప్రభుత్వం వారి జాడ తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ‘39 మంది భారతీయులు చనిపోయినట్లు సాక్ష్యం లభించే దాకా ఈ ఫైలు క్లోజ్ కాదు’ అని స్పష్టం చేశారు. వియత్నాం యుద్ధంలో కనిపించకుండా పోయిన సైనికులకోసం వియత్నాం ఇప్పటికీ వెతుకుతోందని, చివరికి రెండో ప్రపంచ యుద్ధంలో కనిపించకుండా పోయిన సైనికులకోసం అమెరికా సైతం ఇంకా వెతుకుతోందని ఆమె గుర్తుచేశారు. ‘నా మాటలు అబద్ధమని ఎవరైనా భావిస్తే వారి కుటుంబాల వద్దకు వెళ్లి చెప్పండి. అయితే ఎవరైనా తిరిగి వస్తే మాత్రం బాధ్యత మీదే అవుతుంది. అలాగే తమ వారు చనిపోయారని భావించి కుటుంబ సభ్యులు శ్రాద్ధకర్మలు కూడా జరపవచ్చు, అయితే ఎవరైనా తిరిగి వస్తే బాధ్యత వారిదే అవుతుంది. ఇరాక్ సైతం వారంతా చనిపోయారని చెప్పడం లేదు. దీని గురించి చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వారి గురించి ఎలాంటి సమాచారం లేకుండా నేను ఎటువంటి ప్రకటనా చేయబోను’ అని ఆమె ప్రతిపక్షాలనుద్దేశించి అన్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం సుష్మా స్వరాజ్ ప్రకటనతో సంతృప్తి చెందలేదు. విదేశీ వ్యవహారాలను చర్చించడం కోసం తాము నోటీసు ఇస్తామని, అప్పుడు సుష్మా స్వరాజ్ 2014లో ఏం చెప్పారో తాము చూస్తామని ఆ పార్టీ నాయకుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. స్వరాజ్ ప్రకటనపై ఎలాంటి ప్రశ్నలను అనుమతించబోనని స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పష్టం చేసిన తర్వాత ఖర్గే ఈ విషయం చెప్పారు.
2014లో ఈ అంశంపై లోక్‌సభలో తాను చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ ఈ వ్యవహారంలో తాను ఏం చేసినా అది సభ ఆమోదంతోనే చేశానని సుష్మాస్వరాజ్ అన్నారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వికె సింగ్ ఇటీవల ఇరాక్‌లో పర్యటించిన సమయంలో సేకరించిన సమాచారాన్ని బట్టి భారతీయులు మోసుల్ రాష్ట్రంలోని బాదుష్ జైల్లో ఉన్నట్లుగా తెలిసిందని నట్లు సుష్మాస్వరాజ్ ఈ నెల 16న సభలో చెప్పడం తెలిసిందే. చివరికి ఇరాక్ విదేశాంగ మంత్రి ఇబ్రహీం అల్ జాఫరీ సైతం వారు చనిపోయారో, బతికి ఉన్నారో తమకు స్పష్టమైన సమాచారం లేదని తనతో చెప్పారని ఆమె అన్నారు. అయితే బాదుష్ జైలును ఐసిస్ తీవ్రవాదులు నేలమట్టం చేశారని, జైలు వార్డెన్‌ను గుర్తించి, అతనిద్వారా భారతీయులు బతికి ఉన్నారో లేదో తెలుసుకోవాలని తాను ఇరాక్ విదేశాంగ మంత్రికి సూచించానని అన్నారు. ఒకవేళ జైలును కూల్చివేసి ఉంటే జైల్లో ఉన్న ఖైదీలంతా చనిపోయారా, మృతదేహాలు కనిపించాయా అనేది తాము అడుగుతున్న ప్రశ్నలని సుష్మాస్వరాజ్ అన్నారు. 1971నాటి పాక్ యుద్ధంలో ఒక సైనికుడు మృతి చెందినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రకటించారని, అయితే 45ఏళ్ల తర్వాత ఆ సైనికుడు పాక్ జైల్లో ఉన్నట్లు తేలిందని ఆమె గుర్తుచేశారు. తాను పార్లమెంటును కానీ, అపహరణకు గురయిన వారి కుటుంబాలను కానీ తప్పుదోవ పట్టించలేదని, అలా చేయడం వల్ల ప్రభుత్వానికి ఏం లాభం వస్తుందని ప్రశ్నించారు.