తెలంగాణ

సమ్మెకు వెళ్తే మీకే నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 26: తెలంగాణ రాష్ట్రంలో రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరిస్తామని, ఉన్న పళంగా సమ్మెకు వెళ్లవద్దని రేషన్ డీలర్లకు రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ సివి ఆనంద్ సూచించారు. 2017 ఆగస్టు 1 నుండి సమ్మె చేస్తామంటూ డీలర్లు ప్రభుత్వానికి నోటీసు ఇవ్వడంతో కమిషనర్ స్పందించి, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులతో బుధవారం ఆయన చర్చించారు. మంగళవారం మరో సంఘం ప్రతినిధులు బత్తుల రమేష్, మల్లేశం, వెంకటరమణలతో చర్చించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ, రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. డీలర్లకు కమిషన్ పెంచడం, ఆదాయమార్గాలను పెంచడానికి ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. ప్రభుత్వం సానుభూతితో డీలర్ల సమస్యపై దృష్టి సారించిందని, ఈ పరిస్థితిలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. అన్ని రేషన్ దుకాణాల్లో ఈపాస్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే ఏడు జిల్లాల్లో వీటి ఏర్పాటు పూర్తయిందని గుర్తు చేశారు. మరో రెండు నెలల్లో రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పూర్తవుతుందని వివరించారు. భవిష్యత్తులో రేషన్ దుకాణాలు మినీ బ్యాంకులుగా మారతాయన్నారు. ఈ కారణంగా డీలర్ల ఆదాయం పెరిగే అవకాశం ఉందన్నారు. ఆధార్ ద్వారా చేసే లావాదేవీలన్నింటినీ రేషన్ దుకాణాల ద్వారా చేసేందుకే ఈపాస్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రేషన్ దుకాణాలను మినీ సూపర్ మార్కెట్లుగా మార్చాలన్న ఆలోచన కూడా ఉందన్నారు.
డీలర్ల కమిషన్ హెచ్చింపు, గౌరవవేతనం ఇచ్చే అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని, సిఎం నిర్ణయం తీసుకునేంతవరకు ఓపిక పట్టాలని డీలర్లను కమిషనర్ కోరారు.
బియ్యం తూకంలో తేడా వస్తుందన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, గోదాముల్లోనే బస్తాలలో తక్కువ బియ్యం ఉంటున్నాయన్న విషయాన్ని గమనించామని కమిషనర్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 171 గోదాముల్లో తూకం చేసే కాంటాలను (వేయింగ్ మిషన్లు) ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని వెల్లడించారు. మొత్తం స్టాకులో 1.5 శాతం తేడాకు అనుమతిస్తూ ఆదేశాలిస్తామన్నారు.తమకు ఇచ్చే గౌరవవేతనం 30 వేల రూపాయలకు పెంచాలంటూ డీలర్ల సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. డీలర్లందరికీ వడ్డీలేని రుణాలు ఇవ్వాలని, బీమాసదుపాయం కల్పించాలని, ఆరోగ్య కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ డీలర్లు సమ్మెకు వెళితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లాస్థాయి పౌరసరఫరాల శాఖ అధికారులకు కమిషనర్ ఆనంద్ ఈ సందర్భంగా ఆదేశించారు.