విజయనగరం

జిల్లాలో రూ.20 కోట్ల గ్రంథాలయ సెస్ బకాయిలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం: గ్రంథాలయ సంస్థకు పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీలు సుమారు 20కోట్ల రూపాయల మేరకు సెస్ బకాయిలు చెల్లించవల్సి ఉందని సంస్థ జిల్లా కార్యదర్శి వి. ఎస్. సూర్యనారాయణమూర్తి అన్నారు. గురువారం గజపతినగరం శా ఖా గ్రంథాలయాన్ని కార్యదర్శి సూర్యనారాయణమూర్తి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు ఐదు కోట్ల రూపాయలు సెస్ బకాయిలు వసూలు కాగా, ఇంకా రూ.20కోట్ల మేర బకాయిలు ఉన్నాయని తెలిపారు. జిల్లాలో శాశ్వత భవనాలు లేని పది శాఖా గ్రంథాలయాలకు భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం కోటి 26 లక్షల నిధులు మంజూరు చేసిందన్నారు. ఒక్కొక్క భవన నిర్మాణానికి 12.60లక్షలు ఖర్చు కాగలదని అన్నారు. జిల్లాలోని గజపతినగరం, భోగాపురం, నెల్లిమర్ల, గరివిడి, వేపాడ, ఎల్.కోట, మెరకముడిదాం, బాడంగి, రామభద్రపురం, సీతానగరంల్లో భవన నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. వివిధ పోటీ పరీక్షలకు పుస్తకాలతోపాటు పిల్లల పుస్తకాలు గ్రంథాలయాలకు సరఫరా చేస్తామని చెప్పారు. సొంత భవనాలు ఉన్న గ్రంథాలయాలకు అధునాతన సదుపాయాలు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఫర్నీచర్ సౌకర్యం ఏర్పాటుకు 10.75లక్షలు మంజూరు అయ్యాయన్నారు. జిల్లాలో 41శాఖా గ్రంథాలయాలు ఉండగా, వాటిలో 16 గ్రంథాలయాలకు సొంత భవనాలు, 12 అద్దె భవనాలలోనూ, 13 ఉచితంగా నిర్వహిస్తున్న భవనాలు ఉన్నాయన్నారు. సొంత భవనాలు ఉన్న గ్రంథాలయాలకు 60 కంప్యూటర్లు అందజేయడంతోపాటు అంతర్జాల సదుపాయం కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో 60పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. జిల్లాలో వంద పుస్తక పంపిణీ కేంద్రాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మరుగుదొడ్లు ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. జిల్లా గ్రంథాలయానికి రూ.12 లక్షలతో సోలార్ సిస్టమ్ ఏర్పాటుచేసి ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేశామన్నారు. పాఠకులకు రక్షిత మంచినీటి అందజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలోని రికార్డులను పరిశీలించి గ్రంథాలయ అధికారి త్రినాథరావు పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి ఎం.త్రినాథరావు పాల్గొన్నారు.