జాతీయ వార్తలు

నక్సల్స్‌పై ఇక ‘ఎకె’ గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 26: నక్సలైట్ సమస్యను మరింత తీవ్రంగా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు సిఆర్‌పిఎఫ్ దళాలు వినియోగిస్తున్న సాంప్రదాయక ఇన్సాస్ ఆయుధాల స్థానే ఎకె సిరీస్ రైఫిల్స్‌ను అందించాలని సంకల్పించింది. నక్సల్ పీడిత పది రాష్ట్రాల్లోని సిఆర్‌పిఎఫ్ దళాలకు ఈ ఆయుధాలను అందించబోతోంది. అలాగే చత్తీస్‌గఢ్‌లోని దక్షిణ బస్తర్ జిల్లా ప్రాంతానికి అదనంగా రెండువేల మందితో కూడిన దళాలను తాజాగా పంపాలని నిర్ణయించింది. నక్సల్స్ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో దక్షిణ బస్తర్ ఒకటి. మావోయిస్టుల ప్రభావాన్ని తగ్గించాలంటే ఆ ప్రాంతంలో అన్ని రకాలుగానూ నిరోధక చర్యలను చేపట్టాల్సిన అవసరం వుందని సిఆర్‌పిఎఫ్ డైరెక్టర్ ఆర్.ఆర్.్భట్నాగర్ బుధవారం ఇక్కడ జరిగిన 78వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వెల్లడించారు. బస్తర్ ప్రాంతం సిఆర్‌పిఎఫ్‌కు ఒక పెద్ద సవాలేనని పేర్కొన్నారు. ఇన్సాస్ ఆయుధాల స్థానే ఎకె-47, ఎకె-56 ఆయుధాలను సిఆర్‌పిఎఫ్ దళాలకు ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిందని మరో సీనియర్ అధికారి వెల్లడించారు. ఇప్పటివరకు ఇన్సాస్ ఆయుధాలనే ఉపయోగిస్తున్నప్పటికీ నక్సల్స్ ప్రభావం వారివద్ద ఉన్న ఆయుధ శక్తిని ఎదుర్కోవాలంటే ఎకె సిరీస్ ఆయుధాలను సిఆర్‌పిఎఫ్ దళాలకు అందించాల్సిన అవసరం ఎంతో ఉందని, వీటివల్ల ప్రతీకార చర్యలను వెంటనే చేపట్టే అవకాశం ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లోని పరిస్థితిని ఎదుర్కోవడానికి నక్సల్స్ దాడి తీవ్రతను తట్టుకోవడానికి ఇన్సాస్ కంటే కూడా ఎకె సిరీస్ ఆయుధాలు అత్యంత శక్తివంతంగా పనిచేస్తాయని వివరించారు. తాజాగా రెండువేలమందితో కూడిన దళాలను పంపించడం వల్ల దట్టమైన అడవుల్లోనూ శిబిరాలను ఏర్పాటుచేయడం సాధ్యమవుతుందని తెలిపారు.