జాతీయ వార్తలు

జార్ఖండ్‌లో వరద ఉధృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోహర్‌దాగా, జూలై 26: జార్ఖండ్‌లో వరదలు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాయ. లోహర్‌దాగా జిల్లాలోని కోయెల్ నది ప్రవాహంలో ఓ అంబులెన్స్ కొట్టుకుపోయింది. అంబులెన్స్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులున్నట్టు అధికారులు వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున ఈ విషాదం చోటుచేసుకుంది. పక్షవాతానికి గురైన ఓ ఉపాధ్యాయుడు, ముగ్గురు వ్యక్తులు అంబులెన్స్‌తోపాటు కొట్టుకుపోయారని వారన్నారు. అయితే అంబులెన్స్ డ్రైవర్ మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కోయెల్ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అంబులెన్స్ కోయెల్ వంతెనపై నుంచి వెళ్తుండగా ఒక్కసారిగా ఇంజన్ ఆగిపోయింది. ఆ సమయంలో వాహనంలో ఆరుగురున్నారు. డ్రైవర్, టీచర్ బంధువు అంబులెన్స్‌ను తోయడానికి కిందకు దిగారు. అప్పటికే ప్రమాదం స్థాయిలో ప్రవహిస్తున్న కోయెల్ నది మరింద ఉగ్రరూపం దాల్చింది. అంతే ఒక్కసారిగా అంబులెన్స్ వరదలో కొట్టుకుపోయింది. డ్రైవర్‌తోపాటు ఒక వ్యక్తి బయపడగా నలుగురు వాహనంలోనే ఉండిపోయి ప్రమాదం బారిన పడ్డారని జిల్లా పోలీసు సూపరింటిండెంట్ కార్తిక్ వెల్లడించారు. సితోయా వంతెనపై తెల్లవారు జామున 2.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుందని అన్నారు. బాధితులందరూ దల్తోన్‌గంజ్‌లోని ఛిన్‌పూర్ నుంచి రాంచీ వస్తున్నట్టు ఎస్‌పి చెప్పారు. ప్రమాద వార్త తెలిసిన 15 నిముషాల్లోనే సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం దక్కలేదని డిప్యూటీ పోలీసు కమిషనర్ వినోద్ కుమార్ తెలిపారు. అయితే అంబులెన్స్ డ్రైవర్, టీచర్ బంధువు రాకేష్ రజక్‌లను రక్షించినట్టు ఆయన స్పష్టం చేశారు. పక్షవాతంతో బాధపడుతున్న ఉపాధ్యాయుడు ప్రసాద్, ఆయన బంధువులు శాంతిదేవి (50), కుశాల్ కిశోర్ (28), అశాప్రియ (18) అంబులెన్స్‌తోసహా కొట్టుకుపోయారని కమిషనర్ చెప్పారు. వరద ఉద్ధృతిగానే ఉందని, అయితే రోగి బంధువులు వత్తిడి చేయడంతో ముందుకు వెళ్లాల్సి వచ్చిందని అంబులెన్స్ డ్రైవర్ చెప్పాడు. వరద ఉద్ధృతి కారణంగా జిల్లాలో బుధవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.