జాతీయ వార్తలు

‘ఆరోసారి’ అహ్మద్‌కు కష్టమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 26: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌కు గుజరాత్ కాంగ్రెస్ తిరుగుబాటు నాయకుడు శంకర్‌సింగ్ వాఘేలా సింహస్వప్నంగా మారారు. ఇటీవలే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన వాఘేలా మూలంగా అహ్మద్ పటేల్ ఆరోసారి రాజ్యసభకు ఎన్నిక కావటం ప్రశ్నార్థకంగా మారింది. వాఘేలా బిజెపి ఆధ్యక్షుడు అమిత్ షాతో చేతులు కలపటంతో అహ్మద్ పటేల్ రాజ్యసభకు ఎన్నిక కావటం కష్టంగా మారింది. అహ్మద్ పటేల్ ఆరోసారి రాజ్యసభకు ఎన్నిక కాకుండా చూసేందుకు వాఘేలా తన వియ్యంకుడు, కాంగ్రెస్ చీఫ్‌విప్ బల్వంత్‌సింగ్ రాజ్‌పుత్‌ను బరిలోకి దించేందుకు ప్రయత్నిస్తున్నారు. వాఘేలా కాంగ్రెస్‌కు రాజీనామా చేయటంతోపాటు తన వెంట పదకొండు మంది శాసన సభ్యులను తీసుకుపోయారు. బల్వంత్‌సింగ్ రాజ్‌పుత్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా రాజ్యసభకు పోటీ చేసేందుకు రంగంలోకి దిగితే అహ్మద్ పటేల్ రాజ్యసభకు ఎన్నిక కావటం అసాధ్యమని అంటున్నారు. అహ్మద్‌కు అత్యంత సన్నిహితుడైన బల్వంత్‌సింగ్ రాజ్‌పుత్ ఇప్పుడు వాఘేలాకు మద్దతు ఇస్తున్నారు. గుజరాత్ నుండి రాజ్యసభకు పోటీ చేసేందుకు శుక్రవారంలోగా నామినేషన్లను దాఖలు చేయవలసి ఉంటుంది. బల్వంత్ సింగ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయని పక్షంలో సీనియర్ నాయకుడు సికె రావోల్జీని రంగంలోకి దించేందుకు వాఘేలా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.