రాష్ట్రీయం

టెన్షన్‌తో వచ్చి..నవ్వుతూ వెళ్లిన చార్మి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 26: టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన డ్రగ్స్ వ్యవహారంలో విచారణ కొనసాగుతోంది. బుధవారం సిట్ అధికారులు నటి చార్మిపై ప్రశ్నల వర్షం కురిపించారు. సిట్ అధికారుల నాలుగు ప్రశ్నలే చార్మిని చుట్టేశాయి. దాదాపు ఆరున్నర గంటల పాటు సాగిన విచారణలో డ్రగ్స్ అలవాటు ఉందా? కెల్విన్‌తో సంబంధం ఉందా? డ్రగ్స్ ఎవరెవరికి సరఫరా అవుతున్నాయి? కీలక సూత్రధారులెవరు? అనే ప్రశ్నలు చార్మిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇదిలావుండగా కెల్విన్‌తో వాట్సాప్‌లో సంభాషణలు జరిగిన ఫుటేజీని సిట్ అధికారులు చార్మి ఎదుట ప్రదర్శించినట్టు తెలిసింది. కెల్విన్‌ను దాదా అని సంబోధిస్తూ..సంభాషణలు విన్న చార్మి ఒక్కసారిగా షాక్‌కు గురైనట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా టెన్షన్‌తో సిట్ కార్యాలయానికి చేరుకున్న చార్మి..వెళ్లేటప్పుడు మాత్రం నవ్వుతూ వెళ్లినట్టు సిట్ అధికారులు తెలిపారు. చార్మి విచారణకు సహకరించాలని సిట్ పేర్కొంది. అయితే ఈ కేసులో చార్మిని కేవలం సాక్షిగానే విచారించామని సిట్ అధికారులు తెలిపారు. ఇలా ఉండగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌కు వస్తున్న బెదిరింపు కాల్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. డ్రగ్స్ మాఫియాను కూకటివేళ్లతో సహ తొలగించేందుకు నడుంబిగించిన అకున్ సబర్వాల్ బుల్లెట్‌లా దూసుకుపోతున్నారు. అనుమానితులను సాక్ష్యాధారాలతో ఆరా తీస్తుండగా ఓ వైపు సినీ ప్రముఖులు, మరో వైపు వ్యాపారవేత్తలు ఖంగుతింటున్నారు. ఈ కేసు వ్యవహారంలో రోజుకో కొత్తపేరు వెలుగులోకి వస్తుంది. దీంతో అకున్ సబర్వాల్‌కు బెదిరింపులు పెరిగాయి. ఈ విషయాన్ని డిజిపి అనురాగ్‌శర్మ దృష్టికి కూడా వెళ్లింది. దీంతో డిజిపి అకున్‌కు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇదిలావుండగా తన భర్తపై వస్తున్న బెదిరింపులపై ఆయన భార్య ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ స్పందించారు. తన భర్తకు ఏమైనా జరిగితే..ఊరుకునేది లేదని, ఎవరినీ వదిలిపెట్టనని ఆమె సహచరులతో అన్నట్టు తెలిసింది. ఓ మంచి పనికి సహకరించాల్సింది పోయి..హీనంగా బెదిరింపులకు పాల్పడడం ఏమిటని ప్రశ్నించినట్టు సమాచారం.