విజయనగరం

పారిశుద్ధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(్ఫర్టు): పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించినట్లు మున్సిపల్ కమిషనర్ కనకమహాలక్ష్మి తెలిపారు. పట్టణంలోని 9వ వార్డులో గురువారం ఆమె తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నామని, నిర్వహణపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని,ప్రజలు సహకరించాలని కోరారు. పట్టణంలో మంచినీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి రోజు మంచినీటిని సరఫరా చేస్తున్నామని, మంచినీరు వృథాగా కాకుండా ప్రజలు సహకరించాలని కోరారు. మంచినీటి కుళాయిలకు హెడ్స్‌ను బిగించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కనకల మురళీ మోహన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ పాల్గొన్నారు.

జిల్లాలో 148 అంగన్‌వాడీ ప్రీ స్కూల్స్ ఏర్పాటు
విజయనగరం(్ఫర్టు): జిల్లాలోని 148 అంగన్‌వాడీ ప్రీస్కూల్స్‌ను ఏర్పాటుచేయాలని నిర్ణయించామని ప్రీస్కూల్స్ జిల్లా కన్సల్టెంట్ కె.వె ంకటలక్ష్మి తెలిపారు. విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం ము న్సిపాలిటీలతోపాటు నెల్లిమర్ల నగర పంచాయతీలో కూడా ఈ ప్రీస్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గురువారం ఇక్కడ మున్సిపల్ కార్యాలయంలో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అర్బన్ ప్రాంతాలలో 446 అ ంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, 346 కేంద్రాలు ప్రీస్కూల్స్‌గా ఏర్పాటుకు అనువుగా ఉన్నాయని, రెండు నుంచి మూడు కేంద్రాలను ఏకీకృతం చేసి 148 ప్రీస్కూల్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే 270 అంగన్‌వాడీ కేంద్రాలను ఏకీకృతంచేసి 88 ప్రీ స్కూల్స్‌ను ఏర్పాటు చేశామన్నారు.విజయనగరంలో 19, సాలూరులో 25, బొ బ్బిలిలో 28, పార్వతీపురంలో 11, నెల్లిమర్లలో నాలుగు ప్రీస్కూల్స్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చే శామని అన్నారు. ఈ కేంద్రాలలో 4,810 మందిచిన్నారులు విద్యాభ్యాసం చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. చిన్నారులకు నర్సరీ నుంచి ఎల్.కెజి వరకు వి ద్యాబోధన చేస్తామని తెలిపారు. తెలు గు భాషకు ప్రాధాన్యత తగ్గకుండా ఆం గ్లం విద్యాబోధన చేస్తామన్నారు. ఈవిషయంలో రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మ క నిర్ణయం తీసుకుందని, విద్యా కేంద్రాలలో చిన్నారులకు ఏకరూప దుస్తులను పంపిణీచేశామన్నారు. చిన్నారులకు నర్సరీ నుంచి ఎల్‌కెజి, యుకెజి వరకు విద్యాబోధన చేస్తామన్నారు. నర్సరీలో 1234మంది, ఎల్‌కెజిలో 2,300 మంది, యుకెజిలో 1276 మంది చిన్నారులు విద్యాబోధన చేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్ పిఓ శ్రీదేవి పాల్గొన్నారు.

సాక్షరభారత్ అమలు తీరుపై ప్రత్యేక సర్వే
జామి: జిల్లాలో సాక్షర భారత్ అమలుతీరుపై రాష్ట్ర వయోజన విద్య వనరుల కేంద్రం ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం సర్వే నిర్వహిస్తుందని జిల్లా వయోజన విద్యా ఉపసంచాలకుడు కె.కృష్ణమోహనరావు తెలిపారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా జామి, ఎల్.కోట, బొబ్బిలి, బాడంగి మండలాలను ఎంపిక చేశారన్నారు. జామి సాక్షర భారత్ సమావేశానికి హాజరైన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సర్వేలో 2010 నుండి ఈ మండలాల్లో సాక్షర భారత్ అమలు తీరుపై ఆరుస్థాయిలలో ప్రశ్నావళిని రూపొందించి సమాధానాలు రాబట్టనున్నామని తెలిపారు. ఈ ప్రశ్నా పత్రాలు వెయ్యిమంది సాక్షరభారత్ అభ్యాసకులవద్ద వందమంది వాలంటీర్లు, వందమంది సమన్వయకర్తలు, నాలుగు మండలాల సమన్వయకర్తల వద్ద సమాధానాలను తీసుకుంటామని తెలిపారు. ఈ వేదిక ఆధారంగా 12వ పంచవర్ష ప్రణాళికలతో సాక్షరభారత్ కొనసాగించాలా వద్దా అని నిర్ణయిస్తారని తెలిపారు. జిల్లాలో సాక్షరభారత్ ఏడు దశలలో పూర్తయిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ రూపొందించిన చిట్టిగురువులు కార్యాచరణ ప్రణాళికలు తయారుచేస్తున్నామని తెలిపారు. ఒక విద్యార్థి, ఇద్దరు నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతారని తెలిపారు. 2017-18 సంవత్సరంలో 8వ దశ సాక్షరభారత్ ప్రారంభం అవుతుందని తెలిపారు. జిల్లాలో ఇంకా 2లక్షల 21మంది నిరక్షరాస్యులు ఉన్నారని, వీరిలో ఒక లక్షా 65వేల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్య ఎడిఎస్.అప్పారావు, ఎస్.ఆర్.సి. డాక్టర్ ఎం.అప్పలరాజు, సమన్వయకర్త వై.వి.సూర్యనారాయణ పాల్గొన్నారు.

కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ విద్య
చీపురుపల్లి: కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందించనున్నట్టు శాసనసభ్యురాలు కిమిడి మృణాళిని అన్నారు. మండలంలోని పెదనడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు రూ 35.92లక్షల ఆర్‌ఎంఎస్‌ఎ నిధులతో నిర్మించిన ఐదు అదనపు తరగతుల భవనాలకు ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాతూ ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ తరహాలో వౌలిక సదుపాయాల కల్పనతోపాటు ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించేందుకు కృషి చేస్తారన్నారు. అంకితభావంతో ఉపాధ్యాయులు పనిచేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చన్నారు. విద్యార్ధులు నిత్యం పాఠశాలలకు హాజరుకావాలని, ఉపాధ్యాయులు బోధించే పాఠ్యాంశాలను శ్రద్ధతో చదవడం ద్వారా మంచి మార్కులు సాధించవచ్చన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్ధులకు అమలు చేస్తున్న మధ్యాహ్నభోజన పథకం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోజూ పోషకాహారాన్ని విద్యార్ధులకు అందించేందుకు ఈ పధకాన్ని అమలు చేస్తారని, నిత్యం ఉపాధ్యాయులు పర్యవేక్షించి మంచి ఆహారాన్ని విద్యార్థ్ధులకు వండి వడ్డించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిపి రౌతు కాంతమ్మ, టిడిపి మండల అధ్యక్షుడు రౌతు కామునాయుడు, ఎంపిడివో రామకృష్ణ, పాఠశాల హెచ్‌ఎం రాజేశ్వరరావు, ఎంపిటిసి సప్పలచ్చమ్మ, సూరపునాయుడు, అలమండ నర్సింహామూర్తి పాల్గొన్నారు.