అదిలాబాద్

చార్జిషీట్, సస్పెండ్లతో కార్మిక పోరాటాలను అపలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరాంపూర్ రూరల్: చార్జిషీట్ సస్పెండ్‌లతో కార్మిక పోరాటాలను అపలేరని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కలవేణి శంకర్ పేర్కొన్నారు. గురువారం కార్మిక ప్రధాన డిమాండ్ల పరిష్కాకారం కోసం ఎఐటియుసి ఆద్వర్యంలో పోరాటం చేస్తుంటే యాజమాన్యం ఎఐటియుసి కార్యకర్తలపై చార్జిషీట్, సస్పెండ్ చేయాడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతు వారసత్వ ఉద్యోగాల సాధనకోసం చేపట్టిన సమ్మె అనంతరం ప్రతిపక్ష సంఘాల గొంతు నొక్కేందుకు కార్మిక వ్యతిరేక సర్కులర్ జారీచేసిందని అన్నారు.జాతీయ కార్మిక సంఘాలు వేజ్ బోర్డు విషయాలను కార్మికులకు చెప్పెందుకు గేట్ మీటింగ్‌లు నిర్వహించే అధికారం ఉందని, సంస్థ బిఐఎఫ్‌ఆర్ పరిధిలోకి వెళ్ళిన సందర్భంగా ఎఐటియుసి కార్మికులను చైతన్య చేసి సంస్థను కాపాడిన చరిత్ర ఎఐటియుసికే దక్కుతుందని తెలిపారు. పైరవీలకే పరిమితమైన గుర్తింపు సంఘం కార్మికుల సమస్యలను పట్టించుకోవడంలేదని, సంస్థకు వచ్చిన లాభాల్లో కార్మికులకు ఇప్పటివరకు వాటా చెల్లించడం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రమోషన్ పాలసీలలో అనేక అవినీతి జరుగుతుందని, రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వ విధానాలపై అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడంతో రైతులు అన్నివర్గాల ప్రజలు వీధిపోరాటాలు చేస్తున్నారని తెలిపారు.వారికి సిపిఐ అండగా ఉండి కార్మికోద్యమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ఎఐటియుసి బ్రాంచి కార్యదర్శి ల్యాగల శ్రీనివాస్, ఏరియా ఆర్గనైజింగ్ కార్యదర్శి మల్లయ్య, సహయా కార్యదర్శి రాంచందర్,్ఫట్ కార్యదర్శి సంఘం సదానందం,జోగల మల్లయ్య,బియ్యాల శ్రీనివాస్,రాజేందర్,మేకలదాస్,ప్రసాద్‌రెడ్డి,సత్యనారాయణరెడ్డి,లింగయ్య, సాంబశివరావు, మధు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.