రాష్ట్రీయం

నేడు ముమైత్ వంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 26: మాదకద్రవ్యాల కేసులో నోటీసు అందుకున్న ఐటెం సాంగ్ గర్ల్ ముమైత్ ఖాన్ గురువారం సిట్ ముందుకు హాజరుకానున్నారు. తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో బుధవారం నటి చార్మిని సిట్ బృందం విచారించిన విషయం తెలిసిందే. ఒక ఏఎస్పీ స్థాయి అధికారిణితోపాటు ముగ్గురు మహిళా అధికారులు ముమైత్‌ఖాన్‌ను విచారించనున్నట్టు సిట్ అధికారులు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా ఎక్సైజ్ కార్యాలయం పరిసరాల్లో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. డ్రగ్స్ మాఫియా డాన్ కెల్విన్‌తో సంబంధాలు, డ్రగ్స్ వాడకం, సరఫరా, ఎవరెవరికి చేరుతోంది.. అనే అంశాలపై సిట్ ప్రశ్నించనున్నట్టు తెలిసింది. ఇదిలావుండగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్, ఎక్సైజ్ కమిషనర్ ఆర్‌వి చంద్రవదన్ బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్‌ను కలిశారు. రాష్టవ్య్రాప్తంగా కలకలం రేపుతోన్న డ్రగ్స్ వ్యవహారంపై చర్చించారు. ఇప్పటి వరకు డ్రగ్స్ కేసుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు. ఈ కేసులో 27 మందిని విచారించి, ఏడుగురిపై కేసులు నమోదు చేశామని, 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు అందించి, ఆరుగురిని విచారించామని వారు సిఎస్‌కు వివరించారు. డ్రగ్స్ కేసులో విచారణ పారదర్శకంగా సాగుతోందని, విచారణకు అందరూ సహకరిస్తున్నారని వారు సిఎస్‌కు వివరించారు.
ఐటీ రంగానికి తాకిన డ్రగ్స్ సెగ
మాదకద్రవ్యాలు ఐటీ రంగానికి విస్తరించాయి. ఐటీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులతో డ్రగ్స్ వ్యవహారంతో సంబంధాలున్నట్టు సిట్ గుర్తించింది. ఈ కేసులో పలువురు ప్రముఖులకు నోటీసులు పంపించేందుకు సిట్ సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. దాదాపు 18 మంది ప్రముఖుల పేర్లతో జాబితా సిద్ధం చేసినట్టు సమాచారం. త్వరలోనే వీరికి నోటీసులు అందజేయనున్నట్టు సిట్ అధికారులు తెలిపారు. డ్రగ్స్ వినియోగంలో ఐటీ రంగానికి చెందిన ప్రముఖులతోపాటు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఈ జామితాలో ఉన్నట్టు తెలిసింది. అయితే ఐటీ పరిశ్రమలో డ్రగ్స్ వినియోగించే వారిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది. దాదాపు 1500 మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు డ్రగ్స్ అందుతున్నట్టు సమాచారం. బుధవారం అరెస్టయిన మైక్ కమింగా ఐటీ ప్రముఖులకు డ్రగ్‌స సరఫరా చేస్తున్నట్టు సిట్ విచారణలో అంగీకరించినట్టు తెలిసింది.