తెలంగాణ

అధిక నిధులివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 26: స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం నాడు కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో జూపల్లి భేటీ అయ్యారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ ప్రాంతంలో పెద్దఎత్తున ఉపాధి కూలీలకు పని కల్పిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తప్పుడు నివేదికలవల్ల తెలంగాణ నష్టపోయిన రూ.850 కోట్లను విడుదల చేయాలని కోరినట్టు తెలిపారు. ఉమ్మడి ఏపీలో పీయంజీఎస్‌వై పథకంలో తెలంగాణకు దక్కాల్సిన వాటా దక్కలేదని కేంద్ర మంత్రికి వివరించినట్టు చెప్పారు. తెలంగాణలో పర్యటనకు రావాలని కేంద్ర మంత్రిని ఆహ్వానించినట్టు ఆయన తెలిపారు. జూపల్లితోపాటు టీఆర్‌ఎస్ ఎంపీలు, తెలంగాణ ఢిల్లీ ప్రతినిధి వేణుగోపాచారి ఉన్నారు.